For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలడిగితే కోపం వస్తుంది జాగ్రత్త...!

|

హాయ్ ..! మీ బరువెంతండీ..? చెప్పరా? పర్వాలేదు . మీ వయస్సైనా చెప్పండి?అదీ కుదరదా? పోనీ మీ బాయ్ ఫ్రెండ్ పేరు? ఆగండాగండి. మొహం అలా చిరగ్గా పెట్టకండి ..మీకు కోపం వస్తోందని మాకు అర్ధమైనది. మీకో విషయం తెలుసా? ఏ విషయమైనా అలవోకగా మాట్లాడేసే మనకు అదేనండీ...ఆడవాళ్లకు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం విపరీతమైన కోపమొచ్చేస్తుందట. ఇంతకీ ఏంటా ప్రశ్నలంటూ అలా కోపంగా చూడబాకండే....ఆ విషయానికే వస్తున్నాం...

ఇంత అందంగా ఉన్నావు,! ఇంకా పెళ్లెందుకు కాలేదు?

ఇంత అందంగా ఉన్నావు,! ఇంకా పెళ్లెందుకు కాలేదు?

ఈ ప్రశ్న అడిగారంటే మీరైపోయారన్నమాటే..! ఏ... అందంగా ఉన్నంతమాత్రన త్వరగా పెళ్లి చేసుకోవాలా? అదేమైనా రూలా? అన్న ప్రశ్న ఎదుటివారి నుంచి ఠక్కున దూసుకొస్తుంది. అవునండీ పెళ్లికానీ అమమాయిలకు ఈ ప్రశ్నంటే చాలా చిరాకు. ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలు తాము మంచి పొజిషన్ కు వచ్చే వరకూ పెళ్లి గురించి ఆలోచించమని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. దానికి తోడు అబ్బాయి వాళ్ల మనసుకు నచ్చి, వాళ్ల పొజిషన్ కు తగ్గట్టుగా ఉంటేనే ‘ఎస్’ అని చెబుతున్నారు. కాబట్టి, అమ్మాయిల పెళ్లి గురించి అడిగేటప్పుడు కాస్త ఆలోచించి మరీ అడగడం మంచిది.

గుడ్ న్యూస్ ఎప్పుడు?

గుడ్ న్యూస్ ఎప్పుడు?

పెళ్లికాని వారినైనా, పెళ్లైన వారినైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నల్లో ఇది ఒకటి. పెళ్లికానీ అమ్మాయిలు చెప్పే గుడ్ న్యూస్ వాళ్ల పెళ్లి గురించైతే , పెళ్లైన తర్వత వాళ్లు చెప్పేది పిల్లల గురించి. కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కెరీర్ లో సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ, పిల్లల కోసం కాస్త సమయం తీసుకుంటున్నారు. అయినా ఈ రెండూ వాళ్ల పర్సనల్ జీవితానికి సంబంధించినవి. సాధారణంగా అమ్మాయిలు తమ పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు,. అందుకే ఈ విషయాలు ఎత్తకపోవడమే మంచిది.

మీరు చాలా లక్కీ:

మీరు చాలా లక్కీ:

కష్టపడి ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకున్నవారిలో, లేక వ్యాపారంలో సెక్సెస్ సాధించిన వారినో‘చాలా లక్కీ’ అంటూ మనం పొగిడేస్తుంటాము. కానీ ఒక్కోసారి వారికి కోపం తెప్పించే అవకాశముంది. ఎందుకంటే ఆ స్థానానికి చేరుకోవడానికి వాళ్లెంతో శ్రమపడి ఉంటారు. కానీ మనం ‘లక్కీ’ అంటూ పెద్దగా మీ శ్రమేమీ లేదు కేవలం లక్ వల్లే ఈ స్థానానికి చేరుకున్నారని చెప్పడం వాళ్లకు ఇష్టముండకపోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఏ మహిళకైనా తన ప్రతిభను, తను చేసే మంచి పనులను నలుగురూ గుర్తించి మెచ్చుకోవాలని ఉంటుంది. అలాంటిది ఇక చేసిన పనిని కూడా చేయలేదంటే కోపం రావడం సహజం..

మీ డ్రస్సేంటి ఇలా ఉంది..?

