For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడై మష్రుమ్ రిసిపి: అధ్భుతమైన రుచి

|

సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది మష్రుమ్(పుట్టగొడుల)రుచి, వాసన పట్టదు. అటువంటి వారు ఈ మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.

Kadai Mushroom Recipe

మష్రుమ్ క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు మన శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరి మీరు కూడా మష్రుమ్ టేస్ట్ చేయాలన్నా, లేదా మీ ఇంటికి వచ్చిన అథితులకు ఒక కొత్త రుచి చూపించాలన్నా మష్రుమ్ కర్రీనీ ట్రై చేయండి. ఈ సింపుల్ రిసిపి కడైలో తయారుచేయడం వల్ల దీనికి కడై మష్రుమ్ అని పేరు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
పుట్టగొడుగులను-250grms
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
కాప్సికమ్: 1 (కట్ చేసినవి)
టమోటో: 2-3 (కట్ చేసుకోవాలి)
అల్లం: ½ అంగుళం
వెల్లుల్లి రెబ్బలు: 4-5
టమోటో పచ్చిమిర్చి: 3-4
కారం: 1tsp
పసుపు: ½tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి 4tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర తరుగు: గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా మష్రుమ్(పుట్టగొడుగులకు)శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. కడాయ్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొన్న పేస్ట్ ను వేసి, మీడయం మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో క్యాప్సికమ్, టమోటో ముక్కలు మరియు ఉప్పు వేసి మీడయం మంట మీద రెండు నిముషాలు వేయించుకోవాలి
5. తర్వాత కొద్దిగా పసుపు, కారం చిలకరించి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు అందులో నీళ్ళు పోసి మిక్స్ చేసి, ఒక నిముషం ఉడికిన తర్వాత అందులో కట్ చేసుకొన్న మష్రుమ్ పుట్టగొడుగులను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని గ్రేవీ చిక్క బడే వరకూ, ముష్రుమ్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
7. చివరగా గరం మసాలా వేసి మిక్ంస్ చేసి, ఒక నిముషం తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే కడీ మష్రుమ్ రెడీ. దీన్ని ప్లెయిన్ రైస్ లేదా రోటీలతో సర్వ్ చేయండి.

English summary

Kadai Mushroom Recipe


 Vegetarians love to eat mushrooms, the spore-bearing fungi. However, there are many people who do not like the taste and appearance of mushrooms. But most of us are not aware of its health benefits. Mushrooms helps in fighting cancer and also boosts up body immune system.
Story first published: Monday, February 24, 2014, 12:24 [IST]
Desktop Bottom Promotion