Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
రిలేషన్ షిప్ గాయాల నుండి కోలుకోవడానికి ఈ టిప్స్ ను ట్రై చెయ్యండి..
మీరు మీ చీకటి ప్రపంచం నుండి బయటపడి ఆనందాన్ని స్వీకరించాలి. మీ ముఖానికి చిరునవ్వు తెచ్చే పనులు చేయాలి.
ప్రస్తుత సమాజంలో ఆనందం మరియు ప్రేమ కోసం ప్రజలు ఎంత దూరమైనా వెళుతున్నారు. కానీ వారి రిలేషన్ షిప్ లో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు లేదా మీ రిలేషన్ చెడ్డగా మారినప్పుడు పరిస్థితులు చాలా అధ్వానంగా మారతాయి. అలాంటి రిలేషన్ షిప్ ఏమిటంటే భాగస్వాములలో ఎవరైనా గ్యాస్ లైటర్ గా ఉండొచ్చు. ఇతర భాగస్వామి గ్యాస్ లైటర్ తో రిలేషన్ షిప్ లో ఉండటం వల్ల మీకు మానసికంగా అస్థిరంగా మరియు చాలా బాధాకరంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో బాధితులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అతని లేదా ఆమె గురించి పదే పదే అనుమానిస్తారు. ప్రారంభంలో వ్యక్తికి ఇలాంటి వాటి నుండి బయటపడటానికి నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. కానీ దీని నుండి బయటపడిన తర్వాత, ఎవరైతే బాధితులు ఉంటారో వారు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మానసికంగా స్థిరంగా ఉంటారు. కాలక్రమంలో మార్పుల వల్ల గ్యాస్ లైటింగ్ రిలేషన్ షిప్ వల్ల కలిగే గాయం నుండి తప్పకుండా కోలుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే కింద టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..

1) అన్నిరకాల పరిచయాలను అవాయిడ్ చేయండి..
మీరు గ్యాస్ లైటర్ తో సంబంధంలో ఉన్నందున, మీతో కమ్యూనికేట్ చేయడానికి గ్యాస్ లైటర్ కచ్చితంగా వివిధ మార్గాలను ఉపయోగిస్తారనే వాస్తవాన్ని మీరు అంగీకరించాలి. అందుకే గ్యాస్ లైటర్ నుండి ఎలాంటి కాల్స్, మెసేజ్ లు రాకుండా మీరు బలంగా ఉండాలి. మీరు ఆ వ్యక్తితో అన్ని రకాల పరిచయాలను తగ్గించుకోవాలి. మీరు అతని లేదా ఆమె మెయిల్ ఐడి మరియు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను బ్లాక్ చేయవచ్చు. అలాంటప్పుడే మీ ప్రవర్తనను గుర్తించి క్షమించండి అని మీకు తెలియజేసేందుకు గ్యాస్ లైటర్లు ప్రయత్నిస్తే కూడా మీరు మాత్రం తగ్గవద్దు. మీరు మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి.

2) మ్యానిప్యులేట్ చేయడంలో..
గ్యాస్ లైటర్ తో మీ రిలేషన్ షిప్ లో గొడవలు ఏర్పడిన అనంతరం, ఆ సంబంధం విచ్ఛిన్నం కావడం మీ సొంత తప్పు అనే మీరు భావిస్తారు. కానీ ఇది ఎప్పటికీ కాదు. ఇది మీ తప్పు కాదు కాబట్టి మీరు కఠినంగా ఉండకండి. అంతేకాక, గ్యాస్ లైటర్లు ఎల్లప్పుడూ వారి ఇష్టాలు మరియు ఇంకా కొన్ని రూల్స్ ప్రకారం మనలాంటి వారిని మ్యానిప్యులేట్ చేసే కళల్లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు.

3. అనుభవాల నుండి నేర్చుకోండి..
ఎవరో మిమ్మల్ని మార్చడానికి ముందే మీరే మీ గత అనుభవాల నుండి నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ నమ్మడానికి బదులుగా, మీరు మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అంతేకాక, మీ జీవితం పట్ల ఎవరికి బాధ్యత వహించే అవకాశం ఇవ్వొద్దు. లేదా నియంత్రించవద్దు.

4) విలాసవంతంగా ఉండండి..
మీరు నిజంగా బ్యాడ్ రిలేషన్ షిప్ నుండి కలిగిన గాయం వల్ల కోలుకోవాలనుకుంటే, మీరు తరచుగా మిమ్మల్ని విలాసపరచుకోవాలి. మీరు మీ చీకటి ప్రపంచం నుండి బయటపడి ఆనందాన్ని స్వీకరించాలి. మీ ముఖానికి చిరునవ్వు తెచ్చే పనులు చేయాలి. మీకు నిజంగా సంతోషం ఎక్కడ దొరుకుతుందో అటువంటి వాటి కోసం వెతకండి. షాపింగ్ కు వెళ్లండి లేదా స్నేహితులతో కలవండి. లేదా సినిమాలకు వెళ్లండి. లేదా మీ కోసం మీరే మంచి వంటను వండుకుని తినండి.

5) మీకు ఇష్టమైన వారితో మళ్లీ కనెక్ట్ కండి..
గ్యాస్ లైటర్లు వారి బాధితులను ఎల్లప్పుడూ వేరుచేయడానికి ఏవేవో పనులు చేస్తారు. దీంతో వారు వారిని నియంత్రించవచ్చు. లేదా మార్చవచ్చు. ఇలాంటి సంఘటనలు ఇదివరకే మీకు ఎదురై ఉండొచ్చు. కానీ, మీ గురించి నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తులతో మాత్రం మీరు తిరిగి కనెక్ట్ అవ్వొచ్చు. మీ మంచి స్నేహితులను పిలవండి. మీరు మీ జీవితం నుండి గ్యాస్ లైటర్ ను తొలగించినట్లు వారికి స్పష్టం చేయండి. మీ స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లండి. మీ కుటుంబాన్ని సందర్శించండి వారితో ఆనందంగా గడపండి. ఇలాంటివి మీరు భావోద్వేగ గాయం నుండి కోలుకోవడానికి కచ్చితంగా మీకు సహాయం చేస్తుంది.

6) సలహాదారుల సహయం తీసుకోండి..
మీరు ఇలాంటి బ్యాడ్ సిట్చువేషన్స్ నుండి బయటపడేందుకు ఎవరైనా పరిణతి చెందినటువంటి వంటి వారి సలహాదారుల అవసరం అని మీరు భావిస్తే తప్పకుండా వారి సహాయం తీసుకోండి. ఇందులో ఏ మాత్రం మోహమాటం పడకండి. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరియు మీ ఆత్మగౌరవాన్ని పునర్నిర్మించుకునేందుకు సలహాదారుడు కచ్చితంగా మీకు సహాయం చేస్తారు. మీ జీవితాన్ని తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడానికి కౌన్సిలర్ మీకు మద్దతు మరియు సలహా ఇస్తాడు. గ్యాస్ లైటర్లు వారి బాధితుడిని తీవ్రస్థాయికి మార్చగలవు. కొన్నిసార్లు పిచ్చివారిగా కూడా చేయగలవు. కాబట్టి రిలేషన్ షిప్ లో గ్యాస్ లైటింగ్ నుండి కోలుకోవడం అంత సులభం కాదు. కానీ సరైన ప్రయత్నం మరియు సలహాదారుల మద్దతుతో చెల్లాచెదురైన మన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవచ్చు. మరోసారి ప్రశాంతంగా, ఆనందంగా జీవించవచ్చు.



Click it and Unblock the Notifications