For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ పొరియల్

|

క్యారెట్ పొరియల్ రిసిపి, సౌత్ ఇండియన్ స్పెషల్ సైడ్ డిష్. కర్ణాటకాలో క్యారెట్ పొరియల్ అని పిలిచే ఈ డిష్. ఇది చాలా సింపుల్ మరియు హెల్తీ కర్రీ. ఈ పొరియల్ రిసిపిలో క్యారెట్ ఒక ముఖ్య ఆహార పదార్థం. ఇది ఒక సులభమైన హెల్తీ ఇండియన్ రిసిపి. మన ఇండియాలో ఇలాంటి పొరియల్ డిష్ ను మన ఇండియాలో 4 స్టేట్స్ (ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు తెలంగాణ) లోతయారుచేస్తారు.

క్యారెట్స్ లో పుష్కలంగా న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ ఎ, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందులో నేచురల్ షుగర్స్ ఉంటుంది. ఇది డయాబెటిక్ కు చాలా మంచిది. క్యారెట్ పొరియల్ రిసిపి ఎక్కువ న్యూట్రీషియ ఫుడ్. కందిపప్పు, ఉద్దిపప్పు, కొబ్బరి తురుము వేయడం వల్ల మరింత టేస్టీ మరింత హెల్తీ. ఈ దాల్స్ అన్నీ చేర్చడం వల్ల ప్రోటీన్స్ కూడా ఎక్కువే. మరియు వెజిటేరియన్ ఫుడ్ కావడంతో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వంట.మన శరీరానికి అవసరం అయ్యే అన్ని న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది . మరి ఈ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Tasty Carrot Poriyal Recipe
Tasty Carrot Poriyal Recipe
Tasty Carrot Poriyal Recipe

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 1 tablespoon
క్యారెట్ : 3-4 pieces
ఆవాలు: 1/2 tsp
ఉల్లిపాయలు: 1/2 (finely chopped/ grated)
ఉద్దిపప్పు: 1/2 teaspoon
ఇంగువ: 1 pinch
ఎండుమిర్చి: 2 pieces
కరివేపాకు: రెండు రెమ్మలు
పసుపు: ½ teaspoon
కొబ్బరి తురుము: 4 tablespoons
పచ్చిమిర్చి: 2సన్నగా తరిగినవి
జీలకర్ర: 1/2 teaspoon
నెయ్యి లేదా నూనె 1 teaspoon
ఉప్పు రుచికి సరిపడా

Tasty Carrot Poriyal Recipe
Tasty Carrot Poriyal Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా క్యారెట్ కి పైపొట్టు తీసి, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు, పెసరపప్పును నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. నీటిలో మెత్తగా నానిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, మరియు ఉద్దిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులోఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
5. నీళ్ళల్లోనానబెట్టుకొన్న పెసరపప్పు, పసుపు, సన్నగాతరిగిన క్యారెట్ ముక్కలు వేసి మరో 2,3 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో అరకప్పు నీళ్ళు మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి.

Tasty Carrot Poriyal Recipe

7.క్యారెట్ మెత్తబడే వరకూ తక్కువ మంటమీద , మూత పెట్టి ఉడికించుకోవాలి.
8. అవసరం అయితే కొద్దిగా నీరు చిలకరించుకోవాలి మద్యమద్యలో కలియబెడుతుండాలి.
9. తర్వాత కొబ్బరితురుముతో గార్నిష్ చేయాలి.
10. అంతే క్యారెట్ పొరియల్ రెడీ టు సర్వ్ . ఈ టేస్టీ అండ్ హెల్తీ పొరియల్ ను చపాతీ లేదా పుల్కాలతో సర్వ్చేయాలి
11. మీకుమరింతే టేస్టీగా వెరైటీగా ఉండాలంటే,ఇతర వెజిటేబుల్స్ (బ్రొకోలీ, క్యాబేజ్, బీన్స్, బ్రజెల్స్ )కూడా జోడించుకోవచ్చు.

English summary

Tasty Carrot Poriyal Recipe

Carrot poriyal recipe is a south Indian cuisine. It is also known as carrot palya recipe in Karnataka. It is a simple and healthy curry. Carrot is the main ingredient in this recipe. It's one of the easiest Indian recipes mostly prepared in five southern states of India: Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu and Telangana.
Story first published: Saturday, January 10, 2015, 14:33 [IST]
Desktop Bottom Promotion