మీ డ్రస్సేంటి ఇలా ఉంది..?

జాగ్రత్తండోయ్...ఈ ప్రశ్న అడిగారా...ఎందుటివారు మిమ్మల్ని నమిలి మింగేసేలా చూసే అవకాశం ఉంది. తమ డ్రస్సింగ్ స్టైల్ బాగుంటుందని, అందులో లోపాలు లేవని, ఎలాంటి మార్పులు అవసరం లేదని ప్రతి మహిళ భావిస్తుంది.అందుకే అందులో మార్పులను సజెస్ట్ చేస్తే అవి మంచికే అయినా వాళ్లకది నచ్చదట, దీని బదులు ఇంకా బాగా డ్రస్ చేసుకునే పద్దతి చెబుతానంటూ వివరిస్తే మంచిది.

ఫలానా అబ్బాయిని కలిసి మాట్లాడు:

ఫలానా అబ్బాయిని కలిసి మాట్లాడు:

ఇది కూడా చిరాకు తెప్పించే మాటే...! పెళ్లి విషయంలో తమకన్నీ తెలుసన్నది అమ్మాయిల ఫీలింగ్. ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్లకు తెలుసని వాళ్లు భావిస్తారు,. పెళ్లి విషయంలో తమ ఇష్టప్రకారం వ్యవహరించాలని కోరుకుంటారు. అందుకే మాటిమాటికీ పెళ్లి చూపుల పేరుతో వీళ్లను కలుస్తావా? వాళ్లతో మాట్లాడుతావా ? అంటూ ఇబ్బంది పెట్టడం మానేయండి..

నీ గురించి కాస్త ఆలోచించుకో..

నీ గురించి కాస్త ఆలోచించుకో..

ఇలా మాట్లాడరంటే మీ సంభాషణకు బ్రేక్ పడినట్లే లెక్క తన గురించి తన కంటే ఎక్కువ ఇంకెవరికీ తెలీదని ప్రతి మహిళా భావిస్తుంది. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు, చేయాల్సిన పనులు ఇలా అన్ని విషయాల పైనా వాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. లక్ష్యానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు చాలామంది. అందుకే నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటే వాళ్లకు కోపమొచ్చే అవకాశాలుంటాయి.

నీ శక్తికి తగినట్లుగా నువ్వు ప్రయత్నించడం లేదు

నీ శక్తికి తగినట్లుగా నువ్వు ప్రయత్నించడం లేదు

తన శక్తిఏంటో, తను ఎంత మేరకు పనిచేస్తోందో ప్రతి మహిళకూ అవగాహన ఉంటుంది. పూర్తి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినప్పుడు కూడా నువ్వు పూర్తిగా ప్రయత్నించడం లేదంటే కోపం రావడం సహజం. ఒకవేళ శక్తి మేరకు పనిచేయకపోయినా, చాలా మంది దాన్ని ఓప్పుకునే స్థితిలో ఉండరు. అలాంటప్పుడు వాళ్లకు కోపం వస్తుంది, అందుకే ఇలా చెప్పడానికి బదులు ‘మీ పనితీరు బాగుంది దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలంటే ఈ సూచనలు పాటించండిై’అంటూ వివరిస్తే బాగుంటుంది.

ఇవండి మహిళలకు ఎక్కువ కోపం తెచ్చించే అంశాలు.

ఇవండి మహిళలకు ఎక్కువ కోపం తెచ్చించే అంశాలు.

ఇవండి మహిళలకు ఎక్కువ కోపం తెచ్చించే అంశాలు. ఇలాంటి ప్రశ్నలడిగితే మీకు కోపం వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఒక వేళ మీకు కోపమొస్తే, ఎదుటివాళ్లకీ వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించండి. ఎదుటివాళ్లతో మాట్లడేటప్పుడు సంబాషణల్లో ఇలాంటి ప్రశ్నలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

English summary

Questions You Should NEVER Ask Your Girl friend ...!

Questions You Should NEVER Ask Your Girl friend ...!Here to save you from a ravaged relationship and social suicide are questions you should never ask your girlfriend. Some of these questions may not seem like a big deal, trust me; you’ll thank me for this later:
Story first published: Friday, July 8, 2016, 18:00 [IST]
Desktop Bottom Promotion