ఈర్ష్యాసూయ‌లు క‌లిగిన వ్య‌క్తులు చేసే 5 పొర‌పాట్లివే!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

ఈర్ష్య చూపించ‌డం ద్వారా త‌మ భాగ‌స్వామిని తాము ఎంత‌గా ప్రేమిస్తున్నామ‌నే విష‌యాన్ని వ్య‌క్త‌ప‌ర్చాల‌నుకుంటారు కొంద‌రు. ఐతే ఈర్ష్య అనేది కొన్ని సార్లు ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

మ‌నంద‌రం ఏదో ఒక స‌మ‌యంలో ఈర్ష్య ప‌డే ఉంటాం. చిన్నప్పుడు మ‌న త‌మ్ముడినో, చెల్లిలినో మ‌న త‌ల్లిదండ్రులు ఎక్కువ‌గా ప్రేమ కురిపిస్తుంటే ఈర్ష్య చూపించేవాళ్లం.

ఈర్ష్య అనేది సాధార‌ణంగా ప్రేమ‌, రొమాన్స్ సంద‌ర్భాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఈర్ష్య చూపిస్తున్నారంటే మీరు అత‌డ్ని ప్రేమిస్తున్నార‌ని అర్థం వ‌స్తుంది.

ఈర్ష్య అనేది సాధార‌ణమైన విష‌య‌మే అయినా కొన్ని సంద‌ర్భాల్లో అది త‌ప్పుల‌ను చేయిస్తుంది. సంబంధంలో ఉన్న‌వారికి ఇది ఎంత‌మాత్రం త‌గ‌దు. అలాంటి పొర‌పాట్లేమిటో తెలుసుకోవాల‌నుకుంటున్నారా... అయితే చ‌ద‌వండి మ‌రి...

1. భాగ‌స్వామిని నియంత్రించాల‌నుకుంటారు...

1. భాగ‌స్వామిని నియంత్రించాల‌నుకుంటారు...

అసూయ‌తో ర‌గిలిపోయేవారు అభ‌ద్ర‌తా భావంతో ఉంటారు. తమ భాగ‌స్వామిని ఎప్పుడూ త‌మ అదుపాజ్ఞ‌ల‌లో ఉంచుకోవాల‌నుకుంటారు. ఇత‌రులు మీ భాగ‌స్వామిని చూడ‌టాన్ని స‌హించ‌లేరు. దీని వ‌ల్ల మీ భాగ‌స్వామి చాలా డిప్రెస్డ్‌గా మారిపోగ‌ల‌డు. అనుబంధంలో కాస్త ఒంట‌రిత‌నాన్ని కోరుకుంటాడు. ఇది క‌చ్చితంగా ఈర్ష్య చూపించేవారికి ఇబ్బంది క‌లిగిస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల తొంద‌ర్లోనే బ్రేక‌ప్ చెప్పాల‌నే నిర్ణ‌యానికొచ్చేస్తారు. ఐతే అసూయ చూపించే వ్య‌క్తుల‌కు త‌మ గురించి త‌ప్ప ఇత‌రుల గురించి ఏమాత్రం ప‌ట్ట‌దు.

2. తాము చూసిందే నిజ‌మ‌నుకుంటారు...

2. తాము చూసిందే నిజ‌మ‌నుకుంటారు...

అసూయ‌తో ఉన్న‌వారికి పిగ్‌మేలియ‌న్ ఎఫెక్ట్ ప్ర‌భావం ఉంటుంది. అంటే తామేం న‌మ్ముతామో అదే జ‌రిగి తీరుతుంద‌ని, తాము చూసిందే నిజ‌మ‌ని విశ్వసిస్తారు. త‌మ భాగ‌స్వామి ఎవ‌రితో మాట్లాడినా స‌రే త‌మ‌ను మోసం చేసిన‌ట్టుగానే అనుకుంటారు. ఇలా చిన్న విష‌యంలో దొరికినా స‌రే త‌మ‌ను ప్రేమించ‌డం లేద‌ని అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు భాగ‌స్వామిపై వేస్తారు. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన‌వారు త‌మ సంబంధాన్ని సులువుగా తెంపేసుకుంటారు.

