For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టఫ్డ్ టమోటో - మలై గ్రేవీ: అద్భుతమైన టేస్ట్

|

రెగ్యులర్ గా వండే వంటలతో చాలా బోర్ కొడుతోందా? మరి మీరు ఏదైనా కొత్తగా చేయాలకుంటున్నారా?ఈ టమోటోలను పనీర్, పొటాటో మరియు డ్రై ఫ్రూట్స్ తో స్టఫ్ చేసి తయారుచేసి క్రీమీ గ్రెవీ చాలా అద్భుతమైన రుచి ఉంటుంది.

స్టఫ్డ్ టమోటో మలై గ్రేవీ ఒక అద్భుతమైన రుచిగల వెజిటేరియన్ రిసిపి. ఇది మీకు ఒక ఫర్ ఫెక్ట్ ఎంపిక. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారంటే ఇటువంటి స్పెషల్ వంటలను తాయరుచేయండి. వారి ప్రశంసలు పొందండి. మరి ఈ అద్భుతమైన రుచి గల వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

టమోటోలు : 6(టమోటోలు ఫ్లాట్ గా మరియు వెడల్పుగా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి)

నూనె: 1tsp

ఉప్పు: 1/2tsp

ఫిల్లింగ్ కోసం :

బంగాళదుంపలు: 1/2 (ఉడికించి, పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి)

పన్నీర్: 1cup(తురుము కోవాలి)

చీజ్ : 2 tbsp

ఉప్పు: రుచికి సరిపడా

ఎండు ద్రాక్ష: 8-10

జీడిపప్పు: 4-5(మద్యకు పగులగొట్టాలి)

కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

పచ్చిమిర్చి: 1(మద్యకు కట్ చేయాలి)

గరం మసాలా: 1/2tsp

గ్రేవీ కోసం కావల్సిన పదార్థాలు:

గ్రేవీ కోసం కావల్సిన పదార్థాలు:

నెయ్యి: 2tbsp

నూనె: 2tbsp

నల్ల మిరియాలు: 4-5

లవంగాలు: 4

బ్లాక్ యాలకులు: 2

చెక్క: చిన్న ముక్క

బిర్యానీ ఆకు: 1

ఉల్లిపాయ: 2cups(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp

గ్రేవీ కోసం కావల్సిన పదార్థాలు:

గ్రేవీ కోసం కావల్సిన పదార్థాలు:

పచ్చిమిర్చి: 2-3(మద్యకు కట్ చేసుకోవాలి)

ధనియాల పొడి: 2tsp

కారం: 1/2tsp

పసుపు: 1/2tsp

గరం మసాలా : 1/2tsp

పెప్పర్ పౌడర్: 1/2tsp

ఉప్పు: రుచికి సరిపడా

కోవా: 4tbsp

నిమ్మరసం: 2tsp

తేనె: 1tsp

తాజా క్రీమ్: 3tbsp

తయారు చేయు విధానం:

తయారు చేయు విధానం:

1. ఫిల్లింగ్ కోసం : ముందుగా ఫిల్లింగ్ కోసం సిద్దం చేసుకొన్న మసాలాలన్నీ ఒక బౌల్లో వేసి, బాగా మిక్స్ చేయాలి.

2. టమోటో కోసం : టమోటాలను పైభాగం కట్ చేసి, లోపల ఉన్న గుజ్జును తొలగించాలి. ఈ గుజ్జును బ్లెండర్ లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

3. తర్వాత ఓవెన్ ను 180డిగ్రీలో ప్రీహీట్ చేయాలి.

4. అంతలోపు, ఒక గిన్నెలో నూనె ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, టమోటోలు కట్ చేసి గుజ్జు తీసేసి పక్కన పెట్టుకొన్న టమోటోలకు లోపలి వైపున ఈ నూనె, ఉప్పు మిశ్రమాన్ని అప్లై చేయాలి.

5. ఇప్పుడు ముందుగా తయారుచేసుకొన్న ఫిల్లింగ్ మిశ్రమాన్ని టమోటోలలో నింపి, ఓవెన్ లో పెట్టి, 10-12నిముషాల పాటు బేక్ చేసుకోవాలి.

6. పన్నెండు నిముషాల తర్వాత ఓవెన్ నుండి టమోటోలను బయటకు తీసి గ్రేవితో సర్వ్ చేయాలి.

7. గ్రేవీ తయారుచేయడం: పాన్ లో నెయ్యి వేసి మరియు నూనె వేసి వేడి చేయాలి.

తయారు చేయు విధానం:

తయారు చేయు విధానం:

8. నూనె వేడయ్యాక అందులో బ్లాక్ పెప్పర్ కార్న్, లవంగాలు, బ్లాక్ యాలాకులు, చెక్క మరియు బిర్యాని ఆకు వేసి 15సెకండ్లు ఫ్రై చేసుకోవాలి.

9. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 3-4నిముషాలు వేగించుకోవాలి . అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ బచ్చే వరకూ వేగించుకోవాలి.

10. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొన్న టమోటో గుజ్జును మరియు పచ్చిమిర్చికూడా వేసి ఒక నిముషం పాటు వేగించుకోవాలి.

11. తర్వాత అందులోనే ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా పొడి, వైట్ పెప్పర్, మరియు ఉప్పు కూడా వేసి 3నిముషాలు వేగించుకోవాలి.

12. తర్వాత అందులోనే కోవా కూడా వేసి ఫ్రై చేయాలి . వెంటనే నిమ్మరసం, తేనె మరియు 12కప్పులు నీల్ళు పోసి ఒక నిముషం ఉడికించుకోవాలి.

13. అందులోనే తాజా క్రీమ్ కూడా వేసి మరో నిముషం ఉడికించుకోవాలి. ఈ మసాలా మిశ్రమం అంతా పూర్తిగా ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోని మార్చుకోవాలి. 14. ఓవెన్ లో ముందుగా ఉడికించి పెట్టుకొన్న స్టఫ్డ్ టమోటోలను గ్రేవీ మీద పెట్టి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా పరోటాలతో లేదా నాన్ తో సర్వ్ చేయాలి.

English summary

Stuffed Tomatoes in Malai Gravy

Got bored of the regular gravies and looking for something different to make? These tomatoes stuffed with paneer, potatoes and dry fruits in a creamy gravy are a very good option. I made these for a few guests who were visiting us and everyone just loved it.
Story first published: Wednesday, November 6, 2013, 12:45 [IST]
Desktop Bottom Promotion