Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
ఇడ్లీ - జీడిపప్పు ఉప్మా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్
ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోస, ఉప్మా కామన్. ప్రతి రోజూ ఇవేనా అని పిల్లలు మారాం చేస్తుంటారు. రోజూ చేసేవే అయినా, కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలను ఒక్కోసారి వేస్ట్ అవుతుంటాయి. అలాకాకుండా కొంచెం వెరైటీగా ఉప్మా చేసి పెడితే అందరూ తింటారు...

కావలసిన పదార్థా
ఇడ్లీలు: 4 - 6
జీడిపప్పులు: 10-15
పచ్చిబఠాణీ: 1/2cup
క్యారట్ తురుము: 1/2cup
నిమ్మరసం: 1tps
పెద్ద ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి),
పచ్చిమిర్చి: 2-4(నిలువుగా కట్ చేసుకోవాలి)
తాలింపు గింజలు(ఆవాలు, శెనపప్పు, ఉద్దిపప్పు): 1tbsp
నూనె: సరిపడా
పసుపు: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీరతరుగు: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి.
3. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను జత చేయాలి. అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి. ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి. అంతే జీడిపప్పు ఇడ్లీ ఉప్మా రెడీ.



Click it and Unblock the Notifications











