For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దూర దూరం ఉంటేనే ఆ ప్రేమ యొక్క విలువ తెలిసేది!అదెలాగో, ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుపుతాయి!

దూర దూరం ఉంటేనే ఆ ప్రేమ యొక్క విలువ తెలిసేది!అదెలాగో, ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుపుతాయి!

By Ashwini Pappireddy
|

ప్రేమకి ఎప్పుడూ ఎలాంటి సరిహద్దులు ఉండవు. మనం ప్రేమలో వున్నప్పుడు దూరం మనుషుల మధ్య అస్సలు సమస్య కాదు. నిజం చెప్పాలంటే, ఇది మన బంధాన్ని మరింత బలపరుస్తుందంటే నమ్మండి. మేము దేనిగురించి మాట్లాడుతున్నామో మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటా! అదేనండి చాలా మంది వారికి ఇష్టమైన వాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసి బాధ పడిపోతుంటారు.

సాధారణంగా ఇది తరచూ అనేక కారణాల వల్ల వేరొక నగరం లేదా దేశానికి వెళ్లవలసిన అవసరమున్న వ్యక్తుల విషయంలో జరుగుతుంది. అలాంటివారికి దూరంగా వుంటూ వారి సంబంధాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుంది, కానీ మీకు ఒకరంటే ఒకరికి ఇష్టమున్నప్పుడు మరియు ఒకరిని వదిలి ఇంకొకరు బయటికి వెళ్లకూడదనుకుంటే, మీరు ఈ దూరపు సంబంధంలోకి వస్తారు.

మన బంధాలని వదిలిపెట్టి దూరంగా వెళ్లడం వలన సాధారణంగా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు. నిజం చెప్పాలంటే ఇలాంటి దూరంగా వుంటూ సంబంధాన్ని బలపరుచుకోవడమనేది నిజంగా చాలాకష్టమనే చెప్పొచ్చు. మీరు దీనికోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.సంబంధం లో ఉన్న ప్రతి వ్యక్తి వారి బంధం స్థిరంగా బలపడటానికి కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది.

దగ్గరగా వున్నపుడు మన వాళ్ళతో సమయాన్ని గడుపుతూ, సినిమాలు చూడటం, షాపింగ్ చేయడం లేదా ఇంట్లోనే హాయిగా కలిసి ఉండడం జరుగుతుంది. కానీ మీ భాగస్వామి మీకు అనేక మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? కానీ ఒకరికొకరు దూరంగా వున్నపుడు వ్యక్తులు భౌతికంగా ఒకరికోసం ఒకరు సమయాన్ని గడపలేకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో దాదాపు కలిసి ఉండటం సాధ్యమే అది ఎలా అని అనుకుంటున్నారా? ఒక మంచి WIFI ప్రణాళిక తో మీకిష్టమైన వారికి మీ జీవితంలో జరిగే ప్రతిదాని గురించి తెలియజేస్తూ సాధ్యమైనంతవరకు మీ బంధాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నించండి.

ఈరోజుల్లో మనకి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, వివిధ సామాజిక మీడియాల ద్వారా మా భాగస్వాములతో ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉండవచ్చు. కొన్నిసార్లు,మీ భాగస్వాములు వారి పనులతో చాలా బిజీగా ఉండి, ఒకరినొకరు కలవడానికి సమయం కూడా ఉండకపోవచ్చు. దానివల్ల ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ఉండిపోతారు మరియు ఇద్దరూ కలుసుకోవాలని గాని, ఒకరితో ఒకరు సమయం గడపాలని కూడా గ్రహించరు.మరోవైపు, దూరపు సంబంధాల్లో భాగస్వాములు సమయం విలువను తెలుసుకుంటారు మరియు ఒకరినొకరు కలవడానికి దీర్ఘకాలం పడుతుందని వారికి బాగా తెలుసు. కాబట్టి వారు తమ భాగస్వామితో వ్యక్తిగతంగా కలిసే ఏ అవకాశాన్ని వారు వదులుకోరు.కాబట్టి, వారి నుండి నేర్చుకోవాల్సిన ఏదో ఉంది. అలాగే, దూర సంబంధాలు వారి భాగస్వాములను బలంగా ఉండేలా చేస్తాయి.

ఇక్కడ దూరపు సంబంధాలు మనకి చాల ముఖ్యమైన విషయాలని తెలియజేస్తాయి-

దూరపు సంబంధాలు మనకి తెలియజేసే 5 విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...

1) ఇది మనకి ఒంటరిగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది.

1) ఇది మనకి ఒంటరిగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది.

సుదూర సంబంధాలు మనకి ఎల్లప్పుడూ మన భాగస్వాముల యొక్క భద్రతను ఎల్లప్పుడూ పక్కన పెట్టనివ్వదు. కొన్నిసార్లు, మనం చిన్న విషయానికే పట్టుబడివుంటాము కానీ అవి మన సంబంధాలనుచెడగొట్టవచ్చు.

సుదూర సంబంధాలలో, మీరు మీ జీవితంలో కొన్ని పరిస్థితులను దైర్యంగా ఎదుర్కోవడానికి మరియు ఒంటరిగా ముందుకు వెళ్లటాన్ని భోదిస్తుంది. అంతేకాక, మీకు ఆసక్తి ఉన్న పనులను చేయడానికి మీకు సమయం దొరుకుతుంది. అంతేకాదు, మీరు ఈ సంభందం లోకి రాక ముందు కూడా మీరు అలాంటి జీవితాన్ని కలిగి వున్నారు కదా?

