Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
గుజరాతీ ఆలూ సబ్జి కాంబినేషన్ ఫర్ వెజ్ ఫులావ్
బంగాళదుంపలతో తయారు చేసిన వంటలంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి ? బంగాళదుంపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేయవచ్చు . వీటితో తయారు చేసే అన్ని రకాల వంటాలు మంచి ఫ్లేవర్ తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటాయి.
బంగాళదుంపలతో వివిధ రకాల ఎక్స్ పిరిమెంట్స్ చేసి కొత్త టేస్ట్ ను రుచి చూడవచ్చు. ఈ ఆలూ సబ్జీ పూర్తి గుజరాతీ వంటకాం. గుజరాతీయులు చాలా వరకూ వెజిటేరియన్స్. చాల మంది ఇప్పటీ అక్కడ ఉల్లిపాయ మరియు వెల్లల్లి వంటివి వారి రెగ్యులర్ డైట్ లో వాడరు. ఈ స్వీట్ ట్యాంగీ గుజరాతీ ఆలూ సబ్జీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం...

బంగాళ దుంపలు: 500gms (చిన్నవి, సగభాగం లేదా నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి)
అల్లం పేస్ట్: 1tsp
టమోటా ప్యూరీ: 2tbsp
పెరుగు: 2tbsp
హింగ్ (ఇంగువ) : ఒక చిటికెడు
పసుపు: 1tsp
కారం: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర పొడి: 1tsp
చక్కెర: ½ స్పూన్
రుచి ప్రకారం ఉప్పు వంటి
నూనె: 1tbsp
నీళ్ళు: ½ cup(వెచ్చని)
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఇంగువ మరియు పంచదార వేసి ఒక నిముషం ఫ్రై చేయాలి.
2. పంచదార బ్రౌన్ కలర్లోనికి మారగానే, అందులో అల్లం పేస్ట్ వేసి మరో కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో టమోటో ప్యూరీ, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరో రెండు నిముషాల ఉడికిచుకోవాలి.
4. తర్వాత అందులో బంగాళదుంప ముక్కలను వేసి మీడియం మంట మీద 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. ఈ మిశ్రమాన్నంతటిని మరో రెండు నిముషాలు ఉడికించి, అందులో ఉప్పు, గోరువెచ్చని నీరు పోసి మూత పెట్టి 10నిముషాల పాటు ఉడికించుకోవాలి.
6. పది నిముషాల తర్వాత మూత తీసి పోర్క్ గో బంగాళాదుంపలు ఉడికినవో లేదో చెక్ చేసి మరికొద్దినిముషాలు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు పూర్తిగా ఉడికిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ గుజరాతి ఆలూ సబ్జీ వెజిటేబుల్ పులావ్ మరియు రోటీలకు చాలా మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











