Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వాలంటైన్స్ డే స్ఫెషల్ రెసిపి..రెడ్ వెల్వెట్ కప్ కేకు ఈజీగా ఇలా చేసుకోండి
ప్రపంచంలోని చాలాదేశాల్లో ఫిబ్రవరి 14ని వాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. వాలంటైన్స్ డే రోజున మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా ఏదైనా తినిపించాలనుకుంటే రెడ్ వెల్వెట్ కేక్ బెస్ట్ ఆఫ్షన్. రెడ్ వెల్వెట్ కప్‌కేక్ అనేది ఒక ప్రసిద్ధ డెజర్ట్,ఇది దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, రుచికి ప్రసిద్ధి చెందింది. తరచుగా వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేయబడతాయి.
రెడ్ వెల్వెట్ కప్‌కేక్‌లు రుచికరమైనవి మాత్రమే కాకుండా వాటిలో కొన్ని పోషక విలువలు కూడా ఉన్నాయి. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఎగ్ లెస్ రెడ్ వెల్వెట్ కప్ కేకుని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
ఎగ్ లెస్ రెడ్ వెల్వెట్ కప్ కేకు తయరీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చిపాలు- 120 ml
-వెనిగర్- 1.5 టేబుల్ స్పూన్
-మైదా పిండి-160 గ్రాములు
-కోకో పౌడర్-1 టేబుల్ స్పూన్
-బేకింగ్ సోడా-1/2 టేబుల్ స్పూన్
-బేకింగ్ పౌడర్-1/2 టేబుల్ స్పూన్
-రిఫైన్డ్ ఆయిల్-120 ml
-పెరుగు-60 గ్రాములు
-చక్కెర-150 గ్రాములు
-రెడ్ జెల్ ఫుడ్ కలర్-1 టేబుల్ స్పూన్
-వెన్నిలా ఎక్స్ ట్రాక్ట్-1.5 టేబుల్ స్పూన్
-అన్ సాల్టెడ్ బటర్-115 గ్రాములు
-పంచదార పౌడర్-240 గ్రాములు
-క్రీమ్ చీజ్-225 గ్రాములు
-వెన్నిలా ఎసెన్స్-కొంచెం
-ఉప్పు-రుచికి తగినంత
ఎగ్ లెస్ రెడ్ వెల్వెట్ కప్ కేకు తయరీ విధానం
-ముందుగా పచ్చిపాలలో వెనిగర్ వేసి కలిపి 10 నిమిషాలు పక్కనపెట్టుకోండి.
-తర్వాత ఒక బౌల్ మీద జాలి పెట్టి అందులో మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా జల్లించి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత మరో బౌల్ లో చిక్కనిపెరుగు, వెనిగర్ కలిపి ఉంచిన పాల మిశ్రమాన్ని, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, రెడ్ జెల్ ఫుడ్ కలర్, వెన్నిలా ఎక్స్ ట్రాక్ట్ వేసి కలపండి. చక్కెర పూర్తిగా కరిగేదాకా బీట్ చేయాలి.
-ఇప్పుడు ముందుగా జల్లించి పక్కనపెట్టుకున్న పిండిని మూడు భాగాలుగా విభజించి అందులో ఒక భాగాన్ని ఇందులో వేసి బాగా కలపండి.
-ఇప్పుడు కప్‌కేక్ లైనర్ ట్రే తీసుకొని 12 కప్ మఫిన్ టిన్ ను లైన్ చేయండి.
-ఇప్పుడు కప్ కేకు లైనర్స్ లో రెడీ చేసిన పిండిని పూర్తిగా కాకుండా సగం సగం వరకు నింపండి.
-తర్వాత ఓ టూత్ పిక్ తీసుకొని ఆ పిండిని కొంచెం కలబెట్టి తిప్పండి చాలు.
-ఇఫ్పుడు ఓవెన్ లో ఈ ట్రేని ఉంచి 170 డిగ్రీల దగ్గర 20 నిమిషాల వరకు బేక్ చేసి తర్వాత బయటకు తీసి ఓ టూత్ పిక్ తో చెక్ చేయండి. పర్పెక్ట్ గా వస్తే ఈ ట్రేని బయటకు తీసి చల్లారనివ్వండి.
-తర్వాత అన్ సాల్టెడ్ బటర్ లో పంచదార పొడి వేసి బాగా బీట్ చేసిన తర్వాత ఇందులోనే క్రీమ్ చీజ్ వేసి బీట్ చేయండి. ఇందులోనే కొంచెం వెన్నిలా ఎసెన్స్ కూడా వేసి బాగా బీట్ చేసి అరగంట పాటు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
-తర్వాత చల్లారిన కప్ కేకుని ట్రే నుంచి బయటకు తీసి కేకు మీద ఫిడ్జ్ లో ఉంచి మిశ్రమంతో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. అంతే ఎగ్ లెస్ రెడ్ వెల్వెట్ కప్ కేకు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












