ప్రేమించలేదని ఆవేశపడ్డాడు.. అందమైన జీవితం కోల్పొయాడు

Written By: Bharath
Subscribe to Boldsky

ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడోసారి మొదలవుతుంది. ఒక్కరితోనైనా ప్రేమలో పడే క్షణాలుంటాయి. మరి అవతలి వ్యక్తి కూడా తమ ప్రేమను అంగీకరిస్తే జీవితం ఫుల్ హ్యాపీ అన్నట్లుగా కొందరు ఫీలవుతారు. ప్రేమ విఫలమైతే తట్టుకోలేరు. కొందరు తమలో తామే బాధపడతారు. మరికొందరేమో శాడిస్ట్ లుగా మారుతారు. అరాచకంగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో వాళ్లే ఎక్కువగా నష్టపోతారు. అలాంటి కథనే ఇది. ఇది ఒక వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ.

# 1. ఆమె అంటే అతనికి పిచ్చి ప్రేమ

# 1. ఆమె అంటే అతనికి పిచ్చి ప్రేమ

ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమె అతని క్లాస్ మేట్. అయితే ప్రతి రోజూ తన స్నేహితులందరితో అతను ఒక డైలాగ్ చెప్పేవాడు.. ఆ అమ్మాయి నాది.. నాకే సొంతం అంటూ క్లాస్ లో అందరితో చెప్పేవాడు. అంతేకాదు... తను ఏం చేస్తున్నా గమనించేవాడు. తన ప్రతి కదలిక ఇతని కనుసనల్లోనే ఉండేది. ఆమె ఎవరితో మాట్లాడినా.. ఎవరిని చూసినా అతను మాత్రం అన్నీ గమనించేవాడు. కానీ తన ప్రేమను మాత్రం ఆమెతో వ్యక్తపరచలేదు.

# 2. ప్రేమను వ్యక్తపరచాలంటే భయం

# 2. ప్రేమను వ్యక్తపరచాలంటే భయం

ఒక రోజు అతని మిత్రులంతా కలిసి నీ ప్రేమను ఆ అమ్మాయికి చెప్పొచ్చుకదా అని అన్నారు. అందుకు అతను కాస్త భయపడ్డాడు. ఆమె ఒకవేళ నేనంటే ఇష్టం లేదని చెబితే నేనేమి చేయాలి అని తనలో తాను మదనపడ్డాడు. ఏం చేయాలో అర్థంకాక బాగా ఆలోచించసాగాడు. చెప్పాలా.. వద్దా అనేది అతని మదిలో ఉండే ప్రశ్న.

# 3. లాస్ట్ బెంచ్ స్టూడెంట్

# 3. లాస్ట్ బెంచ్ స్టూడెంట్

వాస్తవానికి అతను క్లాస్ లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్. అలాగే టీచర్స్ కూడా ఎప్పుడూ అతన్ని తిట్టేవారు. క్లాస్ లో అంతగా ఎవరూ తనని పట్టించుకునేవారు కాదు. అలాంటి తనను ఆ అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది.. తన ప్రేమను ఆమె అంగీకరిస్తుందో లేదోనని మనస్సులో చాలా ఆందోళన చెందాడు.

# 4. ఒక రోజు చెప్పాలని నిర్ణయించుకున్నాడు

# 4. ఒక రోజు చెప్పాలని నిర్ణయించుకున్నాడు

ఫైనల్ సెమిస్టర్ పరీక్షకు ముందు రోజు అతను ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. తనతో వెళ్లి నేరుగా చెప్పాడు. నేను మీతో మాట్లాడాలి.. నీకో ముఖ్య విషయం చెప్పాలన్నాడు. అయితే మొదట ఆమె అందుకు అంగీకరించలేదు. తర్వాత ఇది చాలా ముఖ్య విషయం నీవు కచ్చితంగా నా మాట వినడానికి కాస్త సమయం కేటాయించు అని బతిమిలాడాడు. దీంతో తను అంగీకరించింది.

# 5. ప్రేమ విషయం చెప్పాడు

# 5. ప్రేమ విషయం చెప్పాడు

మొత్తానికి చివరకు ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాంటూ అన్ని విషయాలు వివరించాడు. కానీ ఆమె ఆ విషయానికి ఆనందపడలేదు. అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా ఆమెకు తోచలేదు.

