Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
టేస్టీ -వెరైటీ మసాలా బెల్ పెప్పెర్

బెల్ పెప్పెర్(క్యాప్సికమ్)
(గ్రీన్, పర్పుల్, రెడ్, ఎల్లో): 4
పొటాటో (ఉర్ల గడ్డ): 1
టమోటో: 1
ఉప్పు : రుచికి సరిపడా
కారం : 2 tsp
దనియా : 2 tsp
పసుపు : 1 tsp
వేయించిన పల్లీలు(వేరుశేనగ పప్పు):1/4 cup
నిమ్మ రసం : 1 tsp
కొబ్బరి తురుము : 2 tsp
ఆవాలు : 1 tsp
జిలకర్ర : 1 tsp
కరివేపాకు: 2రెబ్బలు
ఇంగువ: చిటికెడు
ఆయిల్ : 2 tbsp
తయారు చేయు విధానము:
1. ముందుగా స్టౌ వెలిగించి పల్లీలు(వేరుశెనగ పప్పు)ను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పొటాటోను చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జిలకర్ర వేసి చిటపటలాడకా కరివేపాకు వేసి ఆ తర్వాత పొటాటో ముక్కలను అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
3. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, టమోటో ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి, ఇప్పుడు కొద్దిగా కారం, దనియాల పొడి వేసి, గరం మసాలా వేసి మరికొద్ది సేపు ప్రై చేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
4. ఇప్పుడు కొబ్బరి తురుము, పల్లీలు(వేరుశెనగ పప్పు) పొడి మెల్లిమెల్లిగా చల్లి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా చిటికెడు ఇంగువ, నిమ్మరసం జత చేసి కలియబెట్టాలి అంతే మసాలా బెల్ పెప్పర్ రెడీ.



Click it and Unblock the Notifications











