Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
కరివేపాకు ఫ్రైడ్ రైస్-హెల్తీ అండ్ టేస్టీ
కరివేపాకు ఒకరకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. సువాసన గల చిన్న వృక్షం. కరివేపాకు కూర , చారు , పులుసు వంటకాలలో సువాసనకోసం వాడుతారు. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది. దీనిని వివిధ రకాల ఆహార పదార్థాలతోపాటు తీసుకోవచ్చు లేదా పొడి చేసుకుని వాడుకోవచ్చు.
కరివేపాకు పొడి చాలా వేడి అ౦టారు. కానీ రోజూ వేడి అన్న౦ లో ఒక స్పూను పొడి వేసుకుని నెయ్యి కలుపుకుని తి౦టే మ౦చిది. పొడిగా కాకుండా కొంచెం వెరైటీగా పొడితోనే ఫ్రైడ్ రైస్ చేసి తింటే రుచిరుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం...కర్రీ లీవ్స్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కరివేపాకు: 1cup
బియ్యం: 11/2cup
కొబ్బరిపొడి: 1/2tsp
పచ్చిమిర్చి: 4
ఎండు మిర్చి: 2
సొంఠి పొడి: 1/2tsp
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
ఉల్లిపాయ: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
జీడిపప్పు: 10
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని పొడి పొడిగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో జీడిపప్పు, కొబ్బరి తురుము కరివేపాకును వేరు వేరుగా వేయించుకోవాలి.
3. తర్వాత కరివేపాకు చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి తాలింపు వేయాలి.
5. అందులోనే ఉల్లిపాయ ముక్కుల, అల్లం వెల్లుల్లి పేస్ట్ సొంఠి పొడి వేసి వేగించుకోవాలి.
6. తర్వాత అందులోనే చల్లార్చి పెట్టుకొన్న అన్న, కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నం కొంచెం వేడయ్యాక రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకొని క్రిందికి దింపుకోవాలి. అంతే నోరూరించే కరివేపాకు ఫ్రైడ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications











