Latest Updates
-
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
టమోటో- క్యారెట్ చట్నీ
సాధారణంగా టమోటోలతో ఏ వంట చేసినా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎక్కువగ టమోటో చట్నీ, టమోటో గుజ్జు, టమోటో బాత్, టమోటో పులవ్, టమోటో పికెల్ ఇలా చాలా వెరైటీలను చేస్తుంటారు. ఏవంటైనా సరే చూడగానే నోరూరించాల్సిందే. అంత మధురమైన టేస్ట్ ఉంటుంది.
అయితే మరింత ఆరోగ్యంగా మరింత డిఫరెంట్ టేస్ట్ గా ఉండాలంటే, అందులో క్యారెట్ జోడించవచ్చు. క్యారెట్ తో తయారుచేస్తే కలర్ ఫుల్ క్యారెట్ టమోటో చట్నీ రెడీ. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం మరియు చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు.

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 4-5
క్యారెట్: 1-2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 6-8
చింతపండు: కొద్దిగా(నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి)
జీలకర్ర: 1tsp
వెల్లుల్లిపాయలు: 4-6
కొత్తిమీర తరుగు: కొద్దిగా(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో టమోటో, పచ్చిమిర్చి వేగి వేగించుకోవాలి.
2. టమోటో పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, చింత పండు వేసి ఒకటి రెండు నిముషాలు వేగించుకోవాలి.
3. మొత్తం మిశ్రమం ఒక 5నిముషాలు వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి.
4. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత ఈ టమోటో చట్నీని ఒక బౌల్లో వేసి సన్నగా చిన్నగా తరిగి పెట్టుకొన్న క్యారెట్ ముక్కలను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
5. చివరగా కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే టమోటో క్యారెట్ చట్నీ రెడీ..



Click it and Unblock the Notifications











