Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ భాగస్వామికి దూరంగా ఉన్నారు కాబట్టి మీకు మోసం చేసే హక్కు వచ్చేస్తుందా?
చాలామందికి దూరంగా ఉండి నడిపే బంధాల ఆలోచనంటేనే నచ్చదు. వారు ఎప్పుడూ వారి భాగస్వాములు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, వారు తమ గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా చింతిస్తూనే ఉంటారు.
చాలామంది వారి భాగస్వాములు తమ కాల్ ఎత్తకపోతే, మెసేజ్ కి స్పందించకపోతే వెంటనే అనుమానపడుతూ ఉంటారు. నిజానికి వారు ఏ మీటింగ్ లోనో బిజీ కావచ్చు లేదా ఏ పనిలో అన్నా ఇరుక్కుపోయి ఉండవచ్చు అనే ఆలోచనే రాదు.
దూరబంధాలు భాగస్వాములను స్వార్థపరులుగా మార్చేస్తాయి. అందుకే చాలామంది జంటలు విడిపోవటమో లేదా ఇంకొకరితో అక్రమబంధం ఏర్పరుచుకుని మోసం చేయటమో, పైకి బాగా నటిస్తూ ఇవన్నీ సులభంగా చేసేస్తుంటారు.
నిజానికి చాలా దూరబంధాలు విజయవంతం కూడా అయ్యాయి, అవుతూనే ఉన్నాయి కూడా. కానీ రికార్డులను పరిశీలిస్తే, తమ భాగస్వామి దగ్గరలేనప్పుడు చాలా జంటలు విడిపోవటమో, మోసం చేసిన దాఖలాలే ఎక్కువ.
మీరు ఎవరినైనా ప్రేమిస్తే, దూరం మీ మధ్య అసలు సమస్య ఎందుకవుతుంది? మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరెంత దూరంలో ఉన్నా,చివరకి మీ ఇద్దరూ కలిసే ఉంటారు. ఇలాంటి దూరబంధాలను విజయవంతం చేయటానికి కూడా అనేక సులభ మార్గాలున్నాయి, లేదు మోసం చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇదిగో ఈ విషయం పై మరింత అవగాహన కోసం కింద చదవండి.

అతిగా సంభాషించకండి
మీరు ఇప్పుడు ఒక పెద్దయిన వ్యక్తి. మీకు సంభాషణకి, వసపిట్టలా వాగుడుకాయలా వుండటానికి మధ్య తేడా తెలిసి ఉండాలి. మీ బంధం సరిగా ఉండటానికి రోజంతా మాట్లాడుతూనే ఉండక్కర్లేదు. జంటలకి తాము దూరంగా ఉంటాం కాబట్టి మరింత ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కానీ ఇది చేయనక్కరలేదు. రోజంతా మాట్లాడుతూనే ఉండటం ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు కూడా. మీరు అలసిపోవచ్చు. మిగతా కుటుంబానికి కూడా మీ సమయం కేటాయించాలి కదా మరి!
ఇదొక అవకాశంగా మలచుకోండి
దూరబంధం అంటే మీ బంధానికి ఒక పరీక్షలా తీసుకోండి, పాస్ లేదా ఫెయిలవ్వటం మీ చేతుల్లో ఉంది. పాసవ్వాలంటే, ఇద్దరూ ఇదొక నేర్చుకునే అవకాశం,కలిసి చేసే ప్రయాణం అని అర్థం చేసుకోవాలి. మీరు మీ బంధం మిమ్మల్ని ఇద్దర్నీ విడదీస్తోంది అనుకోకుండా, ఇద్దర్నీ ఒకటిగా తయారుచేస్తోంది అనుకోండి. దానివల్ల మీ బంధం మరింత బలపడి, ఇద్దరూ గొప్ప ఆనందంతో ఉంటారు.

బేసిక్ నియమాలు పెట్టుకోవడం
ఇద్దరూ ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకుని, ఒకరినుంచి ఒకరు ఏం ఆశిస్తున్నారో నిజాయితీగా చెప్పుకోవాలి. ఇద్దరూ కలిసి బేసిక్ నియమాలు ఏర్పర్చుకోవాలి. మీరు వాటికి ఎంత కట్టుబడి ఉంటారో కూడా వ్యక్తపర్చటం చాలా అవసరం.ఎందుకంటే ఎవరూ తమ ఇంటికి ఆనందంగా వచ్చి, మోసపోయాం అని తెలుసుకోవాలనుకోరు.
ఇద్దరూ సరిగా మీ భావాలను వ్యక్తపర్చుకోవడం
మీ భాగస్వామిని క్రమం తప్పకుండా పలకరిస్తుండటం చాలా ముఖ్యం. ఇంకా మీ భాగస్వామికి మీ జీవితంలో ఏం జరుగుతున్నాయో విశేషాలు కూడా తెలియచేస్తుండాలి. ఇవి చాలా రోజువారీ చిన్నవిషయాలుగా అన్పిస్తాయి కానీ మీరు అన్నీ మనసు విప్పి చెప్పాలి. ఫోటోలు, వీడియోలు, వాయిస్ సందేశాలు పంపుతూ ఉండటం కూడా ముఖ్యమే. మీ భాగస్వామి మీకెంత ముఖ్యమో ఇలా తెలుపుతూ ఉండటం వలన మీ బంధం బలపడుతుంది. ఈ చిన్నశ్రమ వారు ప్రేమింపబడుతున్నారని ఫీలయ్యేలా చేస్తుంది.

ఇద్దరూ కలిసి పనులు చేయటం
మీరిద్దరూ చాలా దూరంలో ఉన్నారు నిజమే. కానీ మీరు కలిసి పనిచేయలేరని కాదు కదా. ఇద్దరూ ఒకే సమయంలో డాక్యుమెంటరీలు, సినిమాలు చూడవచ్చు. ఆన్ లైన్ ఆటలు ఆడుకోవచ్చు. వీడియో కాల్ లో ఉన్నప్పుడు ఇద్దరూ వాకింగ్ చేయవచ్చు.ఆన్ లైన్ షాపింగ్ చేసి,ఒకరికొకరు బహుమతులు పంపుకోవచ్చు. ఇలాంటివెన్నో మీ బంధానికి కొత్తరూపం ఇస్తాయి.
రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు దూరంగా ఉండాల్సి రావటం అనేక ఇబ్బందులను తెస్తుంది. అయితే మీరు మీ భాగస్వామిని మోసం చేయటానికి అవకాశం అని మాత్రం కాదు.గుర్తుంచుకోండి మీ ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారు మరియు ఈ దూరం కొద్దికాలం మాత్రమే అని.



Click it and Unblock the Notifications