ద‌గ్గ‌ర్లో పెళ్లి పెట్టుకోలేదు! ఐనా బ్యాచిల‌ర్స్ పార్టీ చేసుకునేందుకు 7 కార‌ణాలు

By: sujeeth kumar
Subscribe to Boldsky

పెళ్లికి కొద్ది రోజుల ముందుగా చేసుకునేది బ్యాచిల‌ర్స్ పార్టీ. ఎవ‌రు చెప్పారు పెళ్లికి కొద్ది రోజుల ముందే చేసుకోవాల‌ని. ఇటీవ‌ల ముగ్గురు అమ్మాయిలు త‌మ బ్యాచిల‌ర్ పార్టీలో భాగంగా ఒక స్పెష‌ల్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకొని వెళ్లారు. ఇందులో వింతేముంది అంటారా? వాళ్లెక‌వ‌రికీ ఇప్ప‌ట్లో పెళ్లి ఫిక్స్ కాలేదు. అవును మీరు చ‌దివింది నిజ‌మే! మ‌రి బ్యాచిల‌ర్స్ పార్టీ అంటారేమిటి అని అంటారా? వాళ్లు అలాగే అనుకుంటున్నారు. మ‌న‌మూ అలాగే భావించి అలాంటి పార్టీల‌ను చేసుకుందామా మ‌రి.

1. సింగిల్‌గా ఉన్న ఆనంద‌పు వేడుక‌

1. సింగిల్‌గా ఉన్న ఆనంద‌పు వేడుక‌

బ్యాచిల‌ర్స్ పార్టీ జ‌రుపుకోవాలంటే మ‌నం వివాహ‌ బంధంలోకి వెళ్లే ముందు జ‌రుపుకునే వేడుక‌. అయితే క‌చ్చితంగా పెళ్లికి కొన్ని రోజుల ముందు లేదా బాయ్‌ఫ్రెండ్ ఉండి అత‌డితో వివాహం చేసుకుంటాను అని తెలిసిన త‌ర్వాతే బ్యాచిల‌ర్ పార్టీ చేసుకోవాల‌నే నిబంధ‌న ఎక్క‌డా లేదు. మ‌న సింగిల్ సోలో లైఫ్ ను జాలీగా గ‌డిపేందుకే ఈ పార్టీలు.

2. భాగ‌స్వామి ఉండాల‌నే నియ‌మం లేదు

2. భాగ‌స్వామి ఉండాల‌నే నియ‌మం లేదు

మీ జీవితంలో ఎవ‌రైనా స్పెష‌ల్ వ్య‌క్తి ఉంటే గ్రేట్‌! వాళ్లు లేక‌పోతే ఎంజాయి చేయొద్దు అని ఎక్క‌డా రాసిపెట్ట‌లేదు. ఒక వేళ మీకంటూ ఎవ‌రైనా భాగ‌స్వామి ఉన్నా లేక‌పోయినా ఇప్ప‌టికి మాత్రం సింగిల్‌గా ఊహించుకొని మీతో మీరు డేటింగ్ చేసుకునేట్టుగా ఊహించండి. మిమ్మ‌ల్ని మీరు త‌ప్ప ఇంకెవ‌రు ఎక్కువ‌గా ప్రేమిస్తారు చెప్పండి.

3. వినోద వేడుక‌ల్లో ఓలలాడండి

3. వినోద వేడుక‌ల్లో ఓలలాడండి

మీ స్నేహితురాళ్ల‌తో క‌లిసి దోబూచులాడుకునేందుకు ఈ పార్టీ ట్రిప్ స‌రైన సంద‌ర్భం. స్పెష‌ల్ ట్రిప్ కోసం ప్లాన్ వేసేది కాకుండా రాత్రులు మంచి డ్రెస్‌లు వేసుకొని త‌యార‌వ్వ‌డం, క‌ల‌సి సెలూన్‌కు వెళ్ల‌డం, డ్యాన్స్ చేయ‌డం, గాసిప్స్ మాట్లాడుకోవ‌టాలు లాంటివి చేస్తే మ‌ర‌చిపోలేని మ‌ధుర జ్నాప‌కాల‌ను మిగిలిస్తుంది. మీ బెస్టీకి స్పెష‌ల్ బ్యాగ్ త‌యారుచేసి అందులో లిప్‌బామ్‌, నెయిల్ పేయింట్‌, యాక్సెస‌రీలు లాంటివి వేస్తే ఆమె సంతోషంతో ఉబ్బిత‌బ్బియిపోతుంది.

