యమ్మీ యమ్మీ : వెజిటేబుల్ బిర్యానీ రిసిపి : వీడియో..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు 'బిర్యాని' అన్న పదం వినగానే ఒక వేడుకలాగా అనుభూతి చెందుతారు. అన్నాన్ని స్పైసి మాంసంతో కలిపి మరియు వివిధ సుగంధ వాసన మీ ముక్కుపుటాలను తాకగానే, తక్షణమే ముక్కలను కొరికి తినాలనే కోరిక కలుగుతుంది.

How To Prepare Vegetable Biryani

అది క్రిస్మస్, దీపావళి లేదా ఈద్ కానివ్వండి, బిర్యానీ ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా సరిపోతుంది. కానీ, మీరు ఒక శాకాహారి అయినట్లయితే, ఈ వంటకాన్ని ఆనందించలేరు, కానీ ఇప్పుడు ఆ ఆలోచన ఆపేసి, ఇక్కడ ఇంట్లో కూరగాయల బిర్యాని ఎలా సిద్ధం చేయాలి అన్నది చూద్దాం.

నూతన సంవత్సరంలో నూతన వారానికి స్వాగతం పలకటానికి వెజెటబుల్ బిర్యాని సులభంగా తయారుచేయటానికి క్రింద చాలా సులభమైన స్టెప్స్ ఇచ్చాము. ఒకసారి చూడండి.

ఆరుగురికి

తయారుచేయటానికి సమయం - 15 నిముషాలు

ఉడికే సమయం - 25 నిముషాలు

కావలసిన పదార్థాలు:

అన్నం తయారు చేయటానికి:

1. బే ఆకు - 1

2. లవంగం - 1

3. దాల్చిన స్టిక్ - 1

4. ఏలకులు - 1

5. రైస్ - 2 కప్పులు (కడిగి మరియు పొడిగా)

6. రుచికి తగినంత ఉప్పు

కూడా చదవండి: ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ

వెజిటబుల్ గ్రేవీ కోసం:

7. ఉడికించిన మిశ్రమ కాయగూరలు - 2 కప్పులు (క్యారెట్లు, బీన్స్, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, బటానీలు, మొదలైనవి)

8. నూనె - 2 టేబుల్ స్పూన్లు

9. కాటేజ్ చీజ్ - ¼ కప్ (చిన్న ముక్కలుగా కట్)

10. జీలకర్ర - ½ స్పూన్

11. ఉల్లిపాయలు - ¾ కప్ (చిన్న ముక్కలుగా కట్)

12. పసుపు పౌడర్ - ¼ స్పూన్

13. అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్టు - 2 స్పూన్స్

14. గరం మసాలా పౌడర్ - ½ స్పూన్

15. కొత్తిమీర పౌడర్ - 2 స్పూన్స్

16. పాలు - ¼ కప్

17. కారం - 1 స్పూన్

18. టొమాటోస్ - 1 కప్పు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

19. ఉప్పు రుచి

20. చక్కెర చిటికెడు

21. పెరుగు - ¼ కప్

22. కొత్తిమీర ఆకులు - ¼th కప్

23. తినదగిన కుంకుమ కలర్ - కొన్ని చుక్కలు

24. నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

25 క్రీమ్ - 1 స్పూన్

చదవండి: రుచికరమైన చిక్పీస్ బిర్యాని రెసిపీ

విధానము:

1. అరగంటసేపు బియ్యం నాననివ్వండి మరియు ఆ తరువాత అందులో నీటిని తీసివేయండి. ఇప్పుడు, ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో నీరు పోయాలి. ఆ నీటిని వేడి చేయండి. ఆ నీటిలో దాల్చిన చెక్క, లవంగం, ఏలకులు మరియు బే ఆకు వేయండి.

 Vegetable Biryani

2 . ఇప్పుడు నానపెట్టిన బియ్యం అందులో వేయండి. 10 నిముషాల వరకు ఉడకనివ్వండి. బియ్యాన్ని మరీ ఎక్కువగా ఉడకనివ్వవద్దు: ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా గుజ్జులాగా అవుతుంది. ఇప్పుడు అందులో మిగిలిన నీటిని తీసివేసి పక్కకు పెట్టుకోండి.

 Vegetable Biryani

3 . ఇప్పుడు వెజిటబుల్ గ్రేవీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. దానిలో జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడుతుండగా ఉల్లిపాయ ముక్కలను వేయండి. అవి బంగారు రంగులో వొచ్చేవరకు వేయించండి. ఇప్పుడు దానికి అల్లం వెల్లుల్లి-మిరప కాయ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పౌడర్ మరియు టమోటాలు కలపండి.

 Vegetable Biryani

4. టమోటాలను, మసాలాలో బాగా ఉడికించాలి. బాగా ఉడకటానికి, 2 టేబుల్ స్పూన్ల నీరు పోయండి మరియు టమోటాలు బాగా ఉడికేట్లుగా చూడాలి. ఇప్పుడు, దీనిలో ఉడికించిన కూరగాయలు, పనీర్ మరియు రుచికి తగినంత ఉప్పు వేయండి. బాగా కలియపెట్టండి. ఇప్పుడు, కూరగాయలలో పాలు పోసి, బాగా కలపండి. దీనిని కొద్దిగా మందంగా మరియు గుజ్జుగా తయారుకావడానికి ఒక చిటికెడు చక్కెర మరియు క్రీమ్ ఒక చిటికెడు కలపండి.

 Vegetable Biryani

5. గ్రేవీ చిక్కగా తయారయిన తరువాత, కూరగాయలను సిద్ధంగా ఉంచుకోండి. వాటిని పక్కన ఉంచండి. బియ్యంతో కూరగాయలు కలపాలి. దానికన్నా ముందు, మీరు అన్నంలోకి మిక్శ్చర్ తయారుచేసుకోవాలి.

 Vegetable Biryani

6. పెరుగును తీసుకోండి మరియు దానికి తరిగిన కొత్తిమీర, కుంకుమ రంగు కలపండి. ఇప్పుడు, అన్ని పదార్ధాలను కలపండి మరియు అన్నానికి కలపండి. బాగా కలపండి, ఇప్పుడు మీరు సగం వైట్ రైస్ మరియు సగం సాఫరాన్ రైస్ తయారుచేసుకున్నారన్న మాట.

 Vegetable Biryani

7. అప్పుడు, తయారయిన అన్నం ఒక పొరలాగా సిద్ధం చేసుకోండి. దానిపైన, మీరు తయారు చేసుకున్న కూరగాయల గ్రేవీ జోడించండి. ఇది సమంగా చదునుగా వేయండి మరియు దానిపై మిగిలిన అన్నాన్ని వేయండి. దానిపైన నెయ్యి లేదా పాలు వేయండి.

 Vegetable Biryani

8. ఒక పెద్ద హాండితో కవర్ చేయండి. పొయ్యి మీద ఒక తవా ఉంచండి. దాని పైన ఆ పెద్ద హాండిని ఉంచండి. అందువలన బిర్యానీ అడుగంటాడు. కనీసం అరగంటసేపు కూరగాయల బిర్యాని ఉడికించాలి మరియు వేడివేడిగా రైతాతో వడ్డించండి.

దీనిని ప్రయత్నించండి మరియు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

English summary

How To Prepare Vegetable Biryani

Whenever you hear the word 'Biryani' you feel celebratory. When the rice mixes with the spicy meat and the aroma of different spices soothes your senses, you feel like grabing a bite of it that instant.
Please Wait while comments are loading...
Subscribe Newsletter