అంగస్తంభన బహిరంగ ప్రదేశాల్లో చోటు చేసుకుంటే ఎలా దాచుకోవాలి ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

అంగస్తంభనలు మంచివే కానీ అనవసరమైనప్పుడు, అవసరం లేని చోట అవి చోటుచేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఏదైనా బహిరంగ ప్రదేశానికి వెళ్లారు. అటువంటి ప్రదేశంలో తాము వేసుకున్న ప్యాంట్లు ఉబ్బిపోవాలని మరియు బిగిసుకుపోవాలని ఎవరు కోరుకోరు.

ఇటువంటి ఒక సందర్భాన్ని ఊహించుకోండి: మీరు చదువుకుంటున్న లేదా పనిచేసే ప్రదేశంలో మీ సహచరులు లేదా ఇంకెవరైనా మీతో మాట్లాడాలని మీ వద్దకు వచ్చారు. అలాంటి సమయంలో అనూహ్యంగా మీ ప్యాంటు ఉబ్బిపోతే అప్పుడు మీరు ఎంతో ఇబ్బందికి లోనవుతారు.

కామ వాంఛను పెంచే ఇండియన్ మసాలా దినుసులు

సాధారణంగా చాలా మంది యుక్త వయస్సులో ఉన్నవారు, పాఠశాలలో లేదా కాలేజీ లో ఇలా అనూహ్యంగా వచ్చే అంగస్తంభనల గురించి పిర్యాదులు చేస్తుంటారు. అలా నలుగురు ముందు ఉన్నప్పుడు అంగస్తంభన జరగడం వల్ల తమ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని మరియు నవ్వుల పాలవుతున్నామని మదనపడుతుంటారు.

ఇటువంటి సందర్భం మీరు ప్రేమించే వ్యక్తుల ముందు జరిగితే, అటువంటి సమయంలో దాచడానికి మీరు కష్టపడరు. ఇలా అనుకోకుండా చోటు చేసుకొనే అంగస్తంభన ను ఎలా దాచుకోవాలి అనే విషయమై ఇప్పుడు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్

చిట్కా #1 :

చిట్కా #1 :

మీరు గనుక టేబుల్ కి దగ్గరలో ఉన్న చైర్ లో కూర్చొని ఉంటే, ఆ టేబుల్ ను మీ వద్దకు లాక్కోండి. ఇలా చేయడం ద్వారా మీ అంగస్తంభన ను బయటవ్యక్తులకు తెలియకుండా దాచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అంగస్తంభన వల్ల ఎదురయ్యే ఇబ్బందికర సందర్భాన్ని అధిగమించవచ్చు.

చిట్కా #2 :

చిట్కా #2 :

మీరు గనుక కూర్చొని ఉంటే, కాలు పైన కాలు వేసుకొని కూర్చోవడం ద్వారా మీ అంగస్తంభన ను నలుగురికి కనపడకుండా దాచుకోవచ్చు.

చిట్కా #3 :

చిట్కా #3 :

ఏదైనా పత్రిక లేదా వార్త పత్రికను పెద్దగా చేసి దానిలో ఎదో విషయాన్ని చాలా లోతుగా చదువుతున్నట్లు మీ ఒడిలోపెట్టుకొని నటించండి. ఒక వేళ మీకు అంతగా నటించడం రాకపోతే పత్రికను ఊరికే మీ ఒడిలో అలా పెట్టుకోవడం ద్వారా అంగస్తంభనను ఎవ్వరికి కనపడకుండా చేయవచ్చు.

చిట్కా #4 :

చిట్కా #4 :

మీకు ఎదో అనూహ్యంగా అప్పుడే అనుకోకుండా నడుము నొప్పి వచ్చినట్లు నటించడం మొదలు పెట్టండి. ఆ తర్వాత టక్ చేసుకున్న షర్ట్ ని బయటకు తీయడం ద్వారా, ఆ షర్ట్ మీ అంగస్తంభన ను బయటివారికి కనపడకుండా చేస్తుంది.

చిట్కా #5 :

చిట్కా #5 :

మీ చేతులను మీ జేబులో పెట్టుకొని వేటి కోసమో తీవ్రంగా గాలిస్తున్నట్లు నటించండి. ఇలా చేయడం ద్వారా మీ ప్యాంట్ లోపల జరిగిన అంగస్తంభన ను బయటకు కనపడకుండా కప్పిపుచ్చవచ్చు.

చిట్కా #6 :

చిట్కా #6 :

అంగస్తంభన జరిగిన సమయంలో మూత్ర విసర్జన చేయడం ద్వారా మీ పురుషాంగం మళ్ళీ మామూలు స్థితికి చేరుకునే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో మూత్రాశయం నిండిపోవడం వల్ల కూడా అంగస్తంభన జరుగుతుంటుంది.

చిట్కా #7 :

చిట్కా #7 :

మీ ఆలోచనా దృష్టిని వేరే విషయాల పై మరల్చండి. ఇలా చేయడం అత్యుత్తమమైన మార్గం. శృంగారపరమైన ఆలోచనలను మీ మెదడు నుండి తీసివేయండి మరియు మీ పురుషాంగాన్ని అంగస్తంభన స్థితి నుండి సాధారణ స్థితికి వచ్చేలా దేని గురించి అయినా తీవ్రంగా ఆలోచించండి లేదా మీరు చేరాల్సిన లక్ష్యాల గురించి అయినా ఆలోచించండి.

చిట్కా #8 :

చిట్కా #8 :

పైన చెప్పినవి ఏవి గనుక ఆ సమయంలో చేయలేకపోతే దగ్గరలో ఉన్న బాత్ రూమ్ కి వెళ్ళండి. మీ శరీరం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేవరకు కొద్దిసేపు అక్కడే వేచి ఉండండి. ఆ తర్వాత బయటకు రండి.

English summary

How To Hide Your Erection In College | Hiding Erections | How To Get Rid Of An Unwanted Erection

Do you know how to hide your erection in college? Well, here are some tips for hiding erections. Read on...'
Story first published: Monday, September 11, 2017, 19:30 [IST]