For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంద- బచ్చలి కూర

By Staff
|

Kanda-Bachali
కావలసిన పదార్థాల: కంద - 350గ్రా , బచ్చలి కూర ఆకులు- 120గ్రా, పచ్చిమిరప - 6, అల్లం - 1/4 పీస్, చింతపండు - ఉసిరికాయంత సైజులో, మిరప పొడి- 1/2 టీస్పూన్, పసుపు - 1/8 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, మెంతులు - 7 గింజలు, మినుములు- 2 టీస్పూన్, ఆవాలు-3/4 టీస్పూన్, జిలకర - 3/4 టీస్పూన్, పోపుకి: ఆవాలు - 1 టీస్పూన్, వెండి మిరపకాయలు - 2.

తయారుచేసే పద్దతి:
* కందగడ్డ పై పొట్టును తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక పాత్రలో వేసి కొద్దిగా నీటిని జత చేసి స్టౌమీద పెట్టి 5 నిమిషాలు ఉడకబెట్టాలి. కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌమీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.

* వలిచి ఉంచిన బచ్చలి ఆకులను నీటితో శుభ్రం చేసి కత్తితో తరిగి ఒక పాత్రలో వేసి స్టౌ మీద ఉంచి 3 నిమిషములు ఉడికించి ఆవిరితో అలాగే మూత పెట్టి ప్రక్కన దించి పెట్టుకోవాలి.

* పచ్చిమిరప, అల్లం నీటిలో శుభ్రంచేసి మిక్సిలో వేసి గ్రైన్డ్ చేసి ఆ పేస్ట్ ను ప్రక్కన పెట్టుకోవాలి, తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని చింతపండుకు కొంచెం నీటిని జత చేసి కలిపి స్టౌవ్ మీద పెట్టి 30 నిమిషాలు వుడికించి దింపి చల్లారిన తర్వాత గ్రైన్డ్ చేసి ఆ పేస్టును పక్కన పెట్టుకోవాలి.

ఫైనల్ గా స్టౌ మీద పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా వేడి అయిన తర్వాత మొంతు, మినుములు వేసి దోరగా వేపుకోవాలి, తర్వాత ఆవాలు, జిలకర వేసి ఫ్రై చేసి, దీనికి ప్రక్కన పెట్టుకున్న పచ్చిమిరప, అల్లం పేస్టు వేసి కలియబెట్టాలి తర్వాతా చింతపండు గుజ్జు, మిరప పొడి, పసుపు పొడి, ఉడికిన కందగడ్డ, బచ్చలి వేసి అంతా ఒక్కటిగా కలిసే వరకు కలుపుతూ కొద్దిగా నీటిని జత చేస్తూ ఉప్పు వేసి చిక్కగా వచ్చేవరకూ 5 నిమిషాలు ఉడికించి, కొద్దిగా గరంమసాలను వేసి ఉడికించాలి, వెండి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో కలిపి కారం పట్టే విధంగా కొద్దిసేపు ఉడికించి తర్వాత దింపుకొని, వేడి వేడి అన్నంతో వడ్డింస్తే చాలా రుచిగా వుంటుంది. అలాగే కంద-బచ్చలి కూర మంచి కాంబినేషన్ ఇందులో క్యాల్షియం, విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా లభిస్తాయి. మరియు ఐరన్, క్లోరోఫిల్ కూడ ఇందులో ఉన్నాయి. ఇవన్ని ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మెన్ ష్ట్రులా, హృదయ సందిత జబ్బులు కలవారికి మంచి పౌష్ఠకాహారం.

Story first published:Friday, September 25, 2009, 10:51 [IST]
Desktop Bottom Promotion