For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందా... ఎందుకలా...?

సాధారణంగా కొత్తగా పెళ్లైన ప్రతి జంటా ఒకటి... రెండు సంవత్సరాలు అన్నోన్యంగా కలిసి మెలసి ఉంటారు. తర్వాత తర్వాత ఇద్దర మధ్య మెళ్లి మెళ్లిగా అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. దాంతో ఇద్దరి మద్య సఖ్యత కరవౌతుం

|

Tips for Better Relationship Between Husband & Wife
సాధారణంగా కొత్తగా పెళ్లైన ప్రతి జంటా ఒకటి... రెండు సంవత్సరాలు అన్నోన్యంగా కలిసి మెలసి ఉంటారు. తర్వాత తర్వాత ఇద్దర మధ్య మెళ్లి మెళ్లిగా అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. దాంతో ఇద్దరి మద్య సఖ్యత కరవౌతుంది. ఏ విషయంలోనైనా మీరు మీ భార్య నమ్మకాన్ని కోల్పోతే మీ దాంపత్యంలో దూరం పెరుగుతూ పోతుంది. ఆమె ఎందుకలా అనుకుంటుందో భర్త తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

భార్యకు ప్రేమను పంచి, ఆమె కోసం సమయం కేటాయించి ఆమెకు దగ్గరవ్వాలి. ఆమె ఆలోచనలను సరైన దిశలో ఉండేలా ప్రయత్నించాలి. నమ్మకంగా ఉండాలి. భార్య మీపై అనుమాన పడకుండా, నమ్మకం కలిగించేలా ప్రయత్నించాలి. ఆమె నమ్మకాన్ని పొందడానికి మీరు స్వయంగా నమ్మకం కలిగి ఉండాలి.

జీవితంలో సుఖదు:ఖాలు సాధారణం. సుఖదు:ఖాల్లో ఒక మంచి స్నేహితుడి కోసం వెతుకుతాం. వారితో మన సుఖద:ఖాలను పంచుకోగలుగుతాం. స్నేహితులు కఠినమైన పరిస్థితుల్లోనూ మనకు అండగా నిలిచి ఉపశమనం కలిగిస్తారు. మనసు లోతుల్ని అర్థం చేసుకుని ప్రతి దశలో ఓ ఆసరాగా నిలబడి తోడుంటారు. ఇలాంటప్పుడు ఆ స్నేహితుగు భాగస్వామి రూపంలో దొరికితే ఇక చెప్పేదేముండి? అంతా ఆనందమయమే..!

ఓ మంచి భార్యకు మంచి భర్త తోడైనప్పుడు వారి దాంపత్యంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఎందుకంటే భర్తే మంచి స్నేహితుడైతే వారి ఇద్దరి మధ్య కుటుంబసమస్యలైనా కెరీర్ కు సంబంధించిన సమస్యలైనా వాటికి సంబంధించి ఇద్దరూ కలిసే పరిష్కరించుకోవాలి. పరస్పర నిర్ణయాల్ని, సలహాలను గౌరవించి స్వీకరించుకుంటుండాలి.

భార్య అవసరాలను తెలుసుకోవాలి: చాలా మంది భర్తలు ఆలోచలన పరంగా భార్యలతో ఎలాంటి భావాలను పంచుకోకుండా కేవలం 'భర్త'గానే జీవిస్తారు. కొంతమంది భర్తలకైతే తమ భార్యల ఆరోగ్యం, దాని సంబంధిత విషయాలపైనా ఎలాంటి విషయం తెలియదు. భార్య గర్భవతయ్యాక భర్త తన ప్రపంచంలో తాను మునిగిపోతాడు. జాగ్రత్తగా ఉండమని ఆదేశం ఇచ్చేసి ఇక తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. ఒకవైపు తన అవసరాన్ని హక్కుగా భావించి భర్త నుండి పొందాలనుకుంటాడు. మరోవైపు భార్య కోరికలను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తాడు. దాంపత్యంలో భర్త భార్యకు భాగస్వామి హోదా మాత్రమే ఇస్తాడు. మిగతా వాటి గురించి పట్టించుకోడు. దీనిని మహిళలు అంగీకరించరు.

వైవాహిక జీవితంలో ప్రేమకు ముఖ్యమైన ఆధారం సెక్స్. అది రోజు రోజుకూ పరస్పర ఆకర్షణను పెంచుతుంది. దాంపత్య బంధాన్ని దడంగా మార్చుతుంది. పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకోవాలి. భార్యా భర్తల మధ్య ఎంత గొడవ జరిగినా వారు రాత్రి పూట ఒకే బెడ్ పై నిద్రపోతారు. తమ సెక్స్ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. దాంతో వారి దాంపత్యంలో సంతోషం నిలిచి ఉంటుంది. భార్యా భర్తలు పరస్పరం తోడుగా ఉన్నామని ఆనందిస్తారు. ఈ శారీరక బంధం ఆత్మీయ సంబంధాన్ని పటిష్టం చేస్తుంది.

ప్రేమతో, నిజాయితీగా భర్త అవసరాలను తీర్చే భార్య అతనికి, అతని అభిప్రాయాలకు విలువిస్తుంది. భార్యగా తన బాధ్యతలు నెరవేరుస్తుంది. అదేవిధంగా భర్త నుంచి ప్రేమను ఆశిస్తుంది. ఆ ప్రమే వారిద్దరినీ సన్నిహితంగా ఉంచుతుంది. భార్యాభర్తల బంధాన్ని మధురంగా చేసుకోవడానికి భార్య కోరికలను, అవసరాలను భర్త అర్థం చేసుకోవాలి. తన కోరికలు తీరడానికి భర్తపై నమ్మకం పెంచుకోవడానికి భార్య నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. తనపై భర్తకు ఉన్న ప్రేమ అతని కళ్లల్లో భాగస్వామి వెంటనే తెలుసుకుంటుంది. కాబట్టి భార్య భర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం ప్రేమను వ్యక్తపరుచుకుంటే వారి దాంపత్యం ఎప్పుడూ నిత్యయవ్వనంగా ఉంటుంది.

English summary

Tips for Better Relationship Between Husband & Wife | భర్తే మంచి ఫ్రెండ్ అయితే...?

Married life is a phase where different people are faced with different situations, some situations memorable while some others distressing. As such, it takes a good deal of effort from both partners if married life has to be truly cherished. In this article, we look at some lovely steps to a happy married life. We look at ways to live a happy married life- one that is symptomatic of respect, love, commitment and passion.
Desktop Bottom Promotion