For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ 10 గుణాలు ఉంటే అంద‌రిలో కెల్లా మీరే అట్రాక్షన్ గా ఉంటారు! సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

  By Sujeeth Kumar
  |

  ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ఎవ‌రు కోరుకోరు చెప్పండి. స‌హ‌జంగా ఎవ‌రికైనా స‌రే అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ఉంటుంది. అందుకే ఎక్కువ సేపు ఎలా ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌నే విష‌యాన్ని ఆలోచిస్తూ కూర్చుంటాం. క‌నీసం మ‌న మొద‌టి డేటింగ్ రోజైనా స‌రే ఆక‌ర్ష‌ణీయంగా ఉండేలా చూసుకుంటారు.

  మ‌నం ఆక‌ర్ష‌ణీయంగా ఉంటేనే క‌దా ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. అయితే ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నామ‌ని ఏయే అంశాలు తేల్చుతాయి. ఏదీ మిమ్మ‌ల్ని ఆక‌ర్ష‌వంతంగా చేయ‌గ‌ల‌దు?

  ఈ లక్షణాలు మీ భార్యలో కనబడుతుంటే..ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుట లేదు!

  అది తెలుసుకోవ‌డం చాలా సుల‌భం. ఆక‌ర్ష‌ణ శాస్త్రం గురించి అధ్య‌య‌నం చేయ‌డం చాలా క‌ష్ట‌మైన‌ది కానీ అసాధ్య‌మేమీ కాదు.

  1. స్వ‌రం

  1. స్వ‌రం

  ఓ స‌ర్వేలో కొంద‌రు స్త్రీల‌కు మ‌గ‌వారికి సంబంధించిన కొన్ని స్వ‌ర న‌మూనాల‌ను వినిపించి రేటింగ్ ఇవ్వ‌మ‌న్నారు. అదే విధంగా స్త్రీల‌కు సంబంధించిన స్వ‌ర న‌మూనాల‌ను మ‌గ‌వారికి ఇచ్చి రేటింగ్ ఇవ్వ‌మ‌న్నారు. మంద్ర‌స్థాయి స్వ‌రం క‌లిగిన మ‌గ‌వారిని స్త్రీలు ఇష్ట‌ప‌డ‌గా దీనికి విరుద్ధంగా అధిక‌స్థాయి స్వ‌రం ఉన్న స్త్రీల‌ను మ‌గ‌వారు ఇష్ట‌ప‌డ్డారు. అపోజిట్ సెక్స్ వ్య‌క్తుల‌ను ఆక‌ర్షించాలంటే స్వ‌రం కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఈ స‌ర్వేలో తేల్చారు.

  2. అందుబాటు త‌త్వం

  2. అందుబాటు త‌త్వం

  సులువుగా అందుబాటులో ఉండేవారు పెద్ద‌గా ఆక‌ర్షించ‌లేరు. భాగ‌స్వామి ద‌గ్గ‌ర కాస్త బెట్టు చేసి అంత ఈజీగా అంద‌కుండా ఉండాలి. అప్పుడే వారు మీకు ఆక‌ర్షితుల‌వుతారు. అయితే ఇది శ్రుతి మించితే మీ భాగ‌స్వామి మీపై ఆస‌క్తిని కోల్పోతూ ఉండే ప్ర‌మాద‌ముంది. కాబ‌ట్టి ఈ అంశాన్ని జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించాలి.

  3. మూడ్‌

  3. మూడ్‌

  ఒక వ్య‌క్తి మాన‌సిక స్థితి కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉండేలా చేయ‌గ‌ల‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒక వ్య‌క్తి ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాడ‌నుకుందాం. మ‌రో వైపు మరో వ్య‌క్తి ఎప్పుడూ బాధగా, చికాకుగా ఉంటే ఎవ‌రిని ఇష్ట‌ప‌డ‌తాం. సందేహంలేకుండా మొద‌టి వ్య‌క్తినే.

  4. ప‌ర‌ప‌తి

  4. ప‌ర‌ప‌తి

  సామాజిక ప‌ర‌ప‌తి కూడా ఆక‌ర్ష‌ణీయంగా చేయ‌గ‌ల‌దు. దీన‌ర్థం ఎక్కువ మంది స్నేహితులు, సామాజిక అనుబంధాలు ఉన్నంత‌మాత్రాన మీ భాగ‌స్వామి మీకు ఊరికే ప‌డిపోదు. అయితే సోష‌ల్ కాంటాక్ట్స్ పెంచుకోవ‌డం వ‌ల్ల వ్య‌క్తి డైన‌మిక్‌గా ఉండ‌గ‌లుగుతాడు. దీని వ‌ల్ల‌నే కాబోలు సామాజిక ప‌ర‌ప‌తి మిమ్మ‌ల్ని ఆక‌ర్ష‌ణీయంగా చేయ‌గ‌లుగుతుంది.

  మీ ఇద్దరి మధ్యా శారీరక ఆకర్షణ ఉన్నదని తెలుసుకోవటం ఎలా?

  5. తేజ‌స్సు

  5. తేజ‌స్సు

  ఆత్మ‌విశ్వాసం ఉన్న‌వారికి ఆక‌ర్ష‌ణీయ‌ పాళ్లు మెండు. కాన్ఫిడెంట్‌గా న‌వ్విన‌ప్పుడు, క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి ధృఢంగా మాట్టాడిన‌ప్పుడు మ‌రింత ఆక‌ర్ష‌వంతంగా అనిపిస్తారు. ఓపెన్‌గా ఉండ‌డం మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చేయ‌గ‌ల‌దు. ముఖంలో తేజ‌స్సుతో ఎవ‌రినైనా ఇట్టే ఆక‌ర్షించ‌వ‌చ్చు. అది బ‌య‌ట‌పెడితేనే మీ మొద‌టి డేట్ రోజున స‌క్సెస్ అవుతారు.

