Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బెంగాల్ స్టైల్ ఫ్రైడ్ కిచిడి
ఇండియన్ కుషన్స్ లో అతి సులభంగా తయారుచేసే వంటకం కిచిడి. వంటచేయడానికి బద్దకించి ఉన్నప్పుడు, టేస్టీగా ఏదైనా వెంటనే తయారుచేసుకొని తినాలనుకున్నప్పుడు బియ్యం, పప్పు కుక్కర్ లో వేసి వండేసుకోచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన హెల్తీ కుక్కింగ్ టిప్. కిచిడిని సులభంగా తయారుచేసుకోవచ్చు అనడం కంటే, జీర్ణక్రియ సమస్యలున్నవారికి చాలా తేలికగా జీర్ణం అయ్యే ఆహారంగా దీన్ని పరిగణించవచ్చు. జీర్ణం తేలిక మాత్రమే కాదు, ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.
కిచిడి అంటే చాలా సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు టేస్టీ తయారుచేసుకొనే ఒకరకమైన వంట. కానీ చాలా ఉత్సహాంగా, టేస్టీగా ఈ వంటను తయారుచేసుకోవాలంటే ఇక్కడ బెంగాల్ స్టైల్లో తయారుచేసిన, వెరైటీ వంటకాన్నీ ఇక్కడ అందించాము. వివిధ రకాల మసాలాలు, మరియు వెజిటేబుల్స్ తో వెరైటీ ఫ్రై చేసి, తయారుచేసిన ఈ కిచిడి నోరూరిస్తూ, చాలా రుచికంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

పెసర పప్పు: 1cup
బిర్యానీ ఆకు:2
యాలకులు: 2
లవంగాలు: 2
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఎండుమిర్చి : 2
ఉల్లిపాయ : 1(పెద్దది, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటా: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బటానీలు: ½cup
క్యారెట్: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
బంగాళాదుంప: 1(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కొబ్బరి తురుము: 1/2cup
చక్కెర: 1tsp
జీడిపప్పు: 1tbsp
ఎండు ద్రాక్ష: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
వెచ్చని నీటి 4 cups
నెయ్యి: 2tbsp
స్పైస్ (మసాలా) పౌడర్ కోసం:
ఎండు మిర్చి: 2
గ్రీన్ ఏలకులు: 2
లవంగాలు : 4
దాల్చిన చెక్కలను: 2
జీలకర్ర: ½tsp
ఉల్లిపాయ విత్తనాలు: ½tsp
మెంతులు: ¼tsp
సోపు గింజలు: ¼tsp
ఆవాలు: ½tsp
ధనియాలు:1tbsp
హింగ్ (ఇంగువ) : ఒక చిటికెడు
తయారుచేయు విధానం:
1. ముందుగా పెసరపప్పును లైట్ గా వేగించి, చల్లార్చి పెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మసాల పౌడర్ కోసం సిద్దం చేసుకొన్ని వస్తువులన్నింటిని లైట్ గా వేగించుకొని, చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ద్రాక్షవేసి లైట్ గా వేగించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి, అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
6. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అలాగే పచ్చిబఠానీ, క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత టమోటో కూడా వేసి వేగించాలి. ఒక నిముషం తర్వాత అందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకొన్న బియ్యం, పసుపు, మసాలా పౌడర్ వేసి 5నిముషాలు వేగించాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, ఉప్పు, పంచదార, ద్రాక్ష, మరియు జీడిపప్పు వేసి మరో 5నిముషాలు వేగించాలి.
8. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, మూత పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
9. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్లో ఆవిరి పూర్తిగా తగ్గే వరకూ అలాగే ఉండి, తర్వాత మూత తీసి, కిచిడి సర్వింగ్ బౌల్లోని మార్చుకోవాలి. అంతే బెంగాలీ స్టైల్ ఫ్రైడ్ కిచిడి రెడీ.
మీకు నచ్చిన సైడ్ డిష్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