4. పెళ్లికి ఏం కావాలో..

4. పెళ్లికి ఏం కావాలో..

పెళ్లి ఎప్పుడో భ‌విష్య‌త్‌లో చేసుకుంటారు స‌రే. ఈ లోపు మీ స్నేహితురాళ్ల‌ను స‌ర్‌ప్రైజ్ చేసేలా వాళ్ల‌కు మంచి గిఫ్ట్‌లు ఇవ్వండి. అద్భుత‌మైన ఫ్రాక్‌, లేదా సెక్సీ లింగ‌రీని బ‌హుక‌రిస్తే శోభ‌నం రోజు రాత్రి మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా త‌ల్చుకుంటారు.

5. రిహార్స‌ల్‌లా ఉంటుంది

5. రిహార్స‌ల్‌లా ఉంటుంది

ఇలాంటి బ్యాచిల‌ర్స్ పార్టీ ఒక‌టి పెట్టుకుంటే ... పెళ్లి నిశ్చ‌యం అయ్యాక మ‌రో పార్టీ పెట్టుకోవ‌డానికి లోగ‌డ జ‌రుపుకున్న‌ పార్టీ ఒక రిహార్స‌ల్‌లా ఉంటుంది. మీ గ్యాంగ్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తే ఎంజాయ్ చేస్తారో అప్ప‌టికే మీకో అవ‌గాహ‌న వ‌స్తుంది. కాబ‌ట్టి ప‌క్కాగా ప్లాన్ చేసుకోవ‌డానికి వీల‌వుతుంది.

6. ఒత్తిడి త‌గ్గించేలా

6. ఒత్తిడి త‌గ్గించేలా

భార‌తీయ పెళ్లిళ్లు చాలా ఒత్తిడితో కూడుకున్న‌ట్టుగా క‌నిపిస్తాయి. కాబోయే వ‌ధువు మరీ బెంగ‌గా ఉంటుంది. స‌రిగ్గా కొన్ని రోజుల ముందు బ్యాచిల‌ర్స్ పార్టీ పెట్టుకున్నా అంత ఆనందంగా ఉండ‌లేదేమో. అలా కాకుండా ఇలా ఎంతో ముందుగా బ్యాచిల‌ర్స్ పెట్టుకుంటే ఒత్తిడి బాగా త‌గ్గుతుంది. చాల ఫ‌న్, ఎక్స్పీరియ‌న్స్ మిగులుతుంది.

7. ప‌ర్‌ఫెక్ట్ కార‌ణం ..

7. ప‌ర్‌ఫెక్ట్ కార‌ణం ..

టూర్‌కు వెళ్లి పార్టీ చేసుకునేందుకు ఏ కార‌ణ‌మూ క‌నిపించ‌క‌పోతే ఇదే కార‌ణంగా చూపించి ఎంజాయి చేయ‌వ‌చ్చు.

English summary

7 reasons why you should have an amazing bachelorette party even without a wedding!

Who says you need to have a bachelorette party only when your marriage has been fixed! Recently, we came across three girls who planned a special trip to celebrate their bachelorette bash. And the best part about it was that none of them had any immediate plans of settling down. Yes, you read it right. Here’s why (and how) you can too have a great bachelorette party without even planning about tying the knot!
Story first published: Thursday, November 30, 2017, 11:40 [IST]
Subscribe Newsletter