Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
కలర్ ఫుల్ మేతి ఇడ్లీ: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి
మీరు ఎప్పుడైనా మేతి ఇడ్లీనా రుచి చూశారా? లేదా విన్నారా? సౌత్ కర్ణాటకాలో ఈ మేతి ఇడ్లీ చాలా ఫేమస్ మరియు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు . ఈ ఇడ్లీ రుచికరంగా మాత్రమే కాదు, కంటికి కూడా అందంగా కనబడుతాయి. ప్లేట్ లో వేడి వేడిగా సర్వ్ చేస్తుంటే , గ్రీన్ కలర్ లో నోరూరిస్తుంటుంది.
మేతి ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ నిండి ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచి చేస్తాయి . మేతి మీశరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందివ్వడంతో మీ దినచర్యను ఆరోగ్యకరంగా ప్రారంభించవచ్చు . మీరు ఒకే రకమైన ప్లేయిన్ ఇడ్లీని తయారుచేసి, తిని బోరుకొడుతుంటే, ఒక కొత్త రకం ఇడ్లీ తినడానికి ఇదే మంచి సమయం.....

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 1cup
కొబ్బరి తురుము: 1cup
మెంతులు: 1tbsp
పెరుగు: 4tbsp
బెల్లం: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 6గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రాత్రిల్లో నానబెట్టుకొంటే మరింత మంచిది. తర్వాత రోజు పిండి మొత్తగా రుబ్బుకోవడానికి సులభం అవుతుంది.
2. మరో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పెరుగులో మెంతులను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసి బియ్యం లాగే వీటిని కూడా రాత్రంత నానబెట్టుకోవలి. కనీసం 6 గంటల సేపు నానాలి.
3. బియ్యం, మెంతులు నానిన తర్వాత మిక్సీ జార్ లో మెంతులను వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొంతి పేస్ట్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే జార్ లో బియ్యం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేస్తుండగానే అందులో కొబ్బరి తురుము వేసి, స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత అందులో బెల్లం కూడా వేయాలి.
6. మొత్తం మిశ్రమాన్ని గరిటతో బాగా మిక్స్ చేయాలి. ఇలా పిండి తయారుచేసుకొన్నాక, రుబ్బుకొన్ని పిండిని రాత్రంతా అలాగే ఉడనివ్వాలి.
7. తర్వాత రోజు ఉదయం, ఇడ్లీపిండిలో, మేంతి పేస్ట్, ఉప్ప వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ లో పిండిని పోయాలి.
8. ఇడ్లీ కుక్కర్ ను స్టౌ మీద పెట్టి మీడియం మంట మీద, ఆవిరి మీద ఇడ్లీలను 10నిముషాలు ఉడికించుకోవాలి . స్టీమర్ నుండి ఆవిరి ఒత్తిడి భయటకు వచ్చినప్పుడు, ఇడ్లీ కుక్కర్ మూత తీసి, స్పూన్ సహాయంతో ఇడ్లీలను సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. అంతే తినడానికి మేతి ఇడ్లీ రెడీ.ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా గార్లిక్ చట్నీతో సర్వ్ చేయాలి .



Click it and Unblock the Notifications











