For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పాలక్ రిసిపి: నవరాత్రి స్పెషల్

|

సాధారణంగా పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనే ఏదైనా ప్రత్యేకమైన వంటలు తయారుచేసి, అథితులకు, కుటుంబం సభ్యులకు వడ్డించాలనుకుంటారు. అలా పండుగ పర్వదినాల్లో తయారుచేసే వంట ఆలూ పాలక్. ఈ వంటను నవరాత్రి స్పెషల్ వెజిటేరియన్ వంటగా తయారుచేసుకుంటారు. ఈ వంట ఒక మంచి ఇండియన్ వంట. ఈ నవరాత్రి సమయంలో ఇటువంటి వంటలను స్పెషల్ గా తయారుచేసుకుంటారు .

ఆలూ పాలక్ రిసిని హెల్తీ మరియు న్యూట్రీషియన్ రిసిపి. ఆకుకూర మరియు ఆలూ రెండింటిని ఫ్రై చేయకుండా కుక్కర్ లో ఆవిరి మీద ఉడికించడం వల్ల పోషకాలు కోల్పోకుండా, ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉపయోగించి స్పెషల్ గా కూడా తయారుచేస్తుంటా. మరి ఈ హెల్తీ అండ్ న్యూట్రిషయిన్ ఆలూ పాలక్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Aloo Palak: Desi Recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 3 (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆకుకూర(పాలకూర): 250grms(కాడలు తొలగించి సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3 (చిన్న ముక్కలుగా తరిగినవి)
వెల్లుల్లి: 4-5 (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పసుపు పొడి: 1tsp
కారం: - 2tsp
ధనియాల పొడి 2 tsp
డ్రై మ్యాంగో పొడి: ½ tsp
జీలకర్ర మరియు ఆవాలు : 1tsp
బే ఆకు: 1
నూనె: 2tbsp
నీళ్ళు: 1/3cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూరను విడిపించి బాగా శుభ్రంగా కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత పెజర్ కుక్కర్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో బంగాల దుంప ముక్కలు వేసి మీడియం మంట మీద 2నిముషాలు వేగిస్తూ, పాలకూర తరుగును కూడా వేయాలి.
4. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఎక్కువ మంట మీద ఒక నిముషం వేగించుకోవాలి.
5. ఇప్పుడు ఉప్ప మరియు పసుపు వేసి మంటను తగ్గించి మరో 2 నిముషాలు ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు టమోటో ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసొ కొన్ని నిముషాలు ఉడికించాలి. తర్వాత అందులో కారం, ధనియాలపొడి కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి
7. తర్వాత తగినంత మాత్రం నీల్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి ప్రెజర్ కుక్కర్ మూత మూసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. అంతే ఆలూ పాలక్ రెడీ రోటీ మరియు రైస్ కు సైడ్ డిష్ గా దీన్ని మీరు సర్వ్ చేయవచ్చు.

English summary

Aloo Palak: Desi Recipe

The recipe is healthy and nutritious as potatoes and spinach are pressure cooked and not fried. You can also add other ingredients like tomatoes and green chillies. Check out this Indian side dish recipe to prepare aloo palak.
Story first published: Saturday, September 27, 2014, 14:36 [IST]
Desktop Bottom Promotion