For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంబంధంలో పురుషుని నుండి స్త్రీ కోరుకునే ప్రాధమిక అంశాలు ఇవే .. !

సంబంధంలో పురుషుని నుండి స్త్రీ కోరుకునే ప్రాధమిక అంశాలు ఇవే

|

ఈ యుగo ప్రధానంగా ప్రేమ మరియు సంబంధం అనే అంశాలకు సంబంధించిన ధోరణికి ఎక్కువ ప్రభావితమై ఉంది. ఒక మనిషిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఏమైనా ఉన్నది అంటే అది “అంచనా”. ఒక ప్రియురాలిని లేదా భార్యని కలిగి ఉండడం ఈ అంచనాలను మరింత పెంచుతాయి.

నిజమే ప్రియురాలిని లేదా భార్యను అన్ని విధాలా సంతృప్తి పరచాలంటే అది అసాధ్యమైన పనే అని చెప్పక తప్పదు. పురుషుని మీద స్త్రీ యొక్క అంచనాలు, వేసే ప్రతి అడుగులోనూ మారుతూ ఉంటాయి. కావున స్త్రీ కోపానికి గురికాక ముందే, వారు మీ మీద పెట్టుకున్న అంచనాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టిన వారవుతారు. ఈ అంచనాలు ప్రాధమిక అంచనాలుగా ఉంటాయి మరియు ప్రతి మహిళా ఆశించేవిలానే ఉంటాయి.

సంబంధంలో పురుషుని నుండి స్త్రీ కోరుకునే ప్రాధమిక అంశాలు ఇవే

ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలు పురుషుల నుండి స్త్రీలు సాధారణంగా కోరుకునే చిన్ని చిన్ని కోరికలే.

గుడ్మార్నింగ్, గుడ్నైట్ విషెస్:

గుడ్మార్నింగ్, గుడ్నైట్ విషెస్:

వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజం. ముఖ్యంగా ప్రేయసిగా ఉన్నప్పుడు మీ నుండి ఎక్కువగా ఆశించేది ఈ అంశమే . ప్రేయసే కాదు భార్య కూడా కోరుకుంటుంది కానీ, ఇలాంటివి పెద్దగా ఆలోచించరు. అక్కడే సమస్య మొదలవుతుంది. కనీసం ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ రూపంలో కాని లేదా నేరుగాకాని ఏరూపంలో అయినా విష్ చేయడం మాత్రం మర్చిపోకండి. తద్వారా ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతుంది. రోజులో కనీసం ఒకసారైనా మీ నుండి విష్ ను ఆశిస్తారు. అదే వారికి పదివేలు. మీరు ఎటువంటి తీవ్రమైన ప్రణాళికలలో ఉన్నా కానీ ఒక్క విష్ చేయడం ద్వారా మీ సొమ్మేం పోదు కదా.

ప్రశంస:

ప్రశంస:

ఈప్రపంచంలో ప్రతిఒక్క మనిషి కోరుకునేది ప్రధానంగా ప్రేమ మరియు ప్రశంస. ఒకరిని ప్రశంసిస్తున్నాం అంటే, వారిపట్ల ధ్యాస కలిగి ఉన్నామనే ఆలోచనను కలిగిస్తుంది. పొగడ్త అంటే ప్రతి విషయానికి భజన చేయడం కాదు. తన పనికి తగ్గ గుర్తింపును మీ మాటలలో తెలియజేయడం. రుచికరమైన వంట వండిపెట్టినప్పుడు, ఒక్క చిన్న ప్రశంసను ఇవ్వండి, మీ ప్రేమలు బలపడేలా ఇలాంటి అంశాలే చేయూతను ఇస్తాయి. ఇలాంటి చిన్ని చిన్ని విషయాల్లోనే వారు సంతోషాలను వెతుక్కునేది. కనీసం ఆ సంతోషాలను కూడా ఇవ్వలేకపోతే ఎలా.

కాంప్లిమెంట్స్:

కాంప్లిమెంట్స్:

కాంప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా మహిళలు రోజంతా సంతోషంగా ఉండగలరు. కాని కాంప్లిమెంట్స్ కామ్ప్లికేట్ కాకుండా చూసుకోవాలి. మీరు అదిపనిగా వెతికి వెతికి కాంప్లిమెంట్స్ ఇవ్వనవసరం లేదు. మీకు తనలో నచ్చిన ఏ అంశాన్నైనా సున్నితంగా ప్రేమగా చెప్పగలిగితే చాలు. ఫేక్ కాంప్లిమెంట్స్ అసౌకర్యాన్నే మిగులుస్తాయి. మీకోసం ఉన్న వ్యక్తి పట్ల ఆమాత్రం ప్రేమను చూపకపోతే ఎలా.

నిజాయితీ:

నిజాయితీ:

సంబంధం ఎప్పటికీ అబద్దపు వాగ్దానాలపై నిలబడి ఉండలేవని గ్రహించండి. అబద్దాలు, నమ్మకద్రోహాలు, మోసాలు వంటివి సంబంధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ భాగస్వామి పట్ల కూడా మీరు నిజాయితీ ప్రదర్శిoచక పొతే ఇక ఆ సంబంధానికి అర్ధమేముంది. ఒక అబద్దం చెప్పే ముందు, ఎవరితో చెప్తున్నాం అన్న ఆలోచనను కూడా కలిగి ఉండాలి. ఒక్కోసారి అసౌకర్యాన్ని మిగిల్చే అబద్దం కన్నా, భాదపెట్టే నిజమే మేలు. అబద్దాలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. మీ ఆరోగ్యకర సంబంధాలలో అనారోగ్యకర వాతావరణాన్ని తెస్తాయి.

