అబ్బాయిలు శారీరిక వేధింపులకు గురైనప్పుడు ఏమవుతుంది?స్టడీస్ చెబుతున్న షాకింగ్ నిజాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మన సమాజంలో మహిళలపై కొంత మంది పురుషులు శారీరిక వేధింపులకు పాల్పడుతుంటారు అని తరచూ మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ, కొంత మంది పురుషులు కూడా శారీరిక వేధింపులకు బాధితులుగా మారుతున్నారు.

పురుషులు కూడా శారీరిక వేధింపులకు గురవుతున్నారనే వార్తలు ఈ మధ్య కాలంలో అక్కడక్కడా వినపడుతున్నాయి.మరి పురుషులు శారీరిక వేధింపులకు బాధితులుగా మారినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఆనందపడుతారా లేక బాధ పడుతారా? వాళ్ళు కూడా లైంగిక దాడి జరిగిన బాధితుల్లో లాగానే కృంగిపోతారా..?

ఇలా పురుషుల పై జరిగే శారీరిక వేధింపులకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేసిన పరిశోధకులు పలు ఆసక్తి కరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు.

గృహహింస పిండం మీద ప్రభావం చూపుతుందా?

male domestic abuse statistics

అసలు శారీరిక వేధింపులు అంటే ఏమిటి ?

శరీరం పై దాడి కి పాల్పడటం , తాకకూడని చోట ఇష్టమొచ్చినట్లు తాకి వేధించటం , లైంగిక దాడి కి పాల్పడటం ,మానభంగం చేయటం ,ఇలా ఒక వ్యక్తి మరొక వ్యక్తి సమ్మతం లేకుండా అతడి శరీరం పై చేసే దాడులు అన్ని శారీరిక వేధింపులు కిందకు వస్తాయి . దీనికి బాధితులుగా మారిన వారిలో కనపడే లక్షణాలు మానసికంగా కృంగిపోవటం,ఆతురత పెరిగిపోవటం, వ్యసన పరులు గా మారటం తో పాటు ఆత్మ హత్య లాంటి విపరీతమైన పరిణామాలకు కూడా దారి తీస్తాయట.

male domestic abuse statistics

అధ్యయనాలు చెబుతున్న కొన్ని నమ్మలేని నిజాలు ...

ఇప్పటి వరకు అమ్మయిలు శారీరిక వేధింపులకు గురైతే వాళ్ళు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ గురించి తెలుసుకోవడానికి ఎన్నో అధ్యయనాలు చేసారు.కానీ అబ్బయిలు శారీరిక వేధింపులకు గురైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం పై అధ్యయనాలు సంచలన విషయాలను బయట పెట్టాయి. మాములుగా అబ్బాయిల పై శారీరిక వేధింపులకు గురైతే , ఆ సమయం లో వాళ్ళు ఆనందిస్తారని,లేక పొతే శారీరిక వేధింపులకు గురి చేస్తున్న వారి పై పోరాడి తమను తాము అబ్బాయిలు క్షించుకుంటారు అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేసారు.ఇలాంటి అపోహలే మన సమాజంలో చాలా మంది లో ఉన్నాయి.ఇలాంటి ఊహాగానాలకు తెరదించుతూ , కొంత మంది లైంగిక దాడికి బాధితులుగా మారిన అబ్బాయిలు తీవ్ర మానసిక క్షోభను,బాధను అనుభవిస్తూ ఎవరికీ చెప్పాలో తెలియక, తమలో తామే కుమిలిపోతున్న వాళ్ళు ఎంతో మంది అబ్బయిలు సమాజంలో ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి . శారీరిక వేధింపులకు బాధితులుగా మారిన అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ వాళ్ళ మానసిక స్థితి ఒకేలా ఉంటుందట.ఆ షాక్ వాళ్ళను కొద్దిగా కృంగదీస్తుందట.

మీ భాగస్వామిని ఫేస్ బుక్ లో ఫాలో అవకుండా ఉండటం ఎందుకు మంచిది!

male domestic abuse statistics

ఎందుకు అబ్బాయిల పై జరిగిన శారీరిక వేధింపులు వెలుగులోకి రావటం లేదు..

చాలా మంది అబ్బాయిలు శారీరిక వేధింపులకు గురైన , ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరట . అలా బయటకు చేప్పడానికి చాలా మంది భయపెడతారట . ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పాటు,ఈ విషయమై బాధ పడినా, ఏడ్చినా అవమానంగా భావిస్తారట.బయట చెప్పుకునే బదులు తమలో తాము బాధ పడటం మంచిదని అనుకుంటారని , అందువల్లనే కొన్ని రోజులకు మానసికంగా కృంగిపోతారట.

అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎవరైనా సరే తాము శారీరిక వేధింపులకు గనుక గురైతే , మానసిక నిపుణల సలహా మేరకు తగు జాగ్రత్తలు, సలహాలు తీసుకుంటే మళ్ళీ మాములు మనుషులుగా మారుతారని చెబుతున్నారు నిపుణులు.

English summary

Study: Even Men Are Scared Of Physical Abuse!

Generally, men are perceived as the ones who initiate an assault physically. But a small percentage of men are on the receiving end too. Read this!
Story first published: Wednesday, August 2, 2017, 15:00 [IST]
Subscribe Newsletter