Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
మసాల గీ రైస్ రిసిపి హెల్తీ అండ్ టేస్టీ
రైస్ వంటకాల్లో గీ రైస్ ఒక ఫేమస్ డిష్. గీ రైస్ అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ గీరైస్ రిసిపికి మీకు నచ్చిన కర్రీతో తీసుకోవచ్చు. ముఖ్యంగా గీరైస్ కు కుర్మా డిష్ లు చాలా ఫర్ ఫెక్ట్ గా నప్పుతాయి.
గీ రైస్ మంచి ఫ్లేవర్ తో పాటు, రుచిని కలిగి ఉంటుంది. గీ రైస్ కు ఎక్కువగా నెయ్యి, మరింత రుచికరంగా ఉండటం కోసం, పచ్చిబఠానీలు, డ్రైనట్స్ ను ఉపయోగిస్తుంటాము. స్పైసీగా ఉండాలంటే, మీకు అవసరం అయ్యేంత కారం లేదా పచ్చిమిర్చిని జోడించి తయారుచేసుకోవచ్చు.

గీ రైస్ మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ మాత్రమే కాదు, ఇందులో ఉపయోగించే పచ్చిబఠానీలు, డ్రైనట్స్, మరియు నెయ్యి, మన ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. మసాలా గీరైస్ తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా తయారుచేసుకోచ్చు. మరి మీరు కూడా రుచి చూడాలంటే వంట ఎలా తయారుచేయాలో తెలుసుకోవాలిగా మరి.....

Serves: 3
Preparation Time: 15 minutes
Cooking Time: 20 minutes

కావల్సిన పదార్థాలు:
నెయ్యి: 2tbsp
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 3
జీడిపప్పు: 3tbsp(సన్నగా తరిగినవి)
కరివేపాకు రెమ్మలు: 2లేదా 3
పచ్చి బటానీలు: ½cup
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగాలి)
పచ్చిమిర్చి: 3(చిన్న ముక్కలుగా తరిగాలి)
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: 1/4 tsp
కారం: 1 tsp
రైస్ : 1 ½ cup

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తరవ్ాత అందులో బిర్యానీ ఆకులు, జీడిపప్పు మరియు కరివేపాకు వేసి మీడియం మంట మీద ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో ఫ్రెష్ గా ఉండే పచ్చిబఠానీలను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మీడియం మంట మీద వేగించుకవోాలి.
4. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తే ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత కారం కూడా వేసి ఫ్రై చేసి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
6. వైట్ రైస్ కు మొత్తం మసాలా పట్టే వరకూ మిక్స్ చేసుకోవాలి.

న్యూట్రీషియన్ టిప్:
ఈ మసాలా గీ రైస్ లో జీడిపప్పును జోడించడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పూర్తి పోషకాలను అందించే నెయ్యి, జీడిపప్పు వంటివి మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలను అందిస్తాయి. అవి మన శరీరంలో ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అయితే ఏదైనా మితంగా మాత్రమే తీసుకోవాలి.




Click it and Unblock the Notifications