3. స‌హాయం తీసుకునేందుకు త‌టప‌టాయిస్తారు...

3. స‌హాయం తీసుకునేందుకు త‌టప‌టాయిస్తారు...

ఈర్ష్య క‌లిగిన వ్య‌క్తులు త‌మ‌ను తాము నార్మ‌ల్‌గా ఉన్నామ‌నుకుంటారు. భాగ‌స్వామిపై ఎన‌లేని ప్రేమ‌ను చూపిస్తున్నామ‌నుకుంటారు. అందుకే త‌మ‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా అది భాగ‌స్వామితో పంచుకోరు. స‌హాయం పొందితే ఎక్క‌డ త‌మ అనుబంధం బ‌ల‌హీన‌ప‌డుతుందో అనే అపోహ‌లో ఉంటారు.

వాస్త‌వానికి ఇలా ఒక‌రికొక‌రు స‌హాయ‌ప‌డుతుంటేనే బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. అసూయాద్వేషాలు మ‌టుమాయ‌మైపోతాయి. ఇద్ద‌రి మ‌ధ్య సంప్ర‌దింపులు, ఇచ్చిపుచ్చుకోవడాలు త‌ర‌చూ జ‌ర‌గడం మంచిది.

4. రాత్రికి రాత్రే పోదు...

4. రాత్రికి రాత్రే పోదు...

అసూయ ఉన్న భాగ‌స్వామి తాను మార‌తాన‌ని చెప్ప‌డం ఆ ఒక్క సంద‌ర్భానికే ప‌రిమిత‌మ‌వుతుంది. నిజం చెప్పాలంటే అసూయ అనేది కొన‌సాగుతూనే ఉంటుంది. నిపుణులే దీనికి ప‌రిష్కారం చూపించాలి. ఈర్ష్య క‌లిగిన వారు ఎన్నో వాగ్దానాల‌ను చేస్తారు. తాము మామూలు స్థితికి చేరుకున్నామ‌ని న‌మ్మిస్తారు. ఐతే ఎప్పుడూ వాళ్ల‌ని ఓ కంట క‌నిపెడుతూనే ఉండాలి. ఇది రాత్రికి రాత్రే పోయే జ‌బ్బు కాదు సుదీర్ఘ‌కాలం పాటు కొన‌సాగుతుంది. వారిలో ఉన్న అభ‌ద్ర‌త భావాలు తొల‌గిన‌ప్పుడే మామూలు స్థితికి వ‌స్తారు.

5. ఒక్క‌సారిగా కోపోద్రిక్తుల‌వుతారు

5. ఒక్క‌సారిగా కోపోద్రిక్తుల‌వుతారు

అసూయ క‌లిగిన వ్య‌క్తులు ఎప్పుడూ మూడీగా ఉంటారు. వాళ్ల భాగ‌స్వామికి సంబంధించిన ఏ చిన్న విష‌యం క‌నుగొన్నా ఈర్ష్య‌తో ర‌గిలిపోయి కోపోద్రిక్తుల‌వుతారు. అప్ప‌టిక‌ప్పుడే అది బ‌య‌ట‌ప‌డుతుంది. అప్ప‌టి దాకా లోలోప‌ల అణుచుకున్న కోప‌మంతా ఒక్కసారే బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కేస్తారు. మీ భాగ‌స్వామి ఏం జ‌రుగుతుందో ఇంత చిన్న‌దానికి అంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాకుండా ఉండిపోతాడు. అక్క‌డ ప‌రిస్థితి మ‌రీ దిగ‌జారిపోతుంది. కాబ‌ట్టి అసూయ‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌డం మంచిది.

English summary

5 Mistakes that Jealous People Make

Many people think that they’re just showing their partner how much they love them by being jealous. However, there are certain types of jealousy that are very negative.