Just In
- 5 min ago
పంటి నొప్పిని త్వరగా తగ్గించుకోవడానికి ఉల్లిపాయ ముక్క
- 2 hrs ago
ఈ 5 రాశుల వారు చాలా హాట్ అండ్ గ్లామరస్ గా ఉంటారని మీకు తెలుసా?మరి ఇందులో మీ రాశి ఉందా?
- 4 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 26 నుండి జులై 2వ తేదీ వరకు..
- 6 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి..!
Don't Miss
- News
G7 summit: జర్మనీలో ప్రధాని మోడీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..కౌంటర్ టెర్రరిజం
- Sports
ఆ రోజు చచ్చిపోతా అనుకున్నా: హిమదాస్
- Finance
ఎస్బీఐ ఖాతాదారులకు మరో శుభవార్త, ఈ టోల్ ఫ్రీ నెంబర్తో మరిన్ని సేవలు
- Technology
SBI YONO యాప్లో లబ్ధిదారులను జోడించడం ఎలా?
- Automobiles
ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిన మ్యూజికల్ స్కూటర్.. జీవితం ఇలా రంగులమయం కావాలంటూ ట్వీట్..
- Movies
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్ధన్ ఫోర్ట్!
ఇంటర్ కెమిస్ట్రీ పరీక్ష రోజు చందు ముద్దుల్లో ముంచెత్తాడు.. అలా అవుతుందనేకోలేదు - My Story # 105
నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఇప్పుడు ఒక కంపెనీలో ఇంటర్న్ షిప్ కూడా చేస్తున్నాను. త్వరలో జాబ్ లో జాయిన్ అవ్వబోతున్నాను. కానీ నా జీవితంలో నేను మరిచిపోలేని జ్ఞాపకాలను.. నన్ను బాధించిన రోజులను ఇచ్చింది మాత్రం నా ఇంటర్మీడియట్ లైఫ్ మాత్రమే. నేను ఇంటర్ చదివే రోజులు నాకు ప్రతి రోజూ గుర్తొస్తాయి.

ఆ ఒక్క పరీక్ష రాస్తే
అప్పుడు నేను ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. ఆ రోజు కెమిస్ట్రీ పరీక్ష ఉంది. ఆ ఒక్క పరీక్ష రాస్తే ఇక ఇంటర్ లైఫ్ కు గుడ్ బై చెప్పినట్లే. నా ఫ్రెండ్స్ అందరికీ ఆ రోజు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని మనస్సులో ఉంది కానీ నాకు మాత్రం ఆ రోజు అలాగే కొన్ని యుగాల తరబడి నిలిచిపోయి ఉంటే మేలు అన్నట్లు అనిపించింది.

కాస్త ఆలస్యంగా లేచాను
ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్ష ఉంది. అయితే నేను అంతకు ముందు రోజు రాత్రి చాలా సేపు మెలకువతో ఉండడం, అలారం పెట్టుకోకపోవడం, ఇంట్లో అమ్మానాన్న కూడా లేపకపోవడంతో కాస్త ఆలస్యంగా లేచాను.

బస్ వెళ్లిపోయింది
నా ఎగ్జామ్ సెంటర్ కు మా ఊరికి 14 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే అప్పటికే మా ఊరి నుంచి బస్ వెళ్లిపోయింది. నేను బస్టాప్ దగ్గరకు వెళ్లి ఇంటికి వస్తుంటే బైక్ పై వెళ్తున్న చందు కనపడ్డాడు.

చందు బైక్ పై ఎక్కించుకున్నాడు
నన్ను చూసి వెంటనే బైక్ ఆపాడు. చందు మా క్లాస్ మేట్. బాగా చదువుతాడు. తను రోజూ బస్సులో రాకుండా బైక్ పై వచ్చేవాడు. బస్ మిస్ అయ్యిందా రాగిణి? బైక్ పై ఎక్కు నేను ఎగ్జామ్ సెంటర్ కే వెళ్తున్నానంటూ తన బైక్ పై ఎక్కించుకున్నాడు చందు.

