బ్రేక‌ప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డటమెలా?

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ల‌వ్ బ్రేక‌ప్ ఇచ్చే చేదు అనుభూతుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మే. అలాగ‌ని మ‌న ఫీలింగ్స్ ను ఏ మాత్రం ప‌ట్టించుకోని వ్య‌క్తి గురించి ప‌దే ప‌దే ఆలోచించ‌డ‌మూ అంతే బాధాక‌రం. బ్రేక‌ప్ ల‌వ్ పైన కొన్ని వంద‌ల సినిమాలు వ‌చ్చాయి. ప్రేమ పేరుతో కొన్ని ల‌క్ష‌ల మంది హృద‌యాలు ప‌గిలాయి. మ‌న‌సు గాయ‌ప‌రిచిన వ్య‌క్తికి మాత్రం అదేమీ ప‌ట్ట‌దు. మ‌న‌సు విరిగిన వారే దాన్ని క్ర‌మంగా మ‌ర్చిపోవాలి. అయితే దాదాపు అసాధ్య‌మే అని చెప్పాలి. తిరిగి అదే వ్య‌క్తి ప్రేమ‌ను పొందాలంటే ఎంతో కాలం వేచి ఉండాలి. అయినా కూడా అదే ప్రేమ దొరుకుతుంద‌నే హామీ లేదు.

98 శాతం మంది ఇలాగే.....

ఓ సామాజిక సైకాల‌జిస్ట్ ప్ర‌కారం 98 శాతం మంది ఇలా బ్రేక‌ప్ ల మూలంగా జీవితంలో ఏదో ఒక స‌మ‌యంలో బాధ‌ను అనుభ‌వించారు అని తెలుస్తోంది. మ‌న భావోద్వేగాల‌ను ప‌ట్టించుకోని వారి గురించి ఎందుకింత ఆలోచిస్తామో ఇప్ప‌టికీ విచిత్రంగానే ఉంటుంది. దీనికి స‌మాధానం క‌ష్ట‌మే కానీ ఈ బాధ అనుభ‌వించేవారికే తెలుస్తుంది.

unrequited-love-is-worse-than-a-break

త‌ల్చుకుంటే కుంగిపోతాం...

మ‌న‌సు ఒక్క‌సారి ముక్క‌ల‌య్యాక దాన్ని అతికించ‌డం క‌ష్ట‌మే. అలాగ‌ని చెప్పి ఇక ప్రేమ దొర‌క‌ద‌ని కాదు. కాక‌పోతే బాగా స‌మ‌యం తీసుకుంటాం. ఒక‌రిపై ఉన్న ఫీలింగ్స్‌ను చంపుకోవ‌డం క‌ష్ట‌మే ఒప్పుకుంటాం కానీ అదే ఫీలింగ్స్ ఆ వ్య‌క్తికి మ‌న‌పైన ఉండాలి క‌దా! మ‌న ప్రేమ‌ను తిర‌స్క‌రించినందుకు బాధ ఉండ‌దు, దాన్ని త‌ల్చుకుంటేనే మ‌రింత కృంగిపోతామ‌ని ఓ ప్ర‌ముఖ సైకాల‌జిస్ట్ అంటున్నారు.

unrequited-love-is-worse-than-a-break

శారీర‌క బాధ‌కు ఏమాత్రం తీసిపోదు...

ఓ విదేశీ విశ్వ‌విద్యాల‌యం వారు చేసిన పరిశోధ‌న‌ల ప్ర‌కారం బ్రేక‌ప్ వ‌ల్ల క‌లిగే మాన‌సిక బాధ శారీర‌క బాధ‌కు ఏమాత్రం తీసిపోదు అని తేల్చారు. మాన‌సిక బాధ నేరుగా మ‌నిషి మెద‌డుపైన ప్ర‌భావం చూపిస్తుంది.

unrequited-love-is-worse-than-a-break

ఎలా అధిగ‌మించాలి..

నిపుణులు సూచించిన ప్ర‌కారం మ‌నం ప్రేమించిన వ్య‌క్తి మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డ‌టం లేద‌న్న సంగ‌తిని అంగీక‌రిస్తే కొంతైనా బాధ త‌గ్గుతుంద‌ని అంటున్నారు. నిజాన్ని ఒప్పుకొని దీని కంటే మెరుగైన ప్రేమ కోసం అన్వేషించాలి. పాత దాన్నే ప‌ట్టుకొని వేలాడ‌టం వ‌ల్ల బాధ పెరుగుతుందే త‌ప్ప త‌ర‌గ‌దు.

English summary

unrequited-love-is-worse-than-a-break

unrequited-love-is-worse-than-a-break
Story first published: Saturday, March 24, 2018, 16:00 [IST]