మిమ్మ‌ల్ని సాదాసీదా స్నేహితురాలిగానే చూస్తున్నాడ‌నేదానికి 6 సంకేతాలు

By: sujeeth kumar
Subscribe to Boldsky

అమ్మాయిలు అబ్బాయిల‌ను ఎంత ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నించినా వాళ్లు మాత్రం అమ్మాయిల‌ను త‌మ మ‌గ స్నేహితులుగానే చూస్తారు. అమ్మాయిల‌ను ఇలా చేయ‌డాన్నే నాటుగా బ్రో జోన్ చేయ‌డంగా చెబుతారు. మీరు ఇష్ట‌ప‌డే అబ్బాయి మీతో సంభాష‌ణ‌లు కుదించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా, మీరు త‌న‌తోనే టైమ్ స్పెండ్ చేయాల‌ని చూస్తుంటే అత‌ను మాత్రం అంద‌రిలో మిమ్మ‌ల్ని క‌లుపుకుపోతుంటే మిమ్మ‌ల్ని ప్ర‌త్యేకంగా ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని సంకేత‌మిచ్చిన‌ట్టే. అత‌డి నుంచి దూరంగా వెళ్లిపోవ‌డ‌మే మంచిది.

ఒక్కోసారి మీ వైపు నుంచి అత‌డ్ని మెప్పించ‌డానికి మీరెంతో క‌ష్ట‌ప‌డుతుండొచ్చు. అవేవీ ఫ‌లితాల‌ను ఇవ్వ‌క‌పోగా అత‌డు మిమ్మ‌ల్ని కేవ‌లం ఒక బ‌డ్డీగా చూస్తుంటే ఆలోచించాల్సిందే. మీపై ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ కానీ, రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ చూపించ‌క‌పోతే అత‌డి గురించి అతిగా ఆలోచించి ఆశ పెట్టుకోక‌పోవ‌డ‌మే మంచిది.

How to know if you are Bro-zoned

చాలా సార్లు అమ్మాయిలు త‌మ‌ను ఆ అబ్బాయి ఇష్ట‌ప‌డుతున్నాడో లేదో తెలుసుకోలేకపోతుంటారు. అత‌డ్ని ఆక‌ర్షించేందుకు ప‌రిపరి విధాలా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతుంటారు. అలాంటి సంకేతాలేమైనా మీకు అందుతున్నాయనే దాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించండి. అలా గ‌మ‌నిస్తే వెంట‌నే మీరు ఆశ‌లు వ‌దులుకోవ‌డం ఉత్త‌మం. ఇది మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర్చ‌డానికి కాదు.. మీకంటూ ఆత్మాభిమానం ఉంటుంది క‌దా!

1. ఎలాంటి ప్ర‌త్యేక‌మైన ప్లాన్లు

1. ఎలాంటి ప్ర‌త్యేక‌మైన ప్లాన్లు

మీరు అత‌డితో క‌లిసి ఎటైనా వెళ్లేందుకు స్పెష‌ల్ ప్లాన్ వేస్తే అత‌డు వ‌స్తాడో రాడో అనేది నిశ్చ‌యంగా చెప్ప‌లేడు. ఆ టాపిక్ ను అవాయిడ్ చేసేందుకు లేదా ఇత‌ర ముఖ్య‌మైన ప‌ని ఉంద‌నో చెప్పి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని నిజంగా ఇష్ట‌ప‌డితే మీరు ఏ ప్ర‌ణాళిక వేసినా దానికి క‌ట్టుబ‌డే ప్ర‌య‌త్నం చేస్తాడు.

2. ఎలాంటి ఎమోష‌న్లు క‌న‌బ‌ర్చ‌క‌పోతే...

2. ఎలాంటి ఎమోష‌న్లు క‌న‌బ‌ర్చ‌క‌పోతే...

