Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
మునగాకు కందిపప్పు చారు
Veg
oi-Saraswathi N
By Sindhu

మునగాకు : 1cup
కందిపప్పు : 1/2cup
చింతపండు : కొద్దిగా
పచ్చిమిర్చి : 8 (పొడవుగా కట్ చేయాలి)
ధనియాలు : 1tsp
నూనె : తగినంత
మిరియాలు : 6గింజలు
జీలకర్ర : టీ స్పూను
వెల్లుల్లిరేకలు : 10
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
పసుపు : తగినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, మునగాకు వేసి కుకర్లో పెట్టి మెత్తగా ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. స్టౌ మీద ఒక మందపాటి గిన్నెను ఉంచి అందులో చింతపండురసం, ఉప్పు, పసుపు, కందిపప్పు మునగాకు మిశ్రమం వేసి బాగా మరిగించాలి.
3. తర్వాతఒక బాణలిలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత అందులోనే మరికాస్త నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి కొద్దిగా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి.
4. చల్లారిన తరవాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాక, అందులోనే వెల్లుల్లి వేసి మరోమారు తిప్పి తీసేయాలి. చివరగా మరుగుతున్న చారులో ఈ పొడి, తాలింపు వేసి ఒక్క పొంగు రానిచ్చి దింపేయాలి. అంతే మునగాకు పప్పుచారు రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: munagaku kandipappu green chilli garlic onion oil salt మునగాకు కందిపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ఉప్పు నూనె
English summary
Munagaku Pappu | మునగాకు కందిపప్పు చారు
Story first published: Saturday, July 23, 2011, 15:36 [IST]
Other articles published on Jul 23, 2011



Click it and Unblock the Notifications











