For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి ప్రస్థావన రాగానే ఇండియన్ గర్ల్స్ చెప్పే తెలివైన సాకులు..!

By Super Admin
|

భారతీయ స్త్రీలు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు కదా.వద్దని అనుకోరు కదా.కానీ తాజా అధ్యయనాలు,వివాహ వయసు వచ్చిన యువతులు వివాహాన్ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నాయి.వివాహం చేసుకోవడం కంటే జీవితంలో మెరుగైనవి చాలా ఉన్నాయని వీరు విశ్వసించడమే ఈ వాయిదాకి కారణం.ఇలాంటి వారే తమకి కెరీర్ ముఖ్యం తమకి కావున పెళ్ళి చేసుకుని అతని డబ్బుల మీద జీవించే బదులు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకుంటున్నారు.

తాము తమ కాళ్ళ మీద నిలబడ్డాము, ఏమైనా చెయ్యాలనుకుంటే భాగస్వామి యొక్క ఆమోదం తీసుకోనవసరం లేని స్థాయికి వచ్చాము అనుకున్నాకే స్త్రీలు వివాహానికి పచ్చ జండా ఊపుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి.ఇంకొంతమందేమో చాలా డబ్బులని కూడబెట్టి,ప్రపంచం చుట్టి వచ్చాకే పెళ్ళి అంటున్నారు.అంటే స్త్రీల మనసుల్లో కేవలం వివాహం చేసుకుంటే చాలు అన్న ఆలోచన లేదు.

భారతీయ స్త్రీల ఆలోచనల్లో ధృక్పధంలో చాలా మార్పొచ్చింది.అందువల్ల వివాహ విషయంలో కూడా వారి ఆలోచన మారింది.స్త్రీలకి వివాహ వయసు ముప్ఫై ఏళ్ళు లేదా అంతకు పైబడింది.ఆ వయస్సులో వివాహం చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది కూడా.

ఇంట్లో పెళ్ళి పేరెత్తగానే ఈ కాలం యువతులు చూపించే సాకులని క్రింద ఇచ్చాము చూడండి.ఈ ప్రసక్తి రాగానే క్రింద పేర్కొన్న ఏదో ఒక కారణాన్ని చూపించే ఆడపిల్లలలో మీరూ ఒకరైతే కనుక కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి సుమా.

1)నేనింకా చదువుకోవాలి:

1)నేనింకా చదువుకోవాలి:

ఇంట్లో పెళ్ళి పేరెత్తగానే పెళ్ళి అప్పుడే చేసుకోకూడదనుకునే ప్రతీ అమ్మాయీ చూపించే కారణం చదువు.తానింకా పెద్ద చదువులు చదవాలనుకుంటోందని చెప్పి పెళ్ళి విషయాన్ని దాటేస్తుంది.

2)ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ మీదే:

2)ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ మీదే:

ఈరోజుల్లో భారతీయ స్త్రీలు చాల మాంది కెరీర్లో దూసుకుపోతున్నారు. అందువల్ల ఒక స్థాయికి చేరుకున్నాకే పెళ్ళి అని వీళ్ళు అనుకుంటున్నారు.

3)నాకు వంట చేత కాదు

3)నాకు వంట చేత కాదు

పెళ్ళి పేరెత్తగానే అమ్మాయిలు చెప్పే మరొక సాకు వంట రాదు అని. నాకు వంట రాదు, కుకింగ్ క్లాసులకి వెళ్ళాలి అని మీ కూతురు చెప్పడం మీరు వినే ఉంటారు కదూ??

4)ఇంకా నా మాజీ ప్రియిడినే ప్రేమిస్తున్నాను

4)ఇంకా నా మాజీ ప్రియిడినే ప్రేమిస్తున్నాను

ఇంకొకరితో ప్రేమలో ఉన్న అమ్మాయినీ ఏ అబ్బాయీ వివాహం చేసుకోవాలనుకోడు.నేనింకా నా మాజీ ప్రియుడిని మర్చిపోలేదు అని చెప్తుంటారు వివాహ ప్రసక్తి రాగానే చాలా మంది ఆడపిల్లలు.

5)నా కాళ్ళ మీద నేను నిలబడాలి:

5)నా కాళ్ళ మీద నేను నిలబడాలి:

ఇది వినడానికి సబబుగానే ఉన్నా కూడా ఇది చాలా తెలివైన సాకు. ఎందుకంటే పెళ్ళి వద్దనుకునే అమ్మాయిలందరూ ఈరోజుల్లో ఇదే సాకు చెప్తున్నారు ఆ సంగతి ఎత్తగానే.

6)అక్క/అన్నయ్యల పెళ్ళి అయ్యాకే నా పెళ్ళి:

6)అక్క/అన్నయ్యల పెళ్ళి అయ్యాకే నా పెళ్ళి:

ఇంట్లో పెళ్ళి విషయం ఎత్తగానే ఇంకా పెళ్ళి కాని అన్నయ్యనో అక్కనో చూపించి వాళ్ల తరువాతే నా పెళ్ళి అనడం మీరు వినే ఉంటారు కదా.

7)నాకు తగిన వ్యక్తి తారసపడలేదు:

7)నాకు తగిన వ్యక్తి తారసపడలేదు:

లవ్ మ్యారేజీలని బలంగా విశ్వసించే చాలా మంది అమ్మాయిలు పెళ్ళికి పచ్చ జండా ఊపే ముందు తమకి నచ్చిన వ్యక్తి కోసం అన్వేషిస్తుంతారు. అప్పటి వరకూ వీళ్ళు పెళ్ళి ప్రస్తావన తెస్తే తగిన వ్యక్తి తారసపడలేదని చెప్పి వాయిదా వేస్తుంటారు.

English summary

Intelligent Excuses Indian Women Make To Avoid Marriage Talks

These are the women who think that life is much better off than getting married and settling down. These are the very same women who also prefer to think first about their career and making a life than wanting to marry a man and live off his money. Statistics show that most women prefer to get married once they know they are independent and can do things without the approval of a man.
Desktop Bottom Promotion