2) ఇది మనకి సహనాన్ని మరియు పట్టుదలని బోధిస్తుంది.

2) ఇది మనకి సహనాన్ని మరియు పట్టుదలని బోధిస్తుంది.

ఒక సాధారణ సంబంధం ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు వారి భాగస్వాముల మీద కనికరం చూపించవచ్చు, ఒక్కొక్కసారి వారి ఫోన్ కాల్ కి స్పందించకపోయినా లేదా అనుకున్నప్రకారం కలవకలేకపోయెన్నప్పుడు నిరాశ చెందుతారు. ఇది తరచుగా అన్ని జంటల మధ్య వాదనకు కారణం అవుతుంది.

కానీ దూర సంబంధంలో, మీరు మీ భాగస్వామికి కాస్త ఖాళీ సమయాన్ని ఇవ్వాలి. వారు ఇతర ముఖ్యమైన విషయాలలో బిజీగా ఉండవచ్చు మరియు మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాక, సుదూర సంబంధాల్లో ఉన్న వ్యక్తుల కోసం, వారాలు లేదా నెలలు వేచి ఉండటం లేదా వారి ప్రియమైనవారిని కలుసుకోవటానికి అవకాశం వచ్చేంతవరకు చాలా ఓపికగా ఉండాలి.

3) సంభాషణ ప్రాముఖ్యత

3) సంభాషణ ప్రాముఖ్యత

కేవలం సంభాషణ అనేది మాత్రమే దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడంలో సహాయపడుతుంది. సాధారణంగా కలిసి జీవిస్తున్న జంటలు వారి సంబంధంలో సంభాషణ అనేది ఎంత ముఖ్యమైనదో తెలుసుకోలేకపోవచ్చు. కానీ, అదే దూరంగా ఉంటున్న జంటలకు పొరపాటున వారి వైఫై పనిచేయనప్పుడు లేదా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వారు ఎలా ఒంటరితనాన్ని అనుభవిస్తారో దూరంగా ఉంటున్న ఒక వ్యక్తిని అడిగి తెలుసుకోండి.

వారి భాగస్వాములతో మాట్లాడటానికి మరియు వారితో కనెక్ట్ అవ్వడానికి వారు చాలా కాలం గడుపుతారు. వారు తమ జీవిత భాగస్వాముల తో వారు గడిపిన ప్రతి నిముషాన్ని పంచుకునేందుకు ఇష్టపడతారు, వారి భాగస్వాములు పాల్గొనడానికి వారు ఇష్టపడతారు.

4) చిన్న చిన్న విషయాల యొక్క ప్రాముఖ్యత మనకు బోధిస్తుంది.

4) చిన్న చిన్న విషయాల యొక్క ప్రాముఖ్యత మనకు బోధిస్తుంది.

మీరు ఎంత తరచుగా ప్రేమలో వున్న జంటలు ఒకరికొకరు బహుమతిని ఇచ్చుకోవడం చూస్తుంటారు? ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలను మరిచిపోవడం , పట్టించుకోకపోవడం వలన ఆ సమయం యొక్క ప్రాముఖ్యతని కోల్పోతున్నాము. కానీ దూరపు సంబంధాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం వలన వారి జీవితంలో వెలుగులను తీసుకువస్తాయి.

అదెలా అంటే, మీ భాగస్వామి మీరు అమితంగా ఇష్టపడిన బహుమతిని పంపడం, మీతో గడిపిన సమయపు ఫోటోలు లేదా ప్రతిరోజూ అందమైన సందేశాలు పంపడం ద్వారా దూరపు సంబంధాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా మీ భాగస్వాముల మనస్సులో వారు వున్నారని సంతోషంగా భావిస్తారు.

5) ఇది మనకి అసంపూర్ణ సంబంధాల విలువలను బోధిస్తుంది

5) ఇది మనకి అసంపూర్ణ సంబంధాల విలువలను బోధిస్తుంది

సంబంధాలు ఎప్పుడూ సరైనవిగా వుండవు. ఒకవేళ అలా వున్నట్లైతే, ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన వారితో వుంటారు మరియు ఈ ప్రపంచం మొత్తం ఒక మంచి ప్రదేశం గా మారుతుంది. దూరపు సంబంధాలలో మీరు ఎన్ని వేళ్ళ మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ, కలిసి ఉండటం ఎంత ముఖ్యమనేది మనకి నేర్పిస్తుంది.

దూరపు సంబంధాలలో సమయాన్ని బట్టి పరీక్షలో నిలబడాల్సి ఉంటుంది మరియు జీవితంలో అనేక అడ్డంకులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది భాగస్వాములను మరియు వారి బంధాన్ని సమయానికిఅనుకూలంగా బలపరుస్తుంది. అంతేకాకుండా ఇది మీ భాగస్వామి చెడు పరిస్థితుల్లో వున్నప్పుడు కూడా మిమల్ని అంగీకరించేలా చేస్తుంది. దీనికి ఇద్దరి జంటల మధ్య ఉన్నటువంటి ప్రేమే ప్రధాన కారణం.

English summary

5 Things That A Long Distance Relationship Teaches You.

Every person in a relationship should work to keep the spark alive. This is done by spending time together, watching movies, going shopping or just cozying up at home. But how do we do it when there are several miles of distance between your partner and you?
Story first published:Monday, December 4, 2017, 16:30 [IST]
Desktop Bottom Promotion