ప్రేమ వ్యవహారాన్ని అమ్మాయిలు ఇలా దాస్తారు!

By: Deepti
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ లైఫ్ ఒక అందమైన అనుభూతి. కాలేజీ అంటే గుర్తొచ్చేది అక్కడ అల్లరి, ఆనందం. మీ తల్లిదండ్రులు కఠినమైనవారై, రహస్యంగా మీరు అల్లరి చేసేవారైతే, ఆ జ్ఞాపకాలు జీవితకాలం ఉంటాయి!

మొదటి విషయం, తల్లిదండ్రులు 'ప్రేమ' 'అబ్బాయిలు', డేటింగ్ వంటి పదాలను అసహ్యించుకుంటారు. వారికి కేవలం చదువు, తరగతులు, ర్యాంకులు, బంగారు మెడల్స్ వంటి పదాలే కన్పిస్తాయి. కానీ, రహస్యంగా కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళటం కళాశాల విద్యార్థులకు ఓకే రకమైన కిక్ ఇస్తుంది!

లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ఆలోచనలకు గుడ్ బై తప్పనిసరి..

ఈ కాలం అమ్మాయిలు వారి ప్రేమ వ్యవహారాన్ని ఎలా దాస్తారో తెలుసుకుందాం.

కాలేజీ లో ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయమ్మ అని!

కాలేజీ లో ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయమ్మ అని!

ఇది ఒక సాకు. మీ ప్రేమికుడితో కాలేజీ క్యాంటీన్ లో ఎక్కువ సమయం కబుర్లు చెప్తూ గడిపి ఇంటికి ఆలస్యంగా వెళ్తే, అమ్మకి ఏం చెప్తారు?

విహారయాత్ర

విహారయాత్ర

ప్రేమికుడితో కలిసి బయటఊరికి వెళ్లాలనిపించిందనుకోండి? కాలేజీ క్లాస్ మేట్స్ తో కలిసి విహారయాత్ర అని చెప్పండి; ఇదే ఎక్కువమంది వాడే సాకు!

మీ దాంపత్యం గురించి మ్యారేజ్ డేట్ ఏం చెబుతోంది ?

కంబైన్డ్ స్టడీ

కంబైన్డ్ స్టడీ

ఈ ‘కంబైన్డ్ స్టడీ' అనే పదం బాగా ఫేమస్! అవును, మనందరం కాలేజీలో చేసిన పనులే! నిజానికి ‘కంబైన్డ్ స్టడీ' అంటే మిత్రుడి ఇంటికి వెళ్ళి చదువుకోటమే. కానీ నిజానికి యెంత మంది సిన్సియర్ గా చదువుతారు?

ఫ్రెండ్ నానమ్మ చనిపోయింది!

ఫ్రెండ్ నానమ్మ చనిపోయింది!

ఇంక ఏ సాకూ దొరకనప్పుడు, కొంతమంది తమ ఫ్రెండ్ నానమ్మ ఇప్పుడే చనిపోయిందని కూడా అబద్ధం చెప్తారు! అవును, ఆ వయస్సులో ప్రేమికుడిని కలవటమే మొదటి ప్రాధాన్యత!

ఫోన్ నంబరు

ఫోన్ నంబరు

భారత యువతులు తమ ప్రేమికుడిని దాచే మరో పద్ధతి వారి నెంబరును అమ్మాయి పేరుతో సేవ్ చేయటం! ఒకవేళ అబ్బాయి పేరు ప్రవీణ్ అయితే, అతని పేరును 'ప్రియ' అని సేవ్ చేసుకుంటారు. ఒక వేళ, తల్లిదండ్రులు ఫోన్ చెక్ చేసినా, అందులో అమ్మాయిల పేర్లే కన్పిస్తాయి.

డాన్స్, యోగా, కంప్యూటర్ క్లాస్

డాన్స్, యోగా, కంప్యూటర్ క్లాస్

అన్ని క్లాసుల లక్ష్యం కేవలం ఒక్కటే. సాకులు చెప్పకుండా ఇంటి బయటకి రాగలగటం తమ ప్రేమికుడిని కలవటం!

ప్రాజెక్ట్ వర్క్ !

ప్రాజెక్ట్ వర్క్ !

అన్ని సాకులు అయిపోయిన తర్వాత, సెలవుల సమయంలో ప్రియుడిని కలవాలంటే, ఏం చేస్తారు? విద్యార్థినులు ఎక్కువగా వాడే మరో అద్భుత సాకు ప్రాజెక్ట్ వర్క్.

ఏ విష‌యాలు అన్‌హ్యాపీగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి ?

మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే!

మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే!

అమ్మాయి మరియు అబ్బాయి పార్కుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఏం చేస్తారు? "నాన్నా, మేము ఫ్రెండ్స్ మాత్రమే! కేవలం మిత్రులమే! తప్పుగా అర్ధం చేసుకోవద్దు!" అని తప్పించుకుంటారెమొ!

English summary

Funny Ways In Which Indian Girls Hide Their Boyfriends From Parents!

In this post, let us discuss how college girls generally hide their boyfriends from their strict parents!
Subscribe Newsletter