# 6. తను అంగీకరించాలనుకున్నాడు

# 6. తను అంగీకరించాలనుకున్నాడు

ఆమె తన ప్రేమను అంగీకరించాలి. తనతోనే జీవితాంతం ఉండాలని అతను కోరుకున్నాడు. అందుకోసం ఏదైనా చేయడానికి సిద్ధం అనే ధోరణిలో ఉన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోతే మాత్రం ఆమె మీద అతనికున్న ప్రేమ మొత్తం పోయి.. విపరీతమైన కోపం పెంచుకునే అవకాశం ఉంది.

# 7. సీనియర్ ఎంట్రీ

# 7. సీనియర్ ఎంట్రీ

ఆ సమయంలో వీరి ఇద్దరి మధ్య ఇంకో వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. అతను ఆమె సీనియర్. వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ కూడా ఉంది. ఇద్దరూ డీప్ లవర్స్. ఈ విషయం వల్లే ఆ ఒన్ సైడ్ లవర్ ప్రేమను ఆమె అంగీకరించలేదు. సీనియర్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.

#8. నా క్లాస్ మేట్

#8. నా క్లాస్ మేట్

సీనియర్, ఆ అమ్మాయి ఇద్దరూ కొద్దిసేపు క్యాంటిన్లో కూర్చొని మాట్లాడారు. తర్వాత ఈ అమ్మాయి వెళ్లిపోయింది. వెంటనే అక్కడికి ఈ అబ్బాయి వెళ్లాడు. సీనియర్ వంక చూస్తూ ఉండిపోయాడు. దీంతో సీనియర్ వ్యక్తి ఏమిటి అలా చూస్తున్నావ్.. ఆ అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు. అవును ఆమె నా క్లాస్ మేట్ అని ఆ ఒన్ సైడ్ లవర్ చెప్పాడు.

#9. నాకు కాబోయే పెళ్లాం

#9. నాకు కాబోయే పెళ్లాం

ఓకే నీకు క్లాస్ మేట్ కావొచ్చేమో. నాకు మాత్రం ఆమె కాబోయో పెళ్లాం. మేము చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పాడు. త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పాడు.

#10. మైండ్ బ్లాక్

#10. మైండ్ బ్లాక్

ఆమె తనకు కాబోయే పెళ్లాం అని సీనియర్ చెప్పిన మాటలకు ఒన్ సైడ్ లవర్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ అమ్మాయిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. అయినా ఆమె మాత్రం తనకే దక్కాలని మైండ్ లో ఫిక్స్ అయ్యాడు. అందుకోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అన్నట్లుగా మారాడు.

# 11. వాడు నాకన్నా మంచివాడా?

# 11. వాడు నాకన్నా మంచివాడా?

దీంతో ఆ ఒన్ సైడ్ లవర్ కు దిమ్మదిరిగిపోయింది. ఏం.. వాడు నాకన్నా మంచివాడా? నాలో లేనిది ఏమిటి వాడిలో ఉన్నది ఏమిటి అని తనలో తాను ఆలోచించసాగాడు. తనను తాను కొన్ని వందల సార్లు ప్రశ్నించుకున్నాడు. నా కంటే ఆ సీనియర్ లో అంతంగా ఆమెకు ఏం నచ్చిందని ఆలోచించసాగాడు. వాణ్ని ఎలా అంగీకరించింది. నన్ను ఎలా ఎందుకు వద్దంటుందిగురి అని ఆలోచనలతో సతమతమయ్యాడు.

# 12. ఆ అమ్మాయి నాకే సొంతం

# 12. ఆ అమ్మాయి నాకే సొంతం

ఆ అమ్మాయి నాది. నాకే సొంతం కావాలి. నన్ను కాదని ఆమె సీనియర్ని ఎలా ప్రేమిస్తుంది అని తికమకచెందాడు. తనలో తానే ఆ ప్రశ్నను గుర్తు తెచ్చుకునేవాడు. కానీ అందుకు సమాధానం లేదు.

అయినా మళ్లీ అదే పంథా.. ఆమ నాది.. నేను ఆమెను చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. నాకు తప్ప వేరొకరి సొంతం కాకుడదని భావించేవాడు.

# 13. అందరి ముందు ఇన్సల్ట్

# 13. అందరి ముందు ఇన్సల్ట్

దీంతో ఈ ఒన్ సైడ్ లవర్ ఆమె దగ్గరికి వెళ్లి తన ప్రేమ గురించి మళ్లీ చెబుతాడు. తనను ప్రేమించమని అడుగుతాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. ఆ విషయాన్ని తన బాయ్ ఫ్రెండ్ అయినా సీనియర్ కు చెబుతుంది. దీంతో అతను ఈ ఒన్ సైడ్ లవర్ని ఫ్రెండ్స్, కాలేజీ స్టాఫ్ ముందు తిడతాడు.