చందు అంటే నాకు చాలా ప్రేమ
బస్ మిస్ అయినందుకు అంతకు ముందు చాలా బాధపడ్డా. కానీ చందు బైక్ ఎక్కాక మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే చందు అంటే నాకు చాలా ప్రేమ. అతన్ని నేను రెండేళ్లుగా సిన్సియర్ గా ఒన్ సైడ్ లవ్ చేస్తున్నాను. కానీ ఏ రోజు కూడా అతనితో డైరెక్ట్ గా చెప్పలేకపోయాను.

చాలా సైలెంట్
చందు అమ్మాయిలతో గౌరవంగా మాట్లాడతాడు. చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇవే నన్ను ఆకట్టుకున్నాయి. తనూ నన్ను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాడు. అతని కళ్లు నన్ను ప్రేమిస్తున్నాడని చెబుతూనే ఉంటాయి.

ఇబ్బంది పడుతాడని ..
బైక్ పై మేమిద్దరం వెళ్తుంటే నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. నా మనస్సులో మాటను చందుతో చెప్పాలనుకున్నాను. కానీ ఎగ్జామ్ కు వెళ్తున్నాం కాబట్టి ఈ టైమ్ లో డిస్ట్రబ్ చేస్తే పాపం మళ్లీ ఇబ్బంది పడుతాడని నేను చెప్పలేదు.

పర్సనల్ విషయం చెప్పాలి
అయితే ఎగ్జామ్ అయిపోయాక నీతో మాట్లాడాలి చందు అని చెప్పాను. అయితే ఆ మాట చెప్పేందుకు కూడా నాకు మొదట ధైర్యం చాలలేదు. ఏం మాట్లాడాలి అని అడిగాడు చందు. ఒక పర్సనల్ విషయం నీతో చెప్పాలి అని అన్నాను. ఒకే పరీక్ష పూర్తికాగానే కలుస్తాను అన్నాడు. పర్సనల్ విషయం చెప్పాలి.

ఏవేవో ఊహించుకున్నారు
కరెక్ట్ ఎగ్జామ్ టైమ్ కు నన్ను సెంటర్ దగ్గర డ్రాప్ చేశాడు చందు. దగ్గరికొచ్చి ఆల్‌దిబెస్ట్ అన్నాడు. నేను నీక్కూడా అన్నాను. మా ఫ్రెండ్స్.. మేము ఇద్దరం బైక్ పై రావడం చూసి ఏవేవో ఊహించుకున్నారు. ఇక ఒక అమ్మాయి నేరుగా అడిగింది.. ఏంటీ పక్కా ప్లాన్ చేసుకుని బస్ మిస్ చేసుకున్నావు కదా అంది. అదేమి లేదు ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పాను.

ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా
పరీక్ష ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని వెయిట్ చేశాను. త్వరత్వరగా పరీక్ష రాసేశాను. మొత్తానికి ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్ష పూర్తి అయిన తర్వాత ఏం చేయాలని నా ఫ్రెండ్స్ మొత్తం ఆలోచిస్తున్నారు. ఒకరు సినిమా అంటే... మరొకరు హోటల్ అంటున్నారు... ఇంకొందరేమో అందరం కలిసి పార్టీ చేసుకుందాం అంటున్నారు.

కన్పించకపోతే..
కానీ నా కళ్లు మాత్రం చందు కోసం ఎదురుచూస్తున్నాయి. పరీక్ష పూర్తవ్వగానే చందుకళ్లు కూడా నన్నే వెదుకుతాయని నాకు తెలుసు. నేను కన్పిస్తే అతను సంతోషంగా ఫీలవుతాడు. మరి కన్పించకపోతే ఏం చేస్తాడనిపించింది. చూద్దామని నా ఫ్రెండ్ పక్కన దాక్కున్నాను.

అతని చూపులు గాలిస్తున్నాయి
చందును ఈ రోజు ఎలాగైనా ఉడికించాలని కనపడకుండా ఉన్నాను. చందు నా కోసం చూస్తున్నాడు. అతని చూపులు ఎగ్జామ్ సెంటర్ ప్రాంతం అంతా గాలిస్తున్నాయి. ముఖం చిన్నబోయింది. అప్పుడు నేను కన్పించాను. ఇక అతను ఇంటర్ ఫలితాల్లో అతనే ఫస్ట్ వచ్చినంత ఆనందంగా నవ్వాడు.

