For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమయం,సందర్భాన్నిబట్టి ఇచ్చేగిఫ్ట్లు ఎంతో విలువైనవి!

|

బహుమతులు ఇవ్వడం పుచ్చుకోవటం అనేది చాలా పాత విషయమే. అన్ని ప్రాంతాల్లోనూ, అందరిలోనూ ఉన్న సంప్రదాయం ఇది. అందరికీ ఇష్టమైన విషయం కూడా. ఎదుటివారిపై మన ఇష్టాన్ని వ్యక్తం చేయడానికి ఉన్న మార్గాల్లో ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే సమయం, సందర్భాన్ని బట్టి ఎదుటివారి మనసును మెప్పించేలా గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక ఆర్ట్‌. బహుమతిని చూడగానే దానికోసం వాళ్లు తీసుకున్న శ్రమ మీపై వాళ్లకున్న ఇష్టాన్ని తెలియజేస్తుంది. గిఫ్ట్ ఎదుటివారి కళ్లలో వెలిగే దీపిక కావాలంటే ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిందే!

Relationship Essential Gift Ideas

* గిఫ్ట్ ఇస్తున్నపుడు మనం ఆశించే ప్రతిఫలం దానిని ఇవ్వటం ద్వారా పొందే ఆనందమే. అంతేకానీ వారి నుంచి తిరిగి పొగడ్తలో, మరింత పెద్దగిఫ్ట్ వస్తుందని ఆశించవద్దు.
* గిఫ్ట్ అనేది చాలా సమయాల్లో మనల్ని మనం వ్యక్తం చేసుకోవటం. అప్పుడది పూర్తిగా అంతరంగిక విషయం అవుతుంది. అందుకే బహుమతులు పదిమంది సమక్షంలో అట్టహాసంగా ఇవ్వాలని లేదు. ఏకాంతంలో మీ ఇష్టాన్ని రంగరించి ఇవ్వవచ్చు.
* బహుమతి ఇవ్వటం మీకు ఇష్టం కాబట్టి, అందులో మీకు, పొందిన వారికి ఆనందం ఉంది కాబట్టి ఇవ్వండి. అంతేకాని ఏదో ఇచ్చామంటే ఇచ్చాం. ఆ సమయంలో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం అన్నట్టు ఉండకూడదు.
* గిఫ్ట్ ఇచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవడమే మంచిది.

ఇవన్నీ గిఫ్ట్లే

బహుమతులు అనగానే వందలు వేలుపోసి కొనేవే అయివుండాల్సిన పనిలేదు. అవతలి వారి మనసుకి ఆనందాన్ని ఇచ్చే అంశం ఏదైనా గిఫ్ట్ే అవుతుంది. అవసరమైన సమయంలో మంచి సలహాలు, ఓదార్పు ఇవ్వటం కూడా గిఫ్ట్ లే. అటువంటి గిఫ్ట్ లు కొన్ని మీకోసం:

* ఇలాంటి గిఫ్ట్ల్లో ముందుగా చెప్పుకోవాల్సినవి పసివారి నవ్వులు. అందమైన పువ్వులు. అందరికీ సమానంగా అందే గిఫ్ట్ లు ఇవి.
* మబ్బులు ముసురేసినట్టున్న మనసుల్లో దిగులు చీకట్లని చెదరగొట్టే గిఫ్ట్ లు ఆత్మీయుల చిరునవ్వులు. ఇవి ఎంతో విలువైనవి.
* ఎవరికైనా అవసర సమయంలో మంచి సలహా ఇవ్వటం చక్కని గిఫ్ట్ అవుతుంది. ఆ సలహాని అవతలివారు స్వీకరించకపోతే కినుక వహించకపోవటం కూడా ఒక గిఫ్టే మరి.
* మీ స్నేహితుడు ఏదైనా ఆపదలో లేదా కష్టంలో ఉన్నపుడు ఎలాంటి మీమాంసలు లేకుండా అతను లేదా ఆమె తప్పొప్పులు ఎత్తి చూపి న్యాయనిర్ణయం చేయకుండా వెంటనే సహాయం చేయటం ఒక గిఫ్ట్.
* స్నేహితుల బాధ్యతల్లో పాలు పంచుకోవటం. మరీ ముఖ్యంగా స్నేహితుని తల్లిదండ్రులు వృద్ధులైనపుడు వారికి సంబంధించిన బాధ్యతల్లో పాలుపంచుకోవటం కూడా మంచి గిఫ్ట్.
* గిఫ్ట్ విలువ మన పర్సు బరువుని బట్టి ఉండదు. అది కచ్చితంగా మనసులోని భావాలకు ఒక ప్రతిబింబం మాత్రమే.
* ఆ గిఫ్ట్తో అక్కడి మనిషిని మీ పక్కన ఉన్నట్టు అనుభూతి చెందటం, అవతలి వారికి కూడా అలా అనుభూతిని కలిగించడం.
* ఇతరులను వారు వేసుకున్న దుస్తులను బట్టి ఎలా అంచనా వేయకూడదో, వారిచ్చే గిఫ్ట్లను బట్టి, వాటి విలువను బట్టి కూడా అంచనా వేయకూడదు.
చిన్నపిల్లలకు, ముసలివారికి మనమిచ్చే మొదటి గిఫ్ట్ ప్రేమ... అను కుంటున్నారా, అంతకంటే ముఖ్యమైనది వారిపట్ల శ్రద్ధని చూపించడం. వారి పనులు చేస్తున్నపుడు, వారి మాటలు వింటున్నపుడు ఆ శ్రద్ధని చూపించాలి. పిల్లలుగానీ, పెద్దవాళ్లుగానీ ఏవైనా చెబుతున్నపుడు సాధా రణంగా చాలామంది శ్రద్ధగా వినరు. లేదా చిరాకు వ్యక్తం చేస్తుంటారు. ఇది వారిని బాగా చిన్నబుచ్చుతుంది. మనం ఎంతో విలువైనది అనుకునే సమయాన్ని వారికోసం కాస్త వినియోగించడం ఒక మంచి గిఫ్ట్.

ఎదుటివారి గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా అభినందించడం కూడా మన మిచ్చే ఒక గిఫ్ట్. ఎందుకంటే ఇది ఎదుటివారికి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మిగులుస్తుంది కాబట్టి.

English summary

Relationship Essential Gift Ideas to Make someone happy

Making another person happy is one of the noblest acts you can do. Whether you want to banish their blues or simply show them how much you care, use the following tips and techniques to make someone happy.
Desktop Bottom Promotion