వామ్మో! ఇలాంటి వ్య‌క్తుల‌తో డేటింగ్ క‌ష్ట‌మే!

By: sujeeth kumar
Subscribe to Boldsky

ఎవ‌రైనా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిసిన‌ప్పుడు వారితో మీరు డేటింగ్ ఎందుకు చేస్తారు? అయితే తొలి ప‌రిచ‌యంలోనే ఒక‌రిని అంత సుల‌భంగా అంచ‌నా వేయ‌వ‌ద్దు.

డేటింగ్ చేసేట‌ప్పుడు మీరు ఎదుటి వ్య‌క్తిలో ప్ర‌మాద‌క‌ర ఛాయ‌ల‌ను గమ‌నిస్తే.. పూర్తి క‌మిట్‌మింట్ ఇచ్చే ముందు వెన‌క్కి త‌గ్గ‌డం మేలు.

మీ జీవితాన్ని నాశనం చేసే 10 విషపూరిత భావోద్వేగాలు

ప్ర‌మాద‌క‌ర‌మైన‌వారు త‌మ చుట్టు ఉన్న‌వారిని సంతోషంగా ఉండ‌కుండా చేయ‌గ‌ల‌రు. కొన్ని ర‌కాల స్వ‌భావాలు ఉండే అవ‌కాశం గ‌ల వ్యక్తులను ఇక్క‌డ ఇస్తున్నాం. వీళ్ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు దూరంగా ఉంచ‌డం మంచిది.

శ్రుతి మించిన రొమాన్స్‌

శ్రుతి మించిన రొమాన్స్‌

సాధార‌ణంగా ఏదైనా రిలేష‌న్‌షిప్‌లో రొమాన్స్ ఉంటేనే మ‌జా. అయితే అది మ‌రీ శ్రుతి మించితేనే ప్ర‌మాదం. మీరు ఆఫీసులో మీ కొత్త ప్రాజెక్టు వ‌ర్క్ గురించి ఒక‌ప‌క్క ఉత్సాహంగా చెబుతుంటే అత‌ను మాత్రం క్యాండిల్ లైట్ డిన్న‌ర్ గురించి, బాల్ డాన్స్ గురించి ... ఇంకా రొమాంటిక్ విష‌యాల‌ను చెప్పి మీ అటెన్ష‌న్‌ను మ‌ళ్లించాల‌ని ప్ర‌య‌త్నిస్తే మాత్రం క‌చ్చితంగా మీకు ఇరిటేష‌న్ క‌లుగుతుంది.

ఘాటైన విమర్శ

ఘాటైన విమర్శ

ఒక ప‌క్క మీ భాగ‌స్వామిని పొగిడి సంతోష‌పెట్టాల‌ని మీరు చూస్తుంటే ఆమె మాత్రం మీలో త‌ప్పుల‌ను వెతికే ప్ర‌యత్నం చేస్తుందా? అయితే అలా ప్ర‌తి సారీ ఘాటుగా విమర్శిస్తుంటే ఎంత వ‌ర‌క‌ని త‌ట్టుకోగలం చెప్పండి.

అస్త‌మాను మెచ్చుకోమంటే ఎలా...

అస్త‌మాను మెచ్చుకోమంటే ఎలా...

అస్త‌మానం మెచ్చుకోవాల‌ని ఆశించేవారితో డేటింగ్ చేస్తే ఒక ర‌కంగా న‌ర‌కం అనుభ‌విస్తాం. ఇలాంటి వాళ్లు త‌మ అందం ప‌ట్ల ఎక్కువ మోజు క‌లిగి ఉంటారు. ఇత‌రులు ఎప్పుడూ త‌మ‌ను పొగ‌డాల‌ని, మెచ్చుకోవాల‌ని చూస్తుంటారు. ఇత‌రుల‌ను వూరికే తిట్టి గొప్ప‌గా భావిస్తారు. అలాంటి వారితో జీవితాన్ని సుఖంగా బ్ర‌త‌క‌లేం.