మీ వాడు మీరే సంగ‌తులు చెబుతున్నా ఎమోష‌న‌ల్ గా రియాక్ట్ అవ్వ‌డం లేదా! అయితే అత‌డికి దూరంగా వెళ్ల‌డం మేలు. మీరు అత‌డ్ని ప్రేమిస్తున్న‌ట్టో, ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు చెబితే ఎంగిరి గంతేయ‌కుండా కామ్‌గా ఉంటే మాత్రం పెద్దగా మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని సంకేతం.

భావోద్వేగ‌భ‌రిత‌మైన ఏ సందర్భం వ‌చ్చినా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే మిమ్మ‌ల్ని అత‌డి జీవితంలో భాగంగా భావించ‌డంలేద‌ని అర్థం.

3. మీ విష‌యాలేవీ అత‌డికి గుర్తుండ‌వు

3. మీ విష‌యాలేవీ అత‌డికి గుర్తుండ‌వు

మీరు ఇష్ట‌ప‌డే అబ్బాయికి అద్భుత‌మైన జ్నాప‌క శ‌క్తి ఉంద‌ని మీకు తెలుసు. అయినా కొన్ని సార్లు మీకు సంబంధించిన విష‌యాల‌ను మ‌ర్చిపోతుంటే మాత్రం మీపై అంత‌గా ఆస‌క్తి లేద‌ని చెప్పొచ్చు. కేవ‌లం కొన్ని నిమిషాల ముందు మాట్లాడుకున్న మాటలే గుర్తుపెట్టుకోలేక‌పోతే మీ గురించి అస‌లు ఆలోచించ‌డ‌మే లేద‌ని అర్థం.

4. మీతో ట‌చ్‌లో ఉండ‌డు

4. మీతో ట‌చ్‌లో ఉండ‌డు

మీరు అత‌డికి మెసేజ్ చేశారు. రిప్లై కోసం వెయిట్‌చేస్తుంటారు. వార‌మైనా రిప్లై రాదు, ఒక్కోసారి నెల‌లు గ‌డచిపోతుంటాయి. అస‌లు రిప్ల‌యి రాదు కూడా. మిమ్మ‌ల్ని నిజంగా ఇష్ట‌ప‌డే వాడు మిమ్మ‌ల్ని అంత‌లా వెయిట్ చేయించ‌డు. ఎప్ప‌టికైనా ఏదో ఒక ప్ర‌త్యుత్త‌రంతో మిమ్మ‌ల్ని స‌మాధాన‌ప‌రుస్తాడు.

5. ఇత‌ర అమ్మాయిల గురించి మీ ద‌గ్గ‌ర‌

5. ఇత‌ర అమ్మాయిల గురించి మీ ద‌గ్గ‌ర‌

ఇత‌ర అమ్మాయిల గురించి మీ ద‌గ్గ‌ర త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటే మీరు అత‌డికి దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌ని సంకేతం. మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డే ఏ అబ్బాయి మీ ముందు ఇత‌ర అమ్మాయిలు బాగున్నారు అనే సంభాష‌ణ రానీయ‌డు అన్న విష‌యాన్ని గుర్తుంచుకోండి.

6. ప‌రిచ‌యం చేసేట‌ప్పుడు

6. ప‌రిచ‌యం చేసేట‌ప్పుడు

మిమ్మ‌ల్ని ఎవ‌రికైనా ప‌రిచ‌యం చేసేట‌ప్పుడు ఎలా చేస్తున్నాడ‌న్న‌ది గ‌మ‌నించండి. మిమ్మ‌ల్ని ఓ బెస్ట్ ఫ్రెండ్‌గా లేదా సోద‌రిగా ప‌రిచ‌యం చేస్తున్న‌ట్ట‌యితే మిమ్మ‌ల్ని బ్రో జోన్‌లోకి నెడుతున్న‌ట్టే లెక్క‌. అలాంటి సంద‌ర్భంలో అత‌డికి ప్రేమ విష‌యంలో దూరంగా ఉండ‌డ‌మే మీకు మంచిది.

English summary

How to know if you are Bro-zoned

There are certain ways to know if you are bro-zoned. Read to know how to identify if you are bro-zoned.
Story first published: Monday, November 27, 2017, 16:00 [IST]
Subscribe Newsletter