# 14. ఆమెకు ఫోన్ చేసి..

# 14. ఆమెకు ఫోన్ చేసి..

కాలేజీ నుంచి ఇంటికి వెళ్లాక కూడా మళ్లీ తన గురించే అతని ఆలోచనలు కొనసాగాయి. ఎందుకు ఒప్పుకోవడం లేదు.. ఒక్కసారి ఫోన్ చేస్తే మేలు కదా అని ఆమెకు ఫోన్ చేశాడు. నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావ్.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అంటూ ఆమెను ప్రశ్నలపై ప్రశ్నలు ఫోన్లో అడగడం మొదలుపెట్టాడు. ఆమె సమాధానం చెప్పబోయేలోపు మళ్లీ నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావో చెప్పు అంటూ అడ్డంతగిలేవాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసింది.

# 15. నంబర్ బ్లాక్

# 15. నంబర్ బ్లాక్

మళ్లీ ఆ ఒన్ సైడ్ లవర్ ఆమెకు ఫోన్ చేయబోయాడు. కానీ ఆమె అప్పటికే అతని నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో అతనిలో మరింత కోపం పెరిగింది. ఈ సారి నేరుగా ఇంటికే వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో కూడా ఎవరూ లేరు. తన ప్రేమను అంగీకరించమని గట్టిగా చెప్పాడు ఆమెకు. ఆమె ఏదో చెప్పబోయింది.

# 16. గొంతు పట్టుకున్నాడు

# 16. గొంతు పట్టుకున్నాడు

కానీ అతను ఆశించేది మాత్రం ఒక్కటే.. తనని ఆమె లవ్ చేయాలి అంతే. ఏ కారణాలు చెప్పినా అతను వినే ఓపికలో లేడు. ఆమె ఏదో చెబుతుండగా వెంటనే ఆమె గొంతు పట్టుకున్నాడు. ఒప్పుకుంటావా లేదా అని బెదిరించాడు. లేదంటే గొంతు నులిమేస్తా అంటూ గట్టిగా గొంతు పిసికాడు.

# 17. ఆమె తప్పించుకుంది.. అతని చేయి, కాలు పోయాయి

# 17. ఆమె తప్పించుకుంది.. అతని చేయి, కాలు పోయాయి

ఆమె ఆత్మరక్షణకు అతని ముఖంపై గుద్దింది. అక్కడి నుంచి వెంటనే పారిపోయింది. ఆమెను పట్టుకునే క్రమంలో ఇంటి దగ్గర బాల్కనీలో ఉన్న ఎలక్ట్రిక్ తీగలు పట్టుకున్నాడు. దీంతో అతని చేయి, కాలు పనికిరాకుండా పోయాయి.

# 18. ఎనిమిది సంవత్సరాల తర్వాత

# 18. ఎనిమిది సంవత్సరాల తర్వాత

ఈ సంఘటన జరిగి ప్రస్తుతానికి ఎనిమిదేళ్లు అవుతుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనూ కోకొల్లలున్నాయి. ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు, యాసిడ్ దాడులవంటివి మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఆ రోజు తాను అలా చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు తన పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ ఆ స్టోరీలోని వ్యక్తి ప్రస్తుతం బాధపడుతున్నాడు. ప్రతి క్షణం ఆ విషయమే తలుచుకుని బాధపడుతున్నాడు.

19. లైఫ్ లో ఎంజాయ్ లేకుండా పోయింది

19. లైఫ్ లో ఎంజాయ్ లేకుండా పోయింది

అందరిలా ఎంతో ఎంజాయ్ గా సాగాల్సిన తన బతుకు ఇలా మారిందంటూ ఆవేదన చెందుతున్నాడు. అందుకే యూత్ మొత్తం క్షణ కాలపు ప్రేమ కోసం.. కలకాలం ఉండే భవిష్యత్తుపైనే కాన్సన్ ట్రేషన్ పెడితే బాగుటుంది. ఒక్క సంఘటన అతను జీవితాంతం బాధపడేలా చేసింది.

English summary

a guy doing annoying thing after his break up

A guy doing annoying thing after his break up..story about Boy shares his first love and what he thinks about after rejection.
Story first published: Tuesday, December 5, 2017, 13:42 [IST]