  6. చ‌మ‌త్కారం

  6. చ‌మ‌త్కారం

  చ‌మ‌త్కారంగా మాట్లాడే వారంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. సెన్సాఫ్ ఆఫ్ హ్యూమ‌ర్ ఉన్న‌వారు మంచి తెలివితేట‌లు క‌లిగి ఉంటారు. వీరిలో సృజ‌నాత్మ‌క‌త పాళ్లు కూడా ఎక్కువ‌. చ‌మ‌త్కారంగా ఉండే మ‌గ‌వాళ్లు ఆడ‌వారిని ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తారు. ఇక మ‌గ‌వారి విష‌యానికి వ‌చ్చేస‌రికి త‌మ జోకుల‌కు ప‌డీ ప‌డీ న‌వ్వే ఆడ‌వారంటే ఇష్ట‌ప‌డ‌తారు. సెన్సాఫ్ ఆఫ్ హ్యామ‌ర్ ఉన్న‌వాళ్లు దీర్ఘ‌కాలం పాటు రిలేష‌న్ షిప్‌ను కొన‌సాగించ‌గ‌ల‌రు.

  7. అందం

  7. అందం

  లుక్స్‌ప‌రంగా బాగున్న‌వారు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. బాహ్యా సౌంద‌ర్యానికి ప‌డిపోవ‌డం నిజంగా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. అయితే అందంగా ఉండే ముఖం ఉన్న‌వారికి ఎవ‌రైనా పడిపోతారు. తీరైన శ‌రీరాకృతి, కాంతివంత‌మైన చ‌ర్మం, మంచి ఫిట్‌నెస్ ఉన్న‌వారు అది ఆడైనా, మ‌గైనా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. బాహ్యా సౌంద‌ర్యాన్ని లోలోపలే ఆరాధిస్తారు అయితే దాన్ని బ‌య‌ట‌పెట్టరు

  8. స్టైల్‌

  8. స్టైల్‌

  మాన‌వులుగా మ‌నం ఎక్కువ‌గా పై పైన అందాల‌కు ఆక‌ర్ష‌ణ‌కు లోన‌వుతాం. వ్య‌క్తి గుణగుణాలు ముఖ్య‌మని మ‌న‌కు తెలిసినా తొలుత ఆక‌ర్షితుల‌య్యేది మాత్రం పై పైన అందాల‌కే. స్టైలిష్‌గా, నీట్‌గా ఉండేవారు ఎదుటివారిని ఇట్టే ఆక‌ర్షించ‌గ‌ల‌రు. ఎవ‌రినైనా మురికిప‌ట్టిన గోళ్ల‌తో, చినిగిన మాసిన బ‌ట్ట‌ల‌తో మొద‌టిసారి క‌లిస్తే వారి మీద స‌ద‌భిప్రాయం పోతుంది. అంతే క‌దా!

  9. బాడీ లాంగ్వేజ్‌

  9. బాడీ లాంగ్వేజ్‌

  ఒక్కో సారి కొందరు వారు వేసుకునే బ‌ట్ట‌ల క‌న్నా వారి బాడీ లాంగ్వేజీనే ఎక్కువ ఆక‌ర్షితుల‌ను చేస్తుంది. దేహాన్ని క‌దిలించే తీరు, కూర్చునే తీరు, నిల‌బ‌డి మాట్లాడే తీరు అన్నీ బాడీ లాంగ్వేజ్ కిందికే వ‌స్తాయి. అపోజిట్ సెక్స్ వాళ్లు మ‌న‌తో మాట్లాడేట‌ప్పుడు మ‌న ఆక‌ర్ష‌ణీయ‌మైన బాడీ లాంగ్వేజ్‌ను బట్టి వారికి తెలియ‌కుండానే ప‌డిపోతారు.

  10. ఆక‌ర్ష‌ణ పాత్ర

  10. ఆక‌ర్ష‌ణ పాత్ర

  ఆక‌ర్ష‌ణ మాత్ర‌మే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌దు. అయితే ఆక‌ర్ష‌ణ ఒక్క‌టే బంధాల‌ను బ‌లంగా మార్చ‌లేదు. ఆక‌ర్ష‌ణ అనేది ప‌రిచ‌యంలో తొలి మెట్టును సుల‌భ‌త‌రం చేయ‌గ‌ల‌దంతే. ఆ త‌ర్వాత ప్రేమ‌, కంపాటిబిలిటీ, అర్థం చేసుకునే గుణం లాంటివ‌న్నీ సంబంధాల‌ను మ‌రింత బ‌ల‌ప‌రుస్తాయి. కేక్ పైన ఐసింగ్ ఎలా చేస్తామో అలాంటిదే ఆక‌ర్ష‌ణ కూడా!

  English summary

  The 10 Rules Of Attraction

  Do looks matter? If only looks matter then why do we come across some people with average looks with very attractive spouses? Does it mean that there are other factors that can make you look attractive other than your looks? Yes, there are a lot of things that can create an effect on the perceptions of the people around you. Here are some facts about the science of attraction.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more