Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
దాల్ పరోఠా-అద్భుతమైన రుచి
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా కనుగొంటారు?చాలా మంది పండ్లు, కూరగాయలతో తయారు చేసే బ్రేక్ ఫాస్ట్ లను మాత్రమే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అనుకొంటారు. అయితే మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో సరైన వస్తువులను, ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలను అంధించే మసాలాలను వంటల్లో ఉపయోగిస్తున్నామా?లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి రోజూ ఉదయం మనం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ తోనే శరీరానికి తగినన్ని న్యూట్రీషియన్స్ అందుతాయి. దాంతో మనకు కావల్సిన శక్తిని అంధించి మనల్ని యాక్టివ్ గా పనిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
దాల్ పరోటా రిసిపి నార్త్ ఇండియన్ వెజిటేరియన్ రిసిపి, దీన్ని ముఖ్యంగా గుజరాతీయులు ఎక్కువగా వండుతుంటారు. ఈ పరోటాకు గోధుమ పిండితోపాటు, వివిధ రాకాల మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. అతి సులభంగా తయారు చేసే బ్రేక్ ఫాస్ట్ రిసిపీలలో దాల్ పరోటా చాలా ప్రసిద్ది . మరి ఈ హెల్తీ దాల్ పరోటా ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 500grms
అజ్వైన్ లేదా కారమ్ సీడ్స్: ½ tsp
పెసరపప్పు: 100 gms
జీలకర్ర: 1tsp
సోంపు: ½ tsp
ఎండు మిర్చి: 1tsp
గరం మసాలా: ½ tsp
కొత్తిమీర: 4 (chopped)
ధనియాల పొడి: ½ tsp
నెయ్యి: 150 gms
నూనె: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పెసరపప్పు ఒక గిన్నెలో వేసి, నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సీలో గోధుమ పిండి, ఉప్పు, నానబెట్టుకొన్న పెసరపప్పు, ఎండుమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, అజ్వైన్, సోంపు, నూనె మరియు కొత్తిమీర తరుగు అన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
3. ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు కలుపుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని, పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి చేతిలోనికి తీసుకొని ఉండచేసి, చపాతీలా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకొన్న తర్వాత ఫ్రైయింగ్ పాన్ మీద వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ కాల్చుకోవాలి. ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మీకు ఇష్టమైన కర్రీ లేదా పన్నీర్ బట్టర్ మసాలాతో వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