ఏడుపుగొట్టు మొహంవాళ్ల‌తో...

ఏడుపుగొట్టు మొహంవాళ్ల‌తో...

మీరు గ‌ట్టిగా నోరు తెరిచి అర‌వ‌క‌ముందే ఏడుపు లంకించికునేవాళ్ల‌తో ఎలా వేగ‌గ‌లుగుతారు. వాళ్ల‌ను స‌ముదాయించ‌డానికే స‌గం జీవితం గ‌డిచిపోతుంది. మీ భాగ‌స్వామి ఏడుపు మంత్రంతో జాలి పొందాల‌నుకుంటారు. ఇలాంటి రిలేష‌న్‌షిప్‌ను ఎంత కాలమ‌ని ఎవ‌రు భ‌రిస్తారు చెప్పండి.

న‌సిగే వాళ్ల‌తో...

న‌సిగే వాళ్ల‌తో...

మీ పార్ట‌న‌ర్ అస్త‌మానం .. నువ్వు న‌న్ను ఏమాత్రం ప్రేమించ‌డం లేదు... నువ్వు చాలా మారిపోయావు అని మీ పై షికాయ‌త్ చేస్తుంటే ఎంత అని భ‌రించ‌గ‌లుగుతారు చెప్పండి. రిలేష‌న్షిప్‌లో ప్ర‌తిసారీ ప్ర‌పోజ్ చేయాలంటే మీకు ఎంత క‌ష్ట‌మో వేరే చెప్పాలా? అనుభవం అయిన వారిని అడ‌గండి... మీ భాగ‌స్వామి ఉత్తిగా న‌సిగితే ఎంత‌ని భ‌రిస్తారు చెప్పండి.

అలర్ట్: ఇలాంటి మగవాళ్లకు దూరంగా ఉండటం మంచిది..!!

వాదించే వ్య‌క్తితో వేగ‌లేం...

వాదించే వ్య‌క్తితో వేగ‌లేం...

మ‌నం క‌లిసిన వ్య‌క్తి తెలివితేట‌ల‌కు, వారి లాజిక‌ల్ థింకింగ్‌కు తొలి రోజుల్లో ప‌డిపోతాం. అయితే అతిగా తెలివైన వ్య‌క్తుల వ‌ల్ల మ‌నం బోర్‌గా ఫీల‌య్యే అవ‌కాశం ఉంది. వాళ్లు ప్ర‌తి విష‌యాన్ని స‌మ‌యం సంద‌ర్భ‌మంటూ లేకుండా వాదిస్తూనే ఉంటారు. కాబ‌ట్టి ఇలాంటి వ్య‌క్తుల‌ను డేటింగ్‌కు ఎంచుకునేట‌ప్పుడు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించండి.

స్వార్థ‌బుద్ధి వారితో...

స్వార్థ‌బుద్ధి వారితో...

ఒక ప‌క్క పొద్దున్నుంచి త‌ల‌నొప్పి అని బాధ‌ప‌డుతుంటే ఇంటిని ఎందుకు శుభ్రం చేయ‌లేద‌ని మీ భాగ‌స్వామి అరుస్తున్నాడా... ఇలాంటి వ్య‌క్తుల‌కు ఏమ‌ని స‌ముదాయించాలి? వారాంతంలో మీరు మీ త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వాల‌ని ప్లాన్ వేసుకుంటే వెంట‌నే మీ భాగ‌స్వామి వాళ్ల త‌ల్లిదండ్రుల‌ను క‌లుద్దామ‌ని తీసుకెళితే మీకెలా అనిపిస్తుంది? ఇలా మీకు ఇష్టంగా లేని ప‌నులు చేస్తూ వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకునే వారితో ఎక్కువ కాలం సంతోషంగా జీవించ‌లేర‌న్న‌ది స‌త్యం.

English summary

Toxic People To Avoid Dating

Toxic people never allow others around them stay happy. So, here are some of those personalty types with whom it is better to avoid dating.
Subscribe Newsletter