మిమ్మ‌ల్ని ప్రేమిస్తుంది ...న‌మ్మ‌కం లేదా? ఇవ‌న్నీ సంకేతాలే!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మీకు ప్రియాతి ప్రియ‌మైన ప్రేయ‌సి గురించి క‌ల‌లు క‌న‌డం మొద‌లుపెట్టారా? ఆమె మాట‌లు మిమ్మ‌ల్ని పిచ్చెక్కిచ్చేస్తున్నాయా? ఆమె మిమ్మ‌ల్ని చూసే చూపులు మీకు మ‌త్తెక్కిస్తున్నాయా?

అయితే మీ ప‌ట్ల ఆమె నిజమైన ఫీలింగ్స్ ఎలాంటివో క‌నిపెట్ట‌లేకపోతున్నారా? ఒక్కోసారి ఇద్ద‌రి మ‌ధ్య ఆక‌ర్ష‌ణ ఉండొచ్చు అది ప్రేమ‌గా భ్ర‌మప‌డ‌లేం. మీరు ప్రేమించే అమ్మాయి మిమ్మ‌ల్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవ‌డం ఎలా?

ఆ అమ్మాయికి ఐ ల‌వ్ యూ చెబితే ఒప్పుకుంటుందా? ఎలా కనుక్కోవాలి. ఇది తెలుసుకోవ‌డానికి కొన్ని సంకేతాలుంటా. అవేంటో తెలుసుకుందామా...

Signs she's about to say I Love You

త‌ర‌చూ సంభాషిస్తుందా?

ప్ర‌తి చిన్న విష‌యం మీతో పంచుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతుందా? ఆమె ప్ర‌మోష‌న్ కావొచ్చు, కొత్త ప్రాజెక్టు గురించి కావొచ్చు, స్నేహితురాలి పెళ్లి కావొచ్చు ఏదైనా మీతో పంచుకోనిదే ఆమెకు మ‌న‌సు ప‌డ‌టం లేదా? ఆమెకేదైనా అప్‌డేట్స్ తెలిస్తే వెంట‌నే మీతో మాత్రమే మొద‌ట చెప్పాల‌నుకుంటుందా? ఐతే మీరు త‌న‌కి చాలా స్పెష‌ల్. తొంద‌ర్లోనే ఐలవ్‌యూ చెప్పే ల‌క్ష‌ణాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ట్టే!

Signs she's about to say I Love You

మీకోసమే స‌మ‌యం కేటాయిస్తుంది

మ‌హిళ‌లు కాస్త స‌మ‌యం దొరికితే ఇంటి ప‌నులకే అంకిత‌మ‌వ్వ‌డ‌మ‌నే రోజులు పోయాయి. ఇప్పుడు స్త్రీలు చాలా స‌ర్వ‌స్వ‌తంత్రంగా ఉంటున్నారు. బాగా చ‌దువుకొని త‌మ ఉద్యోగ బాధ్య‌త‌ల‌తో చాలా బిజీగా ఉంటున్నారు. మ‌గ‌వాళ్ల‌లాగే పనుల్లో నిమ‌గ్న‌మై చాలా శ్ర‌ద్ధ‌గా ప‌నిచేసేస్తున్నారు. మీ గ‌ర్ల్ ప్రెండ్ మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్న‌ట్ట‌యితే మీ కోసం ఎంత బిజీ షెడ్యూల్‌లో అయినా స‌మ‌యం కేటాయిస్తుంది. వీకెండ్స్‌లో రెస్ట్ తీసుకోకుండా మీ కోసం స‌మ‌యం కేటాయిస్తుందంటే ఆమె మీకు త్వ‌ర‌లో ప్ర‌పోజ్ చేయోచ్చు!

Signs she's about to say I Love You

స్నేహితులు, బంధువుల‌ను ప‌రిచయం చేస్తుంది

వాళ్ల ఫ్యామిలీ పార్టీలకు మీరు వ‌చ్చే ఏర్పాట్లు చేస్తుంది. త‌న‌ స్నేహితురాళ్ల‌తో మిమ్మ‌ల్ని కలిపిస్తుంది. వాళ్ల‌తో టైమ్ స్పెండ్ చేసేలా చూస్తుంది. పైగా వాళ్ల‌ని క‌లిసినప్పుడు అప్ప‌టికే మీ గురించి చాలా విష‌యాలు వాళ్ల‌కు తెలిసే ఉంటాయి. ఆమె మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డుతుంది కాబ‌ట్టే మీ గురించి వాళ్ల‌తో ఎక్కువ చెప్పి ఉంటుంది. ఆమె మిమ్మ‌ల్ని ప్రేమిస్తుంద‌నేదానికి ఇదీ ఒక సంకేత‌మే.

