Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాతకాలం నాటి పచ్చడి..ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు..ఎలా చేసుకోవాలంటే
రోజూ అవే కర్రీలు, అవే పచ్చళ్లు తిని తిని బోర్ కొట్టేస్తుంటది కొందరికి. ఏం తిన్నా నాలుకకు సహించదు ఆ సమయంలో. నాలుకకి కొత్తగా ఏదైనా రుచి చూస్తే గానీ మళ్లీ ప్రాణం లేసి రాదా? అయితే ఓ సారి ఎండుమిరపకాయలు,ఉల్లిపాయలతో చేసే పచ్చడి రుచి చూడాల్సిందే. ఎలాంటి కూరగాయలు అవసరం లేకుండా ఇంట్లోనే క్షణాల్లో రెడీ చేసుకునే ఈ పచ్చడిని ఒక్కసారి రుచిచూస్తే జన్మలో మర్చిపోరు. వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకొని తింటే నెక్ట్ లెవల్లో ఉంటుంది.
ఎండుమిరపకాయలు,ఉల్లిపాయ పచ్చడిని తయారుచేయడం కూడా చాలా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా క్షణాల్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-ఉల్లిపాయ
-ఆయిల్
-కరివేపాకు
-చింతపండు
-ఉప్పు
ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే లంచ్ లోకి ఇలా చేసేయండి..అమృతం అంటూ కంచం నాకేస్తారు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 10-12 ఎండుమిర్చి వేసి మీడియం మంట మీద కలపుకుంటూ 2 నిమిషాలు వేయించి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలోని నూనెలోనే 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, నిమ్మసైజు అంత చింతపండు, 10 కరివేపాకులు వేసి మీడియం మంట మీద 2 నిమిషాలు వేయించాలి. కరివేపాకు ఆకులు తక్కువనే వేయాలి.
-ఉల్లిపాయలు దోరగా వేగాక వాటిని తీసి పక్కనపెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఎండుమిర్చి, ఉల్లిపాయలను పూర్తిగా చల్లారనివ్వాలి
-తర్వాత వేయించిన ఎండుమిర్చి,ఉల్లిపాయ చింతపండు కరివేపాకు ఆకులని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే రుచికి సరిపడా కళ్లు ఉప్పు వేసి కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
-పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడా కనబడుతూ ఉండాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయనక్కర్లేదు. అంతే ఎండుమిర్చి ఉల్లిపాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో దీన్ని నెయ్యితో కలుపుకొని తింటూంటూ ఆ మజానే వేరు. దీన్ని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని ఎగబడటం గ్యారెంటీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications