For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాంగో చీజ్ కేక్ : సమ్మర్ స్పెషల్ డిజర్ట్

|

వేసవిలో మామిడిపండ్లు విరివిగా మనకు అందుబాటులో ఉంటాయి. తియ్యతియ్యగా డార్క్ ఎల్లో కలర్ లో ఉండే ఘుమఘుమలాడే మామిడిపండ్లంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అటువంటి ఈ వండర్ ఫుల్ ఫ్రూట్ తో వివిధ రకాలుగా వంటలు తయారుచేయవచ్చు. ముఖ్యంగా పిల్లలకు అత్యంత ఇష్టమైన డిజర్ట్ మ్యాంగో చీజ్ కేక్.

మ్యాంగో చీజ్ కేక్ స్పెషల్ డిజర్ట్ రిసిపి. బాగా పండిన మామిడి పండ్లతో తయారుచేస్తారు. ఈ డిజర్ట్ ను బిస్కెట్స్ తో కూడా తయారుచేస్తారు. దీనికి ఫ్లేవర్డ్ క్రీమ్ ను టాపింగ్ గా వేస్తారు. ముఖ్యంగా ఈ రిసిపి ఎటువంటి బేకింగ్ అవసరం లేకుండానే తయారుచేయవచ్చు. మరి ఈ నోరూరించే మ్యాంగో చీజ్ కేక్ ను ఒక సారి ట్రై చేయండి.

Mango -Cheese Cake- Summer Special Dessert

కావలసిన పదార్థాలు:

హెవీ క్రీమ్: 1cup
కన్ఫెక్షనరీ పంచదార: 2tbsp
మేరీ బిస్కెట్ల పొడి: 3cups
పనీర్ తురుము: 50grms
క్రీమ్ చీజ్: 150grms
పనీర్: 100grm
పాలు: 1/4cup
పంచదార పొడి: 6tsp
కరిగించిన బటర్: 4tbsp
వెనీలా ఎసెన్స్: 1tsp
మామిడిపళ్లు: 2
మామిడిపండు గుజ్జు: 1/2cup

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక పాత్రలో హెవీ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి బిస్కెట్ల పొడి ఇందులో వేసి అన్నీ కరిగిపోయేలా కలపాలి.
2. తర్వాత సర్వింగ్ బౌల్స్‌లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్‌ లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి.
3. ఆ తర్వాత పనీర్ ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
4. పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. (అవసరమనుకుంటే పాలు జత చేయాలి)
5. మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి.
6. క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్‌తో సర్దాలి. మామిడి పండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
7. చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి, అందించాలి. అంతే మామిడి పండు చీజ్ కేక్ రెడీ.

English summary

Mango -Cheese Cake- Summer Special Dessert

The best thing about summers are the mangoes. The king of fruits- mango is a favourite among all age groups. There are so many different items that can be prepared using this wonderful fruit. Since mangoes are mostly relished by the kids, here is a summer special dessert recipe which they will definitely love to eat.
Story first published: Saturday, May 31, 2014, 12:59 [IST]
Desktop Bottom Promotion