For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన గోబి బట్టర్ మసాలా గ్రేవీ

|

మధ్యహ్నా సమయంలో రెగ్యులర్ భోజనం కంటే మరింత స్పెషల్ మీల్స్ కోరుకుంటున్నట్లైతే చిల్లీ గోబి బట్టర్ మసాలా ఒక బెస్ట్ రిసిపి. గోబి బట్టర్ మసాలా రిసిపిని మధ్యహ్న భోజనంలో తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం . ఈ స్టార్టర్ రిసిపి పొట్టనింపుతుంది. టేస్ట్ బడ్స్ ను సంతృప్తి పరుస్తుంది.

కాలీఫ్లవర్ తో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. కాలీఫ్లర్ వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. గోబి బట్టర్ మసాలా రిసిపి రెగ్యులర్ వంటలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వంటను కొన్ని బేసిక్ పదార్థాలతో తయారుచేస్తారు. గోబీ బట్టర్ మసాలా సైడ్ డిష్ గా వడ్డిస్తే మరింత టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లల్లు కూడా ఇష్టంగా తింటారు. ఈ స్పెషల్ టేస్ట్ కోసం కొంత వెరైటీగా కస్తూరి మేతి పౌడర్ ను మిక్స్ చేసి తయారుచేయవచ్చు.

Delicious Gobi Butter Masala Gravy

కావల్సిన పదార్థాలు:
వెన్న: 1cup (కరిగించాలి)
మసాలాలు: గుప్పెడు(ఏలకలు, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకులను ఒక పలుచని వస్త్రంలో వేసి చుట్టాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
జీడిపప్పు: 1 గిన్నె
అల్లం వెల్లుల్లి: 1tbsp(పేస్ట్)
ఉప్పు : 1tsp
పచ్చిమిర్చి: 6(మీ రుచికి తగినంత తీసుకోవచ్చు)
ఎండుమిర్చి: 5-6(మీ రుచికి తగినంత)
టొమాటోలు: 4 (సన్నగా తరిగినవి)
చక్కెర: 1tbsp
కస్తూరి మేతి: 1tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
ఆల్ పర్పస్ ఫ్లోర్: 1tbsp
ధనియాల పొడి: 1 tsp
ఉప్పు : రుచికి సరిపడా
ఫ్రెష్ క్రీమ్ రుచి: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా బట్టర్ వేసి, వేడి చేయాలి. వేడి అయ్యాక పల్చటి వస్త్రంలో చుట్టి పెట్టుకొన్న మసాలాలను వస్త్రంతో పాటు అలాగే వేయాలి.
2. ఇప్పుడు అందులో ఉల్లిపయా ముక్కలు, జీడిపప్పు వేసి నిధానంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారే వారకూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ మరియు ఉప్పు వేసి ఫ్రై చేయాలి. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో ఎండుమిర్చి వేసి, ఫ్రై చేస్తూ మిక్స్ చేయాలి. తర్వాత టమోటో ముక్కలు వేసి మిక్స్ చేసి మూత మూసేయాలి. మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత మూత తీసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. తర్వాత ఈ పేస్ట్ ను బ్లౌల్లోకి మార్చుకొని, ఉడికించాలి.దీనికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి , తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
7. అందులోనే కొద్దిగా కస్తూరి మేతి మిక్స్ చేసి కలగలుపుకోవాలి.
8. ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, మైదా, పెప్పర్ పొడి, ధనియాలపొడి మరియు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి . అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఈపేస్ట్ ను గోబీ(చిన్న చిన్నవిగా విడిపించి, శుభ్రం చేసిన కాలీఫ్లవర్ )కు అప్లై చేయాలి. ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి.
9. ఇప్పుడు అదే పాన్ లో మిక్సీలో గ్రైడ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ మరియు కొద్దిగా బట్టర్ వేసి ఉడికించుకోవాలి.
10. 5నిముషాల తర్వాత మసాలా దంటించి పెట్టుకొన్న గోబిని అందులో వేసి మూత పెట్టాలి . ఇలా చేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గోబి బట్టర్ మసాలా రెడీ..

English summary

Delicious Gobi Butter Masala Gravy

This afternoon we have a special treat. For those who love gobi, this simple recipe will leave you wanting for more. Boldsky shares with you an easy gobi butter masala recipe. The highlight of this gobi recipe is you can eat it with rice, pulav and even roti.
Story first published: Friday, March 6, 2015, 14:35 [IST]
Desktop Bottom Promotion