వేరే అమ్మాయిల‌తో మాట్లాడితే అసూయ‌

అసూయా అనేది అమ్మాయిల అతి పెద్ద ల‌క్ష‌ణ‌మంటారు. అదే నిజ‌మైతే మీరు ఇత‌ర స్త్రీల‌తో స‌మ‌యం గడుపుతూ ఆమె కంటికి క‌నిపిస్తే ఆమె అసూయ‌తో ర‌గిలిపోతుంటుంది. అదొక్క‌టి చాలు ఆమె మిమ్మ‌ల్ని క‌చ్చితంగా ప్రేమిస్తుంద‌ని చెప్ప‌డానికి!

భ‌విష్య‌త్ గురించిన ఆలోచ‌న‌లు

భ‌విష్య‌త్ గురించిన ఎప్పుడు మాట్లాడాల్సిన సంద‌ర్భం వ‌చ్చినా ఆమె మిమ్మ‌ల్ని భాగం చేసుకుంటుంది. మీ ఇద్ద‌రు క‌లిసి ఏదైనా ప్ర‌దేశానికి వెళ్ల‌బోతున్న‌ట్టు క‌ల‌లు కంటుందా? ఇంకాస్త ముందుకెళ్లి భ‌ర్త ఇలా ఉండాలి, పిల్ల‌లు ఇంత మంది ఉండాల‌ని చెప్పి మీ స్పంద‌న కోసం చూస్తున్న‌ట్ట‌యితే ఆమె మీతో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధంగా ఉంద‌ని చెప్పొచ్చు.

Signs she's about to say I Love You

ప్ర‌శంస‌ల జ‌ల్లులు

ఒక్కోసారి మిమ్మ‌ల్ని ర‌హ‌స్యంగా పొగుడుతుంది. అవ‌కాశ‌మొస్తే అంద‌రిముందూ పొగిడే సంద‌ర్భాన్ని వ‌దులుకోదు. మీ క‌ష్టాన్ని ఆమె అర్థం చేసుకోగ‌లుగుతుంది. మీ ఒక్క‌రి క‌ష్టం వ‌ల్లే ఎంతో గొప్ప‌దైన‌ది సాధించగ‌ల‌రు ఆమె విశ్వ‌సిస్తుంది. మీ విజ‌యాల‌ను ఆమె వెన్నంటి ప్రోత్స‌హిస్తుందంటే దాన‌ర్థం ఆమె మీకు త్వ‌ర‌లో ఐ ల‌వ్ యూ చెప్ప‌బోతుంది.

Signs she's about to say I Love You

మీపై అమితాస‌క్తి చూపిస్తుంటే...

మీ ఆస‌క్తులు, ఇష్టాయిష్టాల గురించి అడిగి తెలుసుకుంటుంటే మీపై ఆమెకు బాగా శ్ర‌ద్ధ అని చెప్పొచ్చు. మిమ్మ‌ల్ని మూడ్ ఆన్ చేసేది ఏంటి, ఆఫ్ చేసేది ఏంటి అన్న‌ది ఆమెకు బాగా తెలిసిపోతుంటుంది. కొన్ని స‌మ‌యాల్లో ఆమె మీపై ఎక్కువ శ్ర‌ద్ధ చూపిస్తుందంటే మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్న‌ట్టు ప‌రోక్షంగా సంకేత‌మిస్తున్న‌ట్టే.

మీ చెలి ఇలాంటి సంకేతాల‌తో మిమ్మ‌ల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న‌ట్ట‌యితే మీతో పిచ్చిగా ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టే. మీరూ ఆమెకు ఆ అవ‌కాశాన్ని సుల‌భంగా క‌ల్పించి ఇద్ద‌రు ప్రేమ సాగ‌రంలో మునిగి తేలేందుకు సిద్ధ‌ప‌డండి.

English summary

Signs she's about to say, “I Love You”

Have you started dreaming about her? You are mad about how she talks and the way she looks at you; however, you are not sure about her feelings. Sometimes, there is physical attraction between people which should not be misunderstood as love. There are genuine signs to show a girl is interested in you.
Subscribe Newsletter