Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
నోరూరించే పచ్చిమామిడికాయ పచ్చడి
ఆవకాయ రుచెరుగని ఆంధ్రుడుంటాడా ? తెలుగింటి పచ్చళ్లలో ఆవకాయది ప్రత్యేక స్థానం. వేసవికాలం వచ్చిందంటే మిరపకాయలు కొనడం, దానిని కారం పట్టించడం, ఆవపిండి తయారు చేసుకోవడం ఆ తరువాత మామిడికాయల కోసం ఎదురు చూస్తుండడం కనిపిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే చాలు.. లేలేత మామిడికాయల వగరు.. పులుపు నోరూరిస్తాయి. మామిడికాయ తో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.ఈ కాలంలో మాత్రమే లభించే మామిడికాయతో చేసే ఎన్నో వంటకాలు భానుడితాపాన్ని సైతం భరించేలా చల్లదనానిస్తాయి.. లేత మామిడితొక్కు.. చిన్నచిన్న ముక్కల పచ్చడి, కొబ్బరితో కలిపి పచ్చడి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ చారు, మామిడి కాయ షర్భత్, పులిహార ఇలా ఎన్నో వెరైటీలకు మామిడికాయ పెట్టింది పేరు.. మరి మార్కెట్‌లో లభించే మామిడికాయలతో నోరూరించే వంట మామిడికాయపచ్చడితో సమ్మర్ స్పెష్ల స్టార్ట్ చేద్దామా...

మామిడి కాయలు : 3
ఎండు మిరపకాయలు: 15
పచ్చి మిరపకాయలు: 5
మినపప్పు : 1tbsp
మెంతులు : 1tsp
ఆవాలు : 1/2tsp
ఇంగువ : 1tsp
పసుపు : చిటికెడు
ఉప్పు : 2tsp
నూనె : 2tsp
తయారు చేసే విధానం :
1. ముందుగా మామిడి కాయలను బాగా కడిగి పెచ్చు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
2. తరవాత ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని అందులో నూనే వేసి పైన చెప్పిన మినపప్పు,ఆవాలు,మెంతులు,ఇంగువ,పసుపు,ఎండు మిరపకాయలు, వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి.
3. పోపు చల్లారిన తరువాత ఒక స్పూన్ పోపుని తీసి పక్కన పెట్టుకుని ఈ పోపు నంతా గ్రైండర్ లో వేసి పచ్చి మిరపకాయలు, ఉప్పు, మామిడి ముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.
4. అవసరమైతే కొద్దిగా నీరు పోసి రుబ్బుకోవచ్చు. తరవాత పక్కన పెట్టిన పోపుని పచ్చడిలో కలపాలి. అంతే ఘుమ ఘుమ లాడే రుచికరమైన మామిడి కాయ పచ్చడి రెడీ. ఇంక మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడమే.



Click it and Unblock the Notifications