కళ్లతోనే మాట్లాడాను
అతని కళ్లలో ఆనందం మెరిసిపోతుంది. నేను కూడా కళ్లతోనే మాట్లాడాను. పొంగిపోయాడు. ఎన్ని సార్లు మా ఇద్దరి చూపులూ ఢీకొన్నాయో... అన్ని సార్లు మా ముఖాలు వెలిగిపోయాయో తెలియదు.

పరీక్ష బాగా రాశావా?
చందుకు తెలుసు ఈ రోజు నేను తనకు ప్రపోజ్ చేస్తానని. అతని హృదయస్పందన నాకు వినిపిస్తున్నట్లుంది. చాలా సేపు నన్ను తదేకంగా చూశాక నా దగ్గరకు వచ్చాడు. పరీక్ష బాగా రాశావా అన్నాడు. బాగా రాశాను అన్నాను. మరి నువ్వు అన్నాను. నీ గురించే ఆలోచిస్తూ ఏమి రాయలేకపోయా అని జోక్ చేశాడు.

పార్క్ కు వెళ్లాం
ఇక నా ఫ్రెండ్స్ అందరూ వారివారి ప్లాన్ ప్రకారం ఒక్కోచోటికి వెళ్లిపోతున్నారు. నాకు పనుంది నేను రానని చెప్పేశాను. తనూ అలాగే తప్పించుకున్నాడు. ఇద్దరం ఒక పార్క్ దగ్గరకు వచ్చాం. ఏదో చెబుతానన్నావ్ కదా చెప్పు అన్నాడు.

నన్ను గట్టిగా హత్తుకున్నాడు
నీవు ఏదైతే ఆశిస్తున్నావో అదే చెబుతాను అన్నాను. మరి చెప్పు ఎందుకు ఆలస్యం అన్నాడు. నువ్వుంటే ఇష్టం.. నీతో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అన్నాను. వెంటనే నన్ను గట్టిగా హత్తుకున్నాడు. పార్క్ లో ఎవరూ లేరు. ఇద్దరం ముద్దుల్లో మునిగితేలాం.
నా మనసంతా సంతోషంతో నిండిపోయింది.

జీవితాంతం కలిసుందాం
ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకున్నాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. నేను రెండేళ్లుగా తనకు చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పాను. తను కూడా నన్ను ఎంతగా ప్రేమించేవాడో చెప్పాడు. ఇక నుంచి మనల్ని ఏ శక్తి విడదీయలేదు. ఇద్దరం జీవితాంతం కలిసుందాం అన్నాడు.

బైక్ పై బయల్దేరాడు
తర్వాత నేను బస్సులో ఊరికి వస్తానని చందుతో చెప్పాను. ఒకే అన్నాడు. తను బైక్ పై బయల్దేరాడు. చందు బైక్ ను బస్ ఢీకొనింది. యాక్సిడెంట్ లో చందు చనిపోయాడు. ఆ విషయం తెలియగానే గుండె ఆగిపోయినట్లయ్యింది. చందు మృతదేహం చూడడానికి వెళ్లాలన్నా నాకు ధైర్యం చాలలేదు.

ఇప్పటికీ ఎప్పటికీ అదే ప్రేమ
అంతకు కొన్ని నిమిషాల ముందు నాతో ఎన్నో కబుర్లు చెప్పిన చందు నాతో లేడనే వాస్తవాన్ని నేను నమ్మలేకపోయాను. తనంటే ఇప్పటికీ ఎప్పటికీ అదే ప్రేమ ఉంది. ఇదంతా నా ఇంటర్ లో జరిగింది.

జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి
ఇప్పటికీ ఐదేళ్లు అవుతోంది. అయినా చందు జ్ఞాపకాలు నా గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయి. ఇంటర్ పరీక్షలు జరిగే ప్రతిసారి నాకు నా చందు గుర్తొస్తాడు. నాది, చందుది కల్మశం లేని స్వార్థం లేని ప్రేమ. ఐ లవ్ యూ చందు... ఐ మిస్ యూ చందు.