Latest Updates
-
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
మ్యాంగో పులిహోరా(మ్యాంగో రైస్): ఉగాది స్పెషల్
వేసవికాలం వచ్చిందంటే చాలు.. లేలేత మామిడికాయల వగరు.. పులుపు నోరూరిస్తాయి. మామిడికాయ తో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.ఈ కాలంలో మాత్రమే లభించే మామిడికాయతో చేసే ఎన్నో వంటకాలు భానుడితాపాన్ని సైతం భరించేలా చల్లదనానిస్తాయి.
లేత మామిడితొక్కు.. చిన్నచిన్న ముక్కల పచ్చడి, కొబ్బరితో కలిపి పచ్చడి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ చారు, మామిడి కాయ షర్భత్, పులిహార ఇలా ఎన్నో వె రైటీలకు మామిడికాయ పెట్టింది పేరు. ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని రుచికరమైన వంటకం మామిడికాయ పులిహోర. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోర ను ఎలా

తయారుచేయాలో చూద్దాం...
కావల్సి పదార్థాలు:
రైస్: 3cups( అన్నం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి)
పచ్చిమామిడికాయ తురుము: 11/2 cup(పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి)
వేరుశెనగలు: 5-6tbsp( వేగించినవి)
జీడిపప్పు :2tbsp(రోస్ట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
పోపు కోసం:
నూనె: 1 1/2tbsp
ఆవాలు: 1tbsp
శెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: tbsp
ఎండు మిర్చి: 3-4
పచ్చి మిర్చి: 6-8(మద్యలోకి కట్ చీలికగా కట్ చేసి పెట్టుకోవాలి)
తురిమిన అల్లం: 1tsp
ఇంగువ: 1/4tsp
పసుపు: 1/4 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారుచేయు విధానం :
1. ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి.
2. ఆవాలు చిటపలాడిన తరవ్ాత అందులో శెనగపప్పు, ఉద్దిబాళ్ళు, వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వెంటవెంటనే అందులో పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు మరియు ఇంగువ వేసి, కొన్ని సెకండ్లు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమామిడి తురుము వేసి మరోకొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోనే రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నంను పోపులో వేసి, ఉప్పు చిలకరించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో తెలుకొని సరిపడా వేసి మిక్స్ చేసి అడ్జెస్ట్ చేసుకోవాలి.
6. అంతే మామిడికాయ పులిహోర రెడీ. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోరతో పాటు సైడ్ గా వడియాలు, పెరుగు లేదా పచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











