Latest Updates
-
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా?
హెల్తీ అండ్ టేస్టీ మేతి టమోటో రైస్ బాత్ రిసిపి
ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. కానీ, ఇండియన్ మహిళల్లో 50శాతం మంది రక్తహీనత(అనీమియా)తో బాధపడుతున్నారు. రక్త హీనత ఐరన్ లోపం వల్లే ఈ సమస్య ఉంటుంది. అందువల్ల, ఈ సమస్యతో బాధపడేవారికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా హెల్తీ ఫుడ్స్ రెడ్ మీట్, గ్రీన్ వెజిటేబుల్స్, లెగ్యుమ్స్ మరియు హెర్బ్స్ వంటి వాటి ఎక్కువ, కాబట్టి వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి.
మెంతి ఆకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మెంతులను మరియు మెంతి ఆకులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఔషధగుణాల వల్ల రక్త హీనత సమస్యను నివారించుకోవచ్చు.ఎవరైతే హీమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారో, వారికి మెంతులు మరియు ఆకుకూరగను రెగ్యులర్ డైట్ లో ఏదోఒకవిధంగా చేర్చుకోవాలి. మెంతి ఆకును వివిధ రకాల ఉపయోగిస్తుంటారు. వంటల్లో ఒకటి న్యూట్రీషియన్ ఫుడ్ టమోటో మేతి పులావ్ ఒకటి. అంతే కాదు, బ్రౌన్ రైస్, టమోటో, మెంతిఆకు కాంబినేషన్ షుగర్ పేషంట్స్ కు కూడా చాలా మంచిది. మరి ఈ వంటను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 3 (chopped)
మేతి(మెంతి ఆకులు): 3 cups (chopped)
అన్నం: 3 cups (cooked)
ఉల్లిపాయ పేస్ట్: 1/4 cup
వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 2 (slit)
పసుపు: 1tsp
కారం: 1tsp
జీలకర్ర: 1tsp
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
ఆవాలు: 1tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె: 2tbsp
తయారుచేయు విధానం: 1.
ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
2. పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో టమోటోలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేస్తూ మీడియం మంట మీద మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో మెంతిఆకు కూడా వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. మెంతి ఆకు మెత్తగా ఉడికే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి నిధానంగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం కలగలిసేలా ఉండి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.
7. అంతే హెల్తీ అండ్ టేస్టీ ఐరన్ రిచ్, మేతి, టమోటో రైస్ బాత్ రిసిపి రెడీ. ఈ హెల్తీ మీల్ ను పెరుగు మరియు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications











