మీరు చెడు సంబంధంలో ఉన్నారు అనడానికి 9 సూచనలు

Subscribe to Boldsky

కొన్ని చెడు సంబంధాలు తమకు తామే నాశనమవడానికి నిర్మించుకున్న పునాదులు లేని కట్టడాలు. ఇలాంటి సంబంధాలు మీ మనసు, ఆరోగ్యo మరియు ఆర్ధిక పరిస్థితిపై దారుణమైన చెడు ప్రభావాలు చూపిస్తాయి. ఇలాంటి సంబంధాలలో ఉన్నందువలన మీ ఉనికిని కోల్పోయే అవకాశం కూడా ఉన్నది. కావున ఇలాంటి చెడు సంబంధాలనుండి బయటకి వచ్చెయ్యడమే మేలు.

Relationship problems in telugu

ఈ చెడు సంబంధాల వలన ఎన్నో సమస్యలు ఉత్పన్నమవడo జరుగుతాయి. డిప్రెషన్, ఆందోళన, కోపం, భాధ వంటి భావోద్వేగాలకు నిలువుటద్దం అయిన అలాంటి చెడు సంబంధాలలో ఉండేకన్నా వీలైనంతగా త్వరగా వీటి నుండి బయటకు రావడమే మంచిది.

ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే మీరు చెడు సంబంధాల్లో ఉన్నారనే అర్ధం.

స్వీయ చిత్రం:

స్వీయ చిత్రం:

ఒక్కోసారి కొన్ని సంబంధాలలో ఉండడం మీ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంటాయి. తద్వారా ఇది మీ స్వీయ గౌరవానికి(self respect ) ఒక ప్రశ్నగా ఉంటుంది. మీ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతిని, స్వేచ్చా స్వాతంత్ర్యాలను సైతం హరించి వేస్తాయి. వినడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నా కూడా అనుభవించేవానికే తెలుస్తుంది ఈ భాధ. అలాంటి సంబంధాలలో ఉండడం కూడా జీవితానికే పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.

అసహనం:

అసహనం:

ఒక్కోసారి ఇలాంటి చెడు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే కుక్కకు, దాని మాస్టర్ కు మద్య ఉన్న సంబంధం లాగే ఉంటుంది. ఎప్పుడు కూడా మీ భాగస్వామి ఇష్టాలకై మీరు నిరంతరం శ్రమ పడుతారే తప్ప , మీకంటూ ఒక సంతోషం ఉన్నదన్న విషయాన్ని సైతం మరచిపోతూ ఉంటారు. అంటే అంతం లేని దారి వలె చెడు సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. ఏ కోశాన మీ సంతోషానికి విలువ ఉండదు. ఇలాంటి సంబంధమే మీది అనిపిస్తే, ఆలోచించుకోవడం మంచిది.

విమర్శలు- ధిక్కారాలు:

విమర్శలు- ధిక్కారాలు:

ప్రేమలో పొరపొచ్చాలు వచ్చినా సర్ధుకోవచ్చు కానీ, కొందరు అదే పనిగా ఛీత్కారాలు దిక్కారాలు విమర్శలకే అధిక ప్రాధాన్యతని ఇస్తూ ఒక గౌరవం అనేది లేకుండా ప్రవర్తిస్తారు. అలాంటి సందర్భంలో మీకంటికి మీరే చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితే కనుక మీదైతే , ఆ సంబంధం చెడు సంబంధంగా గుర్తించక తప్పదు.

అనుమానపు ఆటలు:

అనుమానపు ఆటలు:

ప్రతి విషయానికి మీదే తప్పు అన్నట్లు ప్రవర్తించడం సరికాదు. కొందరు తాము తప్పు చేసినా కూడా తప్పులేదని బుకాయించడం, లేదా ప్రశ్నించినందుకు ఛీత్కారాలకు గురి చేసి తక్కువ చేయడం వంటివి చేస్తుంటారు. ప్రేమ అంటే ఇద్దరికీ స్వాతంత్ర్యం ఉండాలి. కేవలం ఒకరిదే పై చేయి అనడం ఎంత వరకు సమంజసం. ఇలాంటి సంబంధాలు నెమ్మదిగా పెద్ద పెద్ద తగవులకే దారి తీస్తుంటాయి.

అసూయ:

అసూయ:

ఇది అత్యంత హేయమైనది. మొక్కలో ఉన్నప్పుడే మీరు గమనించకపోతే మానై కూర్చుంటుంది. తద్వారా జీవితమంతా అసూయా ద్వేషాలతో కకవికాలంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే, మార్చే ప్రయత్నం చేయండి. ఎప్పటికీ మారకుంటే మాత్రం పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ అసూయ కలిగిన వారిలో భాగస్వామిపై నమ్మకం అనేదే ఉండదు. నమ్మకం లేని సంబంధాలు ఈ లోకంలో ఎన్నటికీ నిలబడవు.

దూకుడు స్వభావం:

దూకుడు స్వభావం:

అన్నివేళలా ఆలోచనలు చేయకుండా దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉండి , ప్రతి చిన్న విషయాన్ని కూడా గొడవలకు దారితీస్తుంటారు కొందరు . ఇలాంటివి మానసిక అశాంతిని మిగల్చడమే కాకుండా అందరూ ఉన్నా కూడా ఒంటరి ప్రయాణం చేస్తున్న అనుభూతికి తీస్కుని వస్తుంది. మొదట్లో మీరు మామూలుగా తీసుకున్నా కూడా ఏదో ఒకరోజు పెద్ద పెద్ద గొడవలకు దారితీసి ఎన్నో సమస్యలను తీసుకుని వస్తుంది .

ఒంటరి ప్రయాణంగా ఉందా?

ఒంటరి ప్రయాణంగా ఉందా?

ఒక్కోసారి కొన్ని సంబంధాలలో కూరుకున్నప్పుడు, భాగస్వామిని సంతోషపెట్టడానికి ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా స్నేహితులను కుటుంబాలను సైతం త్యజించి చివరికి ఒంటరి జీవితాన్ని గడపాల్సిరావొచ్చు. మీరు ఇన్ని చేసినా కూడా ఆ వ్యక్తి మీతోనే జీవితాంతం తోడుగా ఉంటారన్న నమ్మకాన్ని కూడా మీరు కలిగి లేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో దీన్ని చెడు సంబంధంగానే గుర్తించవలసి ఉంటుంది.

డిప్రెషన్: మానసిక ఆందోళనలు

డిప్రెషన్: మానసిక ఆందోళనలు

చెడు సంబంధాలు ఆఖరి దశకు చేరుకున్నప్పుడు సాధారణంగా కనిపించే మానసిక సమస్య ఈ డిప్రెషన్. పైన చెప్పిన అన్ని లక్షణాలు ఆ సంబంధంలో ఉన్నప్పుడు నూటికి 90 శాతం డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి . కొందరు ఈ పరిస్థితిని అధిగమించలేక ఆత్మహత్యల వంటి పిరికి చర్యలకు కూడా పాల్పడుతుంటారు. కానీ ఇలాంటి సందర్భంలోనే ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఒక వేళ ఆ సంబంధం కొనసాగితే మీ జీవితం గతి ఏమిటి అన్న ప్రశ్నని మీకు మీరే వేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్య నుండి బయటపడవచ్చు. ఒకవేళ మీరు డిప్రెషన్ కి లోనవుతున్నారు అంటే , మీరు చెడు సంబంధాలలోనే ఉన్నారని అర్ధం.

బానిసలా లేక ప్రేమికులా ?

బానిసలా లేక ప్రేమికులా ?

కొందరు పేరుకు ప్రేమలో ఉంటారు కానీ, అది ప్రేమ ఎన్నటికీ కాజాలదు. ఒకరికోసం ఒకరు అన్నట్లు ఉంటే ప్రేమ అవుతుంది కానీ ఒకరి కాలికిందే జీవితం అన్నట్లు ఉంటే దాన్ని బానిస బ్రతుకు అంటారు, అది ప్రేమ ఎలా అవుతుంది. మీలో ఈ ఆలోచన వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చెడు సంబంధంలోనే ఉన్నారని అర్ధం.

కావున ఒకవేళ మీరు కనుక పై లక్షణాలతో కూడిన సంబంధాలలో ఉన్నట్లు అనిపిస్తే , వారిని మార్చడానికి ప్రయతించండి. అయినా మార్పు కనపడకపోతే , కొన్ని తప్పని సందర్భాలలో ఉనికినే కోల్పోతున్న పరిస్థితులలో గుడ్ బాయ్ చెప్పడమే మేలు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    9 WAYS TOXIC RELATIONSHIP AFFECTS YOU

    Trying to cope with a relationship that is eating you inside? Toxic relationship is a man-made disaster that befalls us and is created by us. Its hard to see the best in yourself when you are in such kind of relationship as it takes a toll on your mind, health and financial conditions. There are a lot of problems we face while dealing with toxic relationship.
    Story first published: Friday, March 30, 2018, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more