సోషల్ నెట్వర్క్స్:

సోషల్ నెట్వర్క్స్:

మహిళలు అత్యంత మృదు స్వభావులు. మీతో తమ మధురానుభూతులను స్నేహితులతో పంచుకునేందుకు సుముఖంగా ఉంటారు. తద్వారా సోషల్ నెట్వర్క్స్ లో తమ డిస్ప్లే పిక్చర్స్ రూపంలో కానీ , ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా కానీ తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. మరీ అంతగా కాకపోయినా మీ నుండి కూడా ఎదో ఒకటి ఆశిస్తారు. కనీసం డిస్ప్లే పిక్చర్ లో అయినా తమ ఫోటో ఉంటుoదా అని. వారి సంతోషం కోసమైనా, మంచి ఫోటోను ఎంచుకుని డిస్ప్లే పిక్చర్ లా పెట్టడం వలన ఎంతో సంతోషానికి లోనవుతారు. ఒక వేళ అలా సామాజిక మాధ్యమాలలో ఫోటోలను ఉంచడం ఇష్టంలేని పక్షాన, వారికి సున్నితంగా పరిణామాల గురించి అర్ధమయ్యేలా చెప్పాలి. అంతేకానీ, మనసు నొచ్చుకునేలా ప్రవర్తించడం సరికాదు.

చేతులు పట్టుకుని నడుస్తున్నారా :

చేతులు పట్టుకుని నడుస్తున్నారా :

తప్పేముంది. అలా చేతిలో చెయ్యి వేసి నడవడం ద్వారా మీరు తెలీని ఆప్యాయతను ప్రదర్శించిన వారవుతారు. ఇలా నడవడం వారి హక్కుగా భావిస్తారు, మరియు మీ నుండి ఆ ఆప్యాయతను ఆశిస్తారు. అలసిపోయినప్పుడు భుజాన్ని అందివ్వడం, ఆదరువుగా నడిపించడం. ఇలాంటివి ప్రేమను పెంచే అంశాలే అవుతాయి. పబ్లిక్ లో అందరూ చూస్తుండగా చేయి పట్టి లాగడం, మరే ఇతర చర్యలకు పాల్పడడం అవమానాన్నే మిగులుస్తాయి. మీ చర్యలు తనపై మీకున్న ఆప్యాయతను కనపరిచేలా నడుచుకోవడం మీ భాద్యత అవుతుంది.

ఆశ్చర్యానికి గురిచేయండి :

ఆశ్చర్యానికి గురిచేయండి :

ప్రతి మహిళ తన భాగస్వామి నుండి ఏదో ఒక సర్ప్రైస్ కోరుకుంటుంది. గిఫ్ట్ రూపంలో కానీ, ట్రిప్ , సినిమా వంటి అంశాల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో. ఇక్కడ మీ భాగస్వామిని అర్ధం చేసుకుని ఆమె అభిరుచులకు విలువిచ్చి, ఆవిడ కోరుకునే చిన్ని కోరికలను చెప్పకుండా తీర్చడం వంటి చర్యలు ఆశ్చర్యానికి లోను చేయడమే కాకుండా మీ బంధాన్ని పటిష్టంగా మారేలా సహాయం చేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. ఆ ఆశ్చర్యం ఒక చిన్న చిరునవ్వుని ఆమె పెదాలపై ప్రసాదిస్తే, అంతకన్నా సంతోషమేముంటుంది . ఎన్నో భాద్యతలతో సతమతమయ్యే మహిళ సేద తీరేలా భాగస్వామి ఉండాలి కానీ, భారమయ్యేలా కాదు.

క్షమాపణలు :

క్షమాపణలు :

ఏంటి నామోషీనా , సారీ చెప్పడానికి. అవన్నీ పక్కన పెట్టండి సార్. తప్పు ఎవరిది అయినా యుద్ధం చివర్లో సారీ మీరే చెప్పాల్సి ఉంటుంది. అదేదో ముందే చెప్పేస్తే, ఏ సమస్యా ఉండదు. కాదంటారా. క్షమాపణలు చెప్పడం వలన మీరేం తక్కువగా అనిపించరు. తన సంతోషం కోసమే కదా మీరు చెప్పింది, ఒక మెట్టు మీరే ఎక్కువ అనుకోండి. మీరు నిజంగా మీ భాగస్వామిని ప్రేమిస్తున్న వారైతే, ఆ సారీ విలువ మీకు తెలిసే ఉంటుంది. తన సంతోషం కోసం ఆ మాత్రం బెండ్ అవక తప్పదు.నిజమే కదా.

English summary

FUNDAMENTAL THINGS A WOMAN EXPECTS FROM A MAN IN EVERY RELATIONSHIP

The era must have been changed and so has the trend of love and relationship. Expectations do hurt a human being, but a girlfriend and a wife are something beyond a normal human being. It is never easy to convince and satisfy a girlfriend and a wife. Woman"s expectation increase with the pace of time.
Story first published:Thursday, May 3, 2018, 13:28 [IST]
Desktop Bottom Promotion