వానాకాలంలో వేడివేడిగా..ఆరోగ్యానికి మేలు చేసే వామాకు బజ్జీలు..5 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోతున్న ఈ సమయంలో వేడి వేడిగా ఏదైనా తినాలనే కోరిక కలగడం సహజం. ఇలాంటప్పుడు వామాకు బజ్జీలు ఓ ట్రై చేసి చూడండి. వామాకులో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వామాకుతో తయారు చేసే బజ్జీలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. సులభంగా తయారుచేసుకోగలిగే ఈ బజ్జీలు జీర్ణక్రియకు సహాయపడతాయి. వామాకు బజ్జీలను తయారుచేయడానికి చాలా సులభంగా లభించే పదార్థాలు సరిపోతాయి. వామాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

వామాకు బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-వామాకు
-శెనగపిండి
-బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్
-పసుపు
-కారం
-ఉప్పు
-నీళ్ళు
-నూనె

Vamu Aaku Bajji A Delicious and Healthy Snack for Rainy Days

వామాకు బజ్జీ తయారీ విధానం

-ముందుగా వామాకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.

-తర్వాత ఓ గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల శెనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి లేదా కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి) వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.

-తర్వాత అందులో తగినన్ని నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా చూసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చెయ్యాలి.

-ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న వామాఆకులను ఒక్కొక్కటిగా కలిపిన పిండిలో ముంచి ఆయిల్ లో వేసుకోవాలి.

-మీడియం మంట మీద రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని టిష్యూ పెట్టిన ప్లేట్ లోకి తీసుకోవడం ద్వారా అదనపు నూనెను తొలగిపోతుంది.

-వామాకు బజ్జీలను వేడివేడిగా టమోటా సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా రుచికరంగా ఉంటాయి.

కొన్ని ప్రయోజనాలు

వామాకులో విటమిన్ A, B, C, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వామాకులో ఉండే యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వామాకును తింటే కఫం తగ్గుతుంది. వామాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే థైమోల్ ( అనే రసాయనం జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది, ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బజ్జీల వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ వామాకు వాడటం వల్ల ఆ సమస్య తగ్గుతుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion