Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
స్పైసీ ఆనియన్ చట్నీ: దోస, ఇడ్లీ స్పెషల్
చట్నీ అంటే ఆంధ్రులకు చాలా ఇష్టం. భోజనంలో ఎన్ని కూరలున్నా, రసం, సాంబార్, తాలింపు ఇలా ఎన్ని ఉన్న పక్కన పచ్చడి లేకపోతే, మింగమెతుకు దిగదు అంటుంటారు. ఎందుకంటే చట్నీని సైడ్ డిష్ గా కూడా తీసుకుంటారు చాలా మంది. అటువంటి సైడ్ డిష్ లలో ఉల్లిపాయ చట్నీ ఒకటి. ఇది సైడ్ డిష్ గానే కాదు, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం చేసుకొనే దోస, ఇడ్లీకి మెయిన్ డిష్ గా కూడా చాలా రుచికరంగా ఉంటుంది.
ఈ స్పైసీ ఆనియన్ చట్నీ తయారుచేయడం చాలా సులభం. మరియు చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేసుకోవచ్చు . ఈ చట్నీకి ఉపయోగించే పదార్థాలన్నీ కూడా మన వంటగదిలో ఎప్పుడూ నిల్వఉండేవే. కాబట్టి, మీకు రోజూ తయారుచేసుకొనే సాంబార్, కూరలతో బోరుకొట్టినప్పుడు, ఇటువంటి చట్నీలను కూడా ప్రయత్నించి రైస్ తో తినవచ్చు.

మరి ఈ స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Serves: 4-5
preparation time: 10 minutes
Cooking time: 10 minutes

కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు: సన్నగా తరిగి పెట్టుకోవాలి
ఎండుమిర్చి: 7-8
శెనపప్పు: 1tbsp
చింతపండు గుజ్జు: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
బెల్లం: 1tbsp
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే రోస్ట్ చేసిన శెనపప్పు, ఉప్పు, చింతపండు మరియు బెల్లం వేసి మూడు నాలుగు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. బెల్లం కరిగే వరకూ ఫ్రై చేసుకోవాలి.

4. మొత్తం వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి.
5. చల్లారిన మిశ్రామన్ని మిక్సీలోవ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జోడించుకోవచ్చు. అంతే ఆనియన్ చట్నీ రెడీ. దీన్ని దోస మరియు ఇడ్లీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. దోసె మరియు ఇడ్లీకి ఇది ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్ .

న్యూట్రీషియన్ వ్యాల్యూ: ఉల్లిపాయ చట్నీలో చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. ఉల్లిపాయలో విటమిన్ సి కలిగిన ఒక న్యూట్రీషియన్ వెజిటేబుల్. మరియు ఇందులో ఉండే క్రోమియం రక్తంలో షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.




Click it and Unblock the Notifications











