For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాంపత్య బంధాన్నిబలపడేలా చేసేది ప్రేమ.? స్నేహం.? నమ్మకం.? శృంగారం.?

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది ఏది? నమ్మకం, ప్రేమ, స్నేహం.. ఇవన్నీ. కానీ వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప

|

Seven Tips For Beautiful Family Life...
భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది ఏది? నమ్మకం, ప్రేమ, స్నేహం.. ఇవన్నీ. కానీ వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్త పడాలి. అందుకు తీసుకోవాల్సిన కొన్ని చిట్కాలు మీకోసం....

1. ఎన్ని పనులున్నప్పటికీ కనీసం రోజుకు ఆరు గంటల నుండి 8 గంటల సేపు హాయిగా నిద్రపోవాలి.
2. సన్నిహిత మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడంతో ఒంటరితనం పెరిగుతోంది. అందుకే వారానికి ఓ సారైనా పార్కులకు, రెస్టారెరెంట్ లకు వెళ్ళి మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. మానసిక భయాలకు ధూరంగా ఉండాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి.
3. భార్యా భర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలి. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయమవుతుంది.
4. ఇంటికి.. ఆఫీసుకు దూరం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ప్రయాణంలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఇంటికి వచ్చేసరికి అలసిపోయి శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది.
5. ప్రస్తుతం మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రూట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు, ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది.
6. శృంగారంలో ఆసక్తిని పెంచడంలో ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహరం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినప సున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయని నమ్మేవారు.
7. రోజుకు ఒక గంట లేదా అరగంట సేపు వ్యాయమం తప్పనిసరిగా చేయాలి. వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివి. ఏ వ్యాయామాన్నైనా మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలి. యోగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ చిన్న చిన్న చిట్కాలతో మీ దాంపత్య జీవతాన్ని బలపరచుకోండి..

English summary

Seven Tips For Beautiful Family Life... | భార్య-భర్తల మధ్య ఆత్మీయ బంధం బలపడాలంటే...?

Most of the people who don't love or admire themselves will not have self-esteem. So, trying to understand how to improve self-esteem can take you a long way ahead. If you are complaining always about a lonely life and unhappy feelings, know that you are the only reason for that. Happiness will never come to you unless you are ready to chase it!
Desktop Bottom Promotion