Latest Updates
-
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
నవరత్న కుర్మా

ఆలు గడ్డ: 1
క్యారెట్ - 1
ఉల్లిపాయ - 1
టమోట - 1
పసుపు - 1/4 tsp
దనియాల పొడి - 2 tsp
కారం - 2 tsp
కొత్తిమిర - కొద్దిగా
కాలిఫ్లవర్ తురుము - 1cup
పచ్చి బటానీలు - 1cup(ఉడికించినవి)
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
మసాలా కొరకు కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బెలు - 5
అల్లం - 1 పీస్
పచ్చిమిర్చి - 2
కొబ్బరి తురుము - 1 cup
జీడిపప్పు - 6
మిరియాలు - 1/2 tsp
యాలకులు - 2
లవంగాలు - 2
చెక్క - 1 పీస్
జిలకర్ర - 1/4 tsp
తయారు చేయు విధానము:
1. మొదట అన్న కూరగాయలను కట్ చేసి శుభ్రంచేసి ఉడికించి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు అందులో దోరగా వేసి వేగనివ్వాలి.
3. తర్వాత కట్ చేసిన టమోట, మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి.
4. ఇప్పుడు కారం, దనియా, పసుపు, ఉప్పు, ఉడికించిన కూరగాయలు, బఠానీలు, కొత్తిమిర వేసి 10 నిమిషాలు తక్కువ మంట మీద బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి తురుము, మిరియాలు, చెక్క, జిలకర్ర వేసి చిక్కబడే వరకు ఉడకనివ్వాలి.
5. ఫైనల్ గా మరో పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు, పన్నీర్ ముక్కలు, యాలకలు వేసి డీస్ ప్రై చేసి ఉడుకుతున్న కుర్మాలో వేసి కలియబెట్టాలి అంతే వేడి వేడి నవరత్నా కుర్మా రెడీ



Click it and Unblock the Notifications











