For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో పప్పు: ఆంధ్ర స్టైల్ దాల్ రిసిపి

|

టమోటో పప్పు లేదా దాల్ అని నార్త్ స్టేట్స్ లో విరివిగా పిలుస్తారు. ఆంధ్రకుషన్స్ లో చాలా ఫేమస్ అయినటువంటి వంట. ముఖ్యంగా వేజిటేరియన్ స్పెషల్. వెజిటేరియన్ భోజన ప్రియుల ప్రతి రోజూ వారి భోజనంలో పప్పులేనిది ముద్దదిగదు. ఇది రుచికరమైన ఒక నార్మల్ దాల్ రిసిపి. ముఖ్యంగా ఇది స్పెషల్ సౌత్ ఇండియన్ దాల్ రిసిపి

టమోటో పప్పు అనేది, ఇతర దాల్ రిసిలకు రిలేటెడ్ గానే ఉంటుంది. అయితే టమోటో పప్పు యొక్క టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ టమోటో పప్పును తయారుచేయడం చాలా సులభం. అంతే కాదు, చాలా తక్కువ సమయంలో దీన్ని తయారుచేవచ్చు. దాల్ రిసిపిని రెండు రకాలుగా తయారుచేయవచ్చు. కుక్కర్ లో అన్ని పదార్థాలను వేసి ఒకే సారి ఉడికించుకోవచ్చు. లేదా ఇలా దాల్ మాత్రమే ఉడికించి మిగిలిన పదార్థాలన్నింటితో ఫ్రై చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ ఆంధ్ర స్టైల్ టమోటో పప్పును రుచిచూడాలి ఉందా...

Tomato Pappu: Andhra Style Dal Recipe

కావలసిన దినుసులు:
కంది పప్పు: 1cup
టమాటాలు: 3
ఉల్లిపాయ: 1(పెద్దది సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 3-4
పచ్చి మిరపకాయలు: 2
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు : చిటికెడు
కారం: 1tsp
చింత పండు: చిన్న ఉసిరి కాయంత
పోపుకు కావలసిన దినుసులు:
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ: చిటికెడు
మెంతు పొడి: చిటికెడు
కరేపాకు: 2 రెబ్బలు
నెయ్యి: 2tsp
ఎండు మిర్చి: 2

తయారుచేయు పధ్ధతి:
1. ముందుగ, చింత పండు ఐదు నిముషాలు నీళ్ళలో వేసి నాన పెట్టాలి.
2. తర్వాత కంది పప్పును కడిగి ప్రెషర్ కుక్కర్ లో 4-5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
3. తరువాత ఒక పాన్ లో రెండు స్పూన్ల నూనె వేసి అది వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
4. వేగిన తరవాత, పచ్చిమిరపాకాయలు, టొమోటో ముక్కలు వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఐదు నిమషాలు తర్వాత, కలపాలి. టమాట ముక్కలు మెత్తగ ఉడకనివ్వాలి.
5. ఇప్పుడు కుక్కర్ చల్లారిన పప్పు తీసి కవ్వం గుత్తితో బాగ మెదిపి, ఉడుకుతున్న టమోటోలో వేసి కలుపుకోవాలి.
6. తర్వాత నాన బెట్టన చింతపండును పిండి పులుసు తీసి పప్పులో కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ కారం వేసుకొని రుచి చూసి సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. పప్పు చిక్కగా అయిన తరవాత దించి ప్రక్కన పెట్టుకొని.
7. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని స్టౌమీద పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి అది కాగిన తర్వత అందులో చిటికెడు ఇంగువ, చిటికెడు మెంతు పొడి ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి అవి చిటపట లాడిన తరవాత అందులొ టమాట పప్పు వేసి బాగ కలుపుకోవాలి. అంతే! రుచి కరమైన టమాట పప్పు రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది.

English summary

Tomato Pappu: Andhra Style Dal Recipe


 The Tomato Pappu or dal as it is called in the North, is the most basic requirement of vegetarian Andhra cuisine. This dal recipe forms the soul of a meal and is cherished deeply as a symbol of vegetarian Andhra recipes. It is in some sense a normal tomato dal. It is the special South Indian style of cooking that makes it a special dal recipe.
Story first published: Monday, March 10, 2014, 12:14 [IST]
Desktop Bottom Promotion