లేడీ బాస్ కంటే మెన్ బాస్ అయితేనే బెటర్ అనడానికి కారణాలు..!!

By Lekhaka
Subscribe to Boldsky

ఈ కార్పోరేట్ యుగంలో, మీరు ఆడ, మగ అధికారులను చూసే ఉంటారు. పూర్వకాలంలో కాకుండా, పురుష అధికారులు చాలా తగ్గిపోయారు. కానే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ పురుషాధికారుల ప్రాముఖ్యత లేదా పురుష ఆధిపత్యం నడుస్తూనే ఉంది.

ఒక అధ్యయనంలో, ఇప్పటికీ స్త్రీ అధికారుల కంటే పురుషాధికారులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండడం, ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది స్త్రీలు వారి వ్యక్తిగత వత్తిడులు, అననుకూల సమస్యలతో ఉన్నట్టు నిర్ధారించబడింది.

ఉద్యోగస్తులు పురుషుడినే మేనేజర్ లేదా అధికారిగా ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలలోని పురుషులు, స్త్రీలు ఇద్దరూ పురుషాధికారులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు.

కేవలం ఇండియాలో మాత్రమే, కొంతమంది స్త్రీ ఉద్యోగినులు ఆడ అధికారులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. పురుషాధికారుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు అనుభవం ఉన్న ఉద్యోగస్తులు చెప్తారు. అంతేకాకుండా పురుషాధికారులలో ఉన్న కొన్ని లక్షణాలు స్త్రీ అధికరిలోని లక్షణాల కంటే ఎక్కువ అంగీకరించేట్టు ఉంటాయని చెప్తారు.

ఈ ఆర్టికిల్ లో, పురుషాధికారుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనేదాని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం.

నేరుగా మాట్లాడడం:

నేరుగా మాట్లాడడం:

నేరుగా మాట్లాడడం అనేది పురుషాధికారుల వల్ల కలిగే అనేక ప్రయోజనలలో ఒకటి. స్త్రీ, పురుషులు ఇద్దరిలో, ఎక్కువమంది ఉద్యోగస్తులు, పురుషాధికారులు ‘విషయానికి రండి' అనే వైఖరిని కలిగి ఉంటారని వ్యక్తం చేసారు. దానివల్ల పని చాలా తెలికైపోతుందని వారు అంటారు. అనుకూల లక్షణాలు కలిగిన పురుషాదికారితో పొద చుట్టూ మాటు వేయాల్సిన అవసరం లేదు.

కార్యాలయంలో వ్యక్తిగత జీవితం ఉండదు:

కార్యాలయంలో వ్యక్తిగత జీవితం ఉండదు:

చాలామంది పురుషాధికారులు వారి వ్యక్తిగత విషయాలను లేదా సమస్యలను ఇంటిదగ్గరే వదిలేసి కార్యాలయానికి వస్తారు. అందువల్ల, కార్యాలయంలో వ్యక్తిగత విషయాలని తావు ఉండదు. ఒకవేళ అధికారి తన వ్యక్తిగత జీవితాన్ని కార్యాలయానికి తెస్తే, అది కార్యాలయ మొత్తం వాతావరణ౦పై ప్రభావం పడుతుంది.

మనసు స్థిరంగా ఉండడం:

మనసు స్థిరంగా ఉండడం:

స్త్రీ అధికరిలా కాకుండా, పురుషాధికారులలో మనసు మారడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీ అధికారులతో పనిచేసేవారు పురుషాధికారితో పనిచేయాలి అనుకుంటారు. అందుకు ప్రధాన కారణాలలో ఒకటి మనసు మారుతూ ఉండడం. మనసు మారకుండా ఉంటే, పురుషాధికారులు కూడా కార్యాలయ రాజకీయాలతో ప్రమేయం లేకుండా ప్రయత్నం చేయాలి. వారు నిష్పక్షపాతంగా, సరైన పద్ధతిలో సమస్యలను చక్కబరిచి, ఉద్యోగస్తులకు మంచి పరిష్కారాలను అందిస్తారు.

ప్రమాదం గురించి భయపడఖ్ఖరలేదు:

ప్రమాదం గురించి భయపడఖ్ఖరలేదు:

తోటి ఉద్యోగులు లేదా వారికంటే చిన్నవారు బాగా పనిచేస్తుంది, పురుషాధికారులు సాధారణంగా ప్రమాదం ఉందని బాధపడరు. ఇది కూడా పురుషాధికారి వల్ల ఉపయోగం లేదా ప్రయోజనం అని భావించవచ్చు. మీ సామర్ధ్యం లేదా పనితనం సరైన మార్గంలో సరైన సమయం వద్ద ప్రశంసించబడుతుంది. దీనివల్ల వారి ఆత్మగౌరవం పెరిగి, మరింత పని పెరిగే అవకాశం ఉంది.

మరింత శక్తివంతం:

మరింత శక్తివంతం:

అధికారులలో లేదా మేనేజర్లలో చాలామంది మనకు చాలా చురుకుగా కనిపిస్తారు. వారి వైఖరి, భాష, నడవడిక స్త్రీ అధికారి; కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. ఒక సర్వేలో, అధికారి పురుషుడైతే, వారి శక్తివంతమైన పనుల పట్ల గౌరవం, భయం కలుగుతాయని దాదాపు 68 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. ఇది కంపెనీ ఎదుగుదలకు అలాగే ఉద్యోగస్తుల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి బాగా సహాయపడుతుంది.

మరింత తార్కికంగా ఉండడం:

మరింత తార్కికంగా ఉండడం:

పురుషాధికారులు తరచుగా భావోద్వేగాలకు లోనుకారు. ఇది ఖచ్చితంగా పని వాతావరణంలో ప్రయోజనాలను ఇస్తుంది, ఈ తార్కికం మంచి ఉత్పత్తిని కూడా ఇస్తుంది. పురుషాధికారి సాధారణంగా పని పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయంతో స్పష్టమైన సూచనలను ఇస్తాడు. ఇది ఉద్యోగస్తులను చాలా ప్రభావితం చేస్తుంది.

తక్కువ సూక్ష్మ నిర్వహణ:

తక్కువ సూక్ష్మ నిర్వహణ:

స్త్రీ అధికారితో పోలిస్తే పురుషాధికారిలో సూక్ష్మ నిర్వహణ తక్కువగా ఉంటుంది. సూక్ష్మ నిర్వహణ అనేది ప్రతికూల వాతావరణాన్ని కలుగచేస్తుంది, దానివల్ల ఉద్యోగస్తులు ఒత్తిడికి, ప్రెజర్ కి లోనవుతారు. పురుషాధికారులు సరైన సమయంలో పనికాకుండా ఎక్కువసేపు పట్టినా కలుగచేసుకోకుండా ఉద్యోగస్తులను స్వేచ్చగా వదిలేస్తారు.

పురుషాధికారులతో పనిచేయడానికి ఇష్టపడేవారిలో మీరు కూడా ఒకరా? అయితే, మీ అనుభవాలను మాతో పంచుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Are There Any Benefits Of Having A Male Boss

    Only in India, certain women employees prefer female bosses. Experienced employees say that there are many benefits of having a male boss. And they also say that certain characteristics of a male boss are more acceptable than a female boss.
    Story first published: Wednesday, November 30, 2